ఈ మల్లెలు ఎప్పుడూ వాడవు.. ఏడాది పొడవునా పూస్తాయి.. కారణం తెలిస్తే అవాక్కవుతారు..

Image : Twitter

"నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్".. అన్న నానుడిని గుర్తుకు తెచ్చే ఓ విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్అవుతోంది. తన బిడ్డలు ఏం అడిగిన తన చేతులతో చేసి పెట్టాలనే తల్లి పడే ఆరాటానికి ఇదో నిలువెత్తు రూపం అంటూ నెటిజన్లు తల్లి ప్రేమను వేనోళ్ల పొగుడుతున్నారు. 

  • News18
  • Last Updated :
  • Share this:
తల్లి ప్రేమ ఎలా ఉంటుంది అంటే కచ్ఛితంగా ఇలా ఉంటుందని మాటల్లో అభివర్ణించలేం. ఆ ప్రేమ లోతుపాతులను సృజిస్తేనే అసలు విషయం బోధపడుతుంది. "నెస్సెసిటీ ఈజ్ ద మదర్ ఆఫ్ ఇన్వెన్షన్".. అన్న నానుడిని గుర్తుకు తెచ్చే ఓ విషయం ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్అవుతోంది. తన బిడ్డలు ఏం అడిగిన తన చేతులతో చేసి పెట్టాలనే తల్లి పడే ఆరాటానికి ఇదో నిలువెత్తు రూపం అంటూ నెటిజన్లు తల్లి ప్రేమను వేనోళ్ల పొగుడుతున్నారు.

తన కుమార్తె కోరిందని ఓ అమ్మ ఏకంగా టిష్యూ పేపర్ ను ఉపయోగిస్తూ తన సృజనాత్మకతకు మరింత పదును పెట్టి మల్లె మాల కట్టి మురిసిపోయింది. నిజానికి వయసు రీత్యా ఆమెకు జాయింట్ పెయిన్స్ ఉన్నా వాటన్నింటినీ లెక్కచేయకుండా తన కూతురు అడిగిందని కృత్రిమ మల్లెలు సృష్టించి, వాటికి సువాసన చేర్చి, మాలలా కట్టింది. దీన్ని కుమార్తె సోషల్ మీడియాలో పెట్టి షేర్ చేయగా వీడియో చూసినవారు అంతా ఆశ్చర్యపోతున్నారు. ట్విట్టర్ యూజర్ సురేఖా ఇది మా అమ్మ టిష్యూ పేపర్ తో చేసినది అని పోస్ట్ చేసింది. మోకాళ్ల నొప్పులతో బాధపడుతున్న తన తల్లి ఇందుకోసం గంటల తరబడి ఓపికగా కూర్చుని తయారు చేసిందని చెప్పుకొచ్చింది.

అవాక్కైన నెటిజన్లు..

ఒక నెటిజన్ అయితే సురేఖ వాళ్ల అమ్మ చేతిలో మ్యాజిక్ ఉందని కామెంట్ చేశాడు. దీనికీ రిప్లై ఇచ్చిన సురేఖ.. ప్రాణం లేని కాగితాలకు తన అమ్మ చేతుల స్పర్శతో ప్రాణం పోసిందని ఆకట్టుకునేలా ట్వీట్ చేసింది. అయితే తామంతా ఇది నిజమైన గజ్రా అనుకున్నట్టు.. సురేఖ చెప్పేవరకు అవి కాగితం పూలని తెలియదంటున్నారు. మరోవైపు వేలాదిమంది నెటిజన్లు సురేఖ పోస్ట్ ను లైక్ చేస్తున్నారు. ఇలాంటి మాలలను కేవలం మల్లె పూలలానే కాకుండా చామంతి, ముద్దబంతి, రోజా పూలు ఇలా ఇష్టమొచ్చిన పూలను కాగితంతో తయారు చేసుకుని మాల అల్లితే అవి చెక్కుచెదరవు. వాటికి సహజసిద్ధమైన పరిమళం అద్దేలా మంచి సెంట్ లేదా స్ప్రే చల్లితే ఇవి ఘుమఘుమలాడుతాయి.

హెయిర్ యాక్సెసరీస్..

ఎథ్నిక్ వేర్ తో పాటు ఇలాంటి పూలను పెట్టుకుంటే మీ అందం ఇనుమడిస్తుంది. హెయిర్ యాక్సెసరీస్ గా మార్కెట్లో ఇవన్నీ అందుబాటులో ఉండగా వాటి ధర కాస్త ఎక్కువే. ఎంతైనా మనం ఇంట్లో అది కూడా మన స్వహస్తాలతో చేసుకుంటే వచ్చే సంతృప్తి వేరు కదా. వేసవి మొదలవుతోంది, మల్లెల ధర పెరుగుతోందనే బాధ అక్కర్లేదు, అవి వాడిపోతాయి, రెక్కలు రాలిపోతాయనే బాధ అస్సలు అవసరం లేదన్నమాట. భరతనాట్యం, కూచిపూడి వంటి సంప్రదాయ నృత్యం చేసేవారు ఇలాంటివి ఉపయోగించేవారు.. కానీ పెళ్లిళ్లకు, పేరంటాలకు వీటిని ఉపయోగించేవారి సంఖ్య పెరుగుతుండటంతో వీటిని ఆన్లైన్లో కూడా అమ్ముతున్నారు. విదేశాల్లోని ఎన్ఆర్ఐలు మల్లెపూలు పెట్టుకుని వెళ్లాలనుకుంటే ఇలా టిష్యూ పేపర్ తో చేసుకోవటం బెస్ట్ కదూ.
Published by:Srinivas Munigala
First published: