హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Video Viral : కొడుకుకి తల కొరివి పెట్టిన అమ్మ .. ఆ తల్లి గుండె కోత ఎలాంటిదో ఈ వీడియో చూడండి ..

Video Viral : కొడుకుకి తల కొరివి పెట్టిన అమ్మ .. ఆ తల్లి గుండె కోత ఎలాంటిదో ఈ వీడియో చూడండి ..

(Photo Credit:Youtube)

(Photo Credit:Youtube)

Video Viral: ఎక్కడైనా తల్లికి కొడుకు తలకొరివి పెట్టడం చూశాం. కాని ఉత్తరప్రదేశ్‌లో ఓ తల్లి కొడుకు దహన సంస్కారాలు నిర్వహించింది. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో గుండెను రాయిగా చేసుకొని కొడుకు చితికి నిప్పంటించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

ఇంకా చదవండి ...

ఏ తల్లికి రాని కష్టం ఆ మహిళకి వచ్చింది. చెట్టంత ఎదిగిన కొడుకును చూసుకొని మురిసిపోయిన ఆ అమ్మ ఇప్పుడు వెక్కి వెక్కి ఏడుస్తోంది. జీవితంలో చివరి వరకు తోడు ఉండాల్సిన భర్త చనిపోయిన షాక్ నుంచి తేరుకునేలోపే తనను ఒంటరిని చేసి కొడుకు కూడా శాశ్వతంగా దూరమవడాన్ని జీర్ణించుకోలేకపోయింది. కొడుకుతో తలకొరివి పెట్టించుకోవాల్సిన తల్లి...బిడ్డ అంతిమ సంస్కారాలు తానే దగ్గరుండి నిర్వహించింది. ఓ మాతృమూర్తి గుండెకోతకు సంబంధించిన వీడియో ఇప్పుడు మనసున్న ప్రతి హృదయాన్ని విపరీతంగా బాధిస్తోంది. సోషల్ మీడియా(Social media)లో ఈ వీడియో(Video)నే విపరీతంగా వైరల్(Viral)అవుతోంది.

కొడుక్కి తలకొరివి పెట్టిన అమ్మ..

తల్లిదండ్రులు బిడ్డల ఆలన, పాలన చూడాలనుకుంటున్నారు. వాళ్లు ప్రయోజకులైతే వారి సంతోషంలో భాగం పంచుకోవాలని ఎదురుచూస్తారు. కాని ఉత్తరప్రదేశ్‌కి చెందిన ఓ తల్లి గుండె కోత...ఆమె అనుభవించిన ఆత్మక్షోభ మాటల్లో వర్ణించలేనిది. జౌన్‌పూర్‌ జిల్లాకి చెందిన అంజు పాఠక్‌ అనే మహిళ తన 30సంవత్సరాల కొడుకును దూరం చేసుకుంది. 30సంవత్సరాల హిమాన్షు పాఠక్ గత కొద్దిరోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ వారణాసిలోని ఆసుపత్రిలో తుది శ్వాస విడిచాడు. బిడ్డ మరణవార్తను విని తట్టుకోలేకపోయిన అంజు పాఠక్ గుండెను రాయిగా చేసుకున్నారు. ఒక్కగానొక్క కొడుకు చనిపోవడంతో..అతని అంతిమ సంస్కారాలు, సహన క్రియలు తల్లి స్థానంలో అంజు పాఠక్ నిర్వహించారు. రక్తసంబంధంతో పాటు తల్లీ, బిడ్డల బంధాన్ని మృత్యువు వేరు చేయడంతో రోధిస్తూనే కొడుకు చితికి తలకొరివి పెట్టి తుది వీడ్కోలు పలికింది అంజు పాఠక్. తల్లి స్థానంలో ఉండి బిడ్డకు దహన సంస్కారాలు నిర్వహించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.


ఒంటరైన తల్లి..

జౌన్‌పూర్‌ జిల్లాకు చెందిన బీజేపీ నాయకురాగా ఉన్నారు అంజు పాఠక్. పదేళ్ల క్రితమే భర్త రాజ్‌ నారాయణ్ పాఠక్ మృతి చెందడంతో బిడ్డను చూసుకుంటూ ధైర్యంగా బ్రతుకుతోంది ఆ తల్లి. అయితే ఊహించని విధంగా భర్తను కోల్పోయిన అంటు పాఠక్ బిడ్డ కూడా అనారోగ్యంతో మృతి చెందడంతో తట్టుకోలేకపోయింది. చివరి వరకు తోడు ఉండాల్సిన భర్త పదేళ్ల క్రితం కోల్పోయిన అంజు పాఠక్..ఒక్కగానొక్క కొడుకు హిమాన్షు పాఠక్‌ కూడా మృతి చెందడంతో బోరున విలపించారు. కన్నీరు తుడుచుకుంటూ కొడుకు చితికి తలకొరివి పెడుతున్న దృశ్యం అక్కడి వాళ్లనే కాదు...వీడియో చూస్తున్న వాళ్లను బాధిస్తోంది.

ఇది చదవండి:ఒకే ఇంట్లో ముగ్గురితో మహిళ లివ్ ఇన్ రిలేషన్ షిప్.. మరో మహిళకు డబ్బులు ఇచ్చారని..అస్తికలు వేరుకున్న తల్లి..

కన్నకొడుకు దూరమైన బాధలోనే సహన సంస్కారాలు నిర్వహించారు అంజు పాఠక్. తానే దగ్గరుండి అన్నీ కార్యక్రమాలను తన చేతుల మీదుగా జరిపించి..చివరకు బిడ్డ అస్తికలను కూడా చితిలోంచి వేరుకున్నారు. పవిత్ర నదుల్లో కలిపేందుకు తల్లి బిడ్డ ఆస్తికలను ఏరుకున్న దృశ్యం అందర్ని తీవ్రంగా బాధిస్తోంది.

First published:

Tags: Son, Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు