Viral Video: అల్లుడిని చంకన ఎత్తుకుని అత్తగారి డ్యాన్స్ సూపర్

5 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అత్తగారు, అల్లుడు కలసి చాలా సేపు స్టెప్పులు వేశారు. వారి స్టెప్పులకు ఇరుగుపొరుగు వారు కూడా డ్యాన్సులు చేశారు.

news18-telugu
Updated: October 16, 2020, 9:02 PM IST
Viral Video: అల్లుడిని చంకన ఎత్తుకుని అత్తగారి డ్యాన్స్ సూపర్
అల్లుడిని ఎత్తుకుని డ్యాన్స్ చేస్తున్న అత్తగారు (Image Source; Facebook)
  • Share this:
పెళ్లంటే నూరేళ్ల పంట. పెళ్లి అనగానే అన్నిచోట్లా ఒకేలా జరగదు. చాలా చోట్ల చాలా సంప్రదాయాలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లో పెళ్లిళ్ల తంతు ఒకలా ఉంటే, తమిళనాడులో మరోలా ఉంటుంది. కేరళలో ఇంకోలా ఉంటుంది. అంతెందుకు తెలుగు రాష్ట్రాల్లోనే పెళ్లి సమయంలో కొందరు పాటించే సంప్రదాయలు మరో ప్రాంతంలో కనిపించవు. ఒక్కోసారి కుటుంబాల మధ్య కూడా భిన్నమైన సంప్రదాయాలు ఉంటాయి. అత్తింటి సంప్రదాయాలు ఒకలా ఉంటే, పుట్టినింటి సంప్రదాయాలు మరోలా ఉంటాయి. ఎన్ని భిన్నసంప్రదాయాలు ఉన్నా పెళ్లి అనేది ఓ అందమైన వేడుక. పది మంది వచ్చి ఆశీర్వదించే సందర్భం. అలాంటి భిన్నమైన, అందమైన సందర్భాలు అప్పుడప్పుడు కొందరిని ఆశ్చర్య పరుస్తూ ఉంటాయి. అలాంటి ఆశ్చర్యపరిచే, ఆనందపరిచే వీడియోను మనం ఇప్పుడు చూడబోతున్నాం. ప్రస్తుతం మనం చూడబోయే వీడియో బెంగాల్‌కు సంబంధించినది. అక్కడే పెళ్లికొడుక్కి తలపై ఓ రకమైన కిరీటం ధరిస్తారు. పెళ్లికూతురుకి శఠగోపం తరహాలో కిరీటం పెడతారు. అయితే, ఇక్కడ విషయం కిరీటాల గురించి కాదు. ఆ కిరీటం ధరించిన అల్లుడిని అత్తగారు చక్కగా చంకన ఎత్తుకుని డ్యాన్స్ చేసింది.

ఈ వీడియోలో పెళ్లికొడుకును చూస్తుంటే సుమారు 60 నుంచి 70 కేజీల బరువు ఉండే అవకాశం ఉంది. అంత బరువున్న అల్లుడిని అత్తగారు చంకన ఎత్తుకుని ఎంచక్కా స్టెప్పులు వేసింది. తన మీద, అల్లుడి మీద పూలు జల్లుతూ డ్యాన్స్ చేసింది. ఏదో శాస్త్రానికి అలా ఎత్తుకుని ఇలా దించేయలేదు. ఆమె చాలా సేపు అల్లుడిని చంకన ఎత్తుకుని డ్యాన్స్ చేసింది. అది కూడా ఎలాంటి ఆయాసం లేకుండా. ఆమె ముఖంలో భారీ బరువును మోస్తున్నాననే భావన ఏ మాత్రం కనిపించలేదు. చక్కగా డ్యాన్స్ చేస్తూ మధ్య మధ్యలో పూలు జల్లుతూ ఎంచక్కా ఆడింది. ఆమె పక్కన ఓ మహిళ మరో చిన్న పిల్లాడిని ఎత్తుకుని డ్యాన్స్ చేసింది. చిన్న పిల్లాడిని ఎత్తుకున్నావిడ ఎలా డ్యాన్స్ చేసిందో అత్తగారు కూడా అలాగే డ్యాన్స్ చేయడం ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవాల్సిన అంశం.



అల్లుడిని అయితే అంతసేపు ఎత్తుకుని డ్యాన్స్ చేసింది కానీ, కూతురిని మాత్రం ఎత్తుకోలేకపోయింది. ఆ సీన్ చూస్తేనే నవ్వు రావడం ఖాయం. బహుశా పెళ్లికూతురి అలంకారం వల్ల ఆమెను ఎత్తుకోవడం కుదరకపోయి ఉండొచ్చు. ఈ వీడియోలో మరో కొత్త సంప్రదాయ పద్ధతి కూడా కనిపించింది. అదేంటంటే, ఓ పెద్దావిడ ఒళ్లో పెళ్లికూతురు, పెళ్లికొడుకు ఒకరి తర్వాత మరొకరు కూర్చున్నారు. బెంగాల్లో ఓ సంప్రదాయం ఉంది. పెళ్లి చేసి అమ్మాయిని పంపించేటప్పుడు ఓ రకమైన వంటకాన్ని రుచి చూస్తుంది. ఆ తర్వాత తల్లి ఒళ్లో కూర్చుంటుంది. అంటే, ఆ కుటుంబంతో తన రుణం తీరిపోయిందనే సందేశం ఇందులో ఉంది.

5 నిమిషాలకు పైగా నిడివి ఉన్న ఈ వీడియోలో అత్తగారు, అల్లుడు కలసి చాలా సేపు స్టెప్పులు వేశారు. వారి స్టెప్పులకు ఇరుగుపొరుగు వారు కూడా డ్యాన్సులు చేశారు. మొత్తానికి పెళ్లి తప్పట్లు, తాళాలు, వేళాకోళాలు, డ్యాన్సుల మధ్య అందంగా జరిగింది.
Published by: Ashok Kumar Bonepalli
First published: October 16, 2020, 9:02 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading