Home /News /trending /

MOTHER OF ORPHANS PADMA SHRI AWARDEE SINDHUTAI SAPKAL DIES AT AGE 73 IN PUNE A GREAT SOCIAL WORKER MKS

Sindhutai Sapkal: రైళ్లలో బిచ్చమెత్తిన ఆమె.. అభాగ్యులకు అమ్మయింది.. ఇక తిరిగిరాని లోకాలకు..

అనాథ పిల్లలతో సింధుతాయ్ సప్కల్(పాత ఫొటో)

అనాథ పిల్లలతో సింధుతాయ్ సప్కల్(పాత ఫొటో)

చివరికి రైళ్లలో బిచ్చమెత్తే స్థితికి దిగజారినా.. తనపై తాను విశ్వాసం కోల్పోకుండా సాగించిన ప్రయాణం తర్వాతి కాలంలో తన లాంటి వేల మంది అనాథలకు చుక్కానిగా నిలిచింది. అభాగ్యులపాలిట అమ్మగా.. వేయి మంది అనాథలను దత్తత తీసుకున్న గొప్ప తల్లిగా ఎదిగింది. దేశం గర్వించదగ్గ మహిళ సింధుతాయి సప్కల్.

ఇంకా చదవండి ...
ఆమె జీవితం.. ఈ దేశంలో లక్షల సంఖ్యలో మన కళ్ల ముందే కదలాడే అభాగ్యులకు అంకితం. జీవితమనే స్కూలు ఆమెను పదేపదే ఫెయిల్ చేసినా.. చివరికి రైళ్లలో బిచ్చమెత్తే స్థితికి దిగజారినా.. తనపై తాను విశ్వాసం కోల్పోకుండా సాగించిన ప్రయాణం తర్వాతి కాలంలో తన లాంటి వేల మంది అనాథలకు చుక్కానిగా నిలిచింది. అభాగ్యులపాలిట అమ్మగా.. వేయి మంది అనాథలను దత్తత తీసుకున్న గొప్ప తల్లిగా ఎదిగింది. దేశం గర్వించదగ్గ మహిళ సింధుతాయి సప్కల్. పేద పిల్లల కోసం ఆమె చేసిన సేవను గుర్తించి కేంద్రం పద్మ పురస్కారాన్ని అందించింది. అయితే, తన వేయి మంది బిడ్డలను శాశ్వతంగా వదిలేసి తరిగిరాని లోకాలకు వెళ్లిపోయిందా తల్లి. ‘పద్మశ్రీ’ పురస్కార గ్రహీత, వెయ్యి మంది అనాథ బిడ్డల ఆత్మీయ తల్లి సింధుతాయ్ సప్కల్ (74) మంగళవారం పుణేలో తుదిశ్వాస విడిచారు. ఆమె మృతి దేశాధినేతలు, సాధారణ ప్రజలు సంతాపాలు తెలిపారు.

సింధుతాయ్ 1948 నవంబరు 14న మహారాష్ట్రలోని వార్ధా జిల్లాలో జన్మించారు. ఆమె నాలుగో తరగతి చదివారు. ఆమెకు పదేళ్ళ వయసులో 40 సంవత్సరాల వయసుగల వరునితో వివాహం జరిగింది. వివాహానంతరం ఆమె వార్ధాలోని నవర్‌గావ్ అటవీ ప్రాంతంలో స్థిరపడ్డారు. అయితే ఆమె గర్భవతిగా ఉన్నపుడు ఆ ఊరిలోని భూస్వామి ఆమెపై వదంతులు ప్రచారం చేశారు. దీంతో ఆమెను ఆమె భర్త వదిలిపెట్టారు. ఆమె కుటుంబీకులు ఆమెను రానివ్వలేదు. ఆమె కులం ఆమెను బహిష్కరించింది. ఆమె ఓ పశువుల పాకలో తన బిడ్డకు జన్మనిచ్చారు.

బిడ్డలకు అన్నం తినిపిస్తోన్న సింధుతాయి(పాత ఫొటో)

ప్రాణాలతో తిరిగొచ్చా.. సీఎంకు థ్యాంక్స్ : PM Modi‌ షాకింగ్ -చుక్కలు చూపించిన రైతులు.. ఏం జరిగిందంటే..రైళ్ళలో భిక్షాటన చేస్తూ, పాటలు పాడుతూ ఆమె జీవనోపాధి పొందారు. ఆ సమయంలో తల్లి అవసరమైన పిల్లలు అనేక మంది ఉన్నట్లు ఆమె గమనించారు. అప్పటి నుంచి ఆమె అనాథలు, తల్లిదండ్రులు విడిచిపెట్టిన పిల్లలను దత్తత తీసుకోవడం ప్రారంభించారు. సన్మతి బాల నికేతన్ సంస్థ పేరుతో ఓ అనాథాశ్రమాన్ని పుణేలోని హడప్సర్ ప్రాంతంలో ఏర్పాటు చేశారు. 1,000 మందికిపైగా బాలలను ఆమె దత్తత తీసుకున్నారు.

Banjara Hills Prashant : జోగినిగా మారిన ట్రాన్స్‌జెండర్ ప్రశాంతి.. వేడుకలా జోగుకల్యాణంఆమె చేసిన సామాజిక సేవకు గుర్తింపుగా ఆమెకు దాదాపు 750కి పైగా పురస్కారాలు లభించాయి. ఆమెను భారత ప్రభుత్వం 2021లో ‘పద్మశ్రీ’ పురస్కారంతో సత్కరించింది. మహారాష్ట్ర ప్రభుత్వం 2020లో ఆమెను అహల్యాబాయ్ హోల్కర్ పురస్కారంతో సత్కరించింది. సింధుతాయి మృతి పట్ల ప్రధాని మోదీ ప్రగాఢ సంతాపం తెలిపారు. ఆమె సమాజానికి విశిష్ట సేవలు అందించారని, ఆమెను ఎల్లప్పుడూ అందరూ గుర్తుంచుకుంటారని పేర్కొన్నారు. ఆమె కృషి వల్ల అనేకమంది బాలలు మెరుగైన జీవితాన్ని గడపగలుగుతున్నారని పేర్కొన్నారు.

రాష్ట్రపతి నుంచి పద్మశ్రీ పురస్కారం తీసుకుంటోన్న సిందుతాయి(పాత ఫొటో)

భారత్‌లో కరోనా మూడో వేవ్: వచ్చే 2వారాలు కీలకం.. Omicron సాధారణ జలుబు కాదుచాలాకాలంగా అనారోగ్యంతో బాధపడుతోన్న తాయికి గత ఏడాది నవంబరు 24న లార్జ్ డయాఫ్రాగ్మాటిక్ హెర్నియా శస్త్ర చికిత్స జరిగింది. అప్పట్లో ఆమె కోలుకున్నారు. కానీ ఓ వారం క్రితం ఆమెకు ఊపిరితిత్తుల్లో ఇన్ఫెక్షన్ సోకింది. అనంతరం ఆమె తీవ్రమైన గుండె పోటుతో బాధపడ్డారు. ఆమెను పుణేలోని ఓ ఆసుపత్రిలో చేర్పించారు. ఆమెకు డాక్టర్ శైలేష్ పుంటంబేకర్ చికిత్స చేశారు. మంగళవారం రాత్రి 8.10 గంటలకు ఆమె తుది శ్వాస విడిచారు. ప్రజల సందర్శనార్థం ఆమె పార్దివ దేహాన్ని మంజిరి ఆశ్రమంలో ఉంచారు. బుధవారం అంత్యక్రియలు నిర్వహించారు.
Published by:Madhu Kota
First published:

Tags: Maharashtra, Padma Shri, Pune

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు