ఆరేళ్ల పిల్లాడి ఐడియా అదుర్స్... వాడిని టెక్కీ అనాలా? టక్కరోడు అనాలా?

టెక్నాలజీని ఈ రకంగా కూడా ఉపయోగించుకోవచ్చా అంటూ అందరూ ముక్కున వేలు వేసుకునేలా చేశాడు ఆ ఆరేళ్ల పిల్లాడు.

news18-telugu
Updated: December 30, 2018, 8:42 PM IST
ఆరేళ్ల పిల్లాడి ఐడియా అదుర్స్... వాడిని టెక్కీ అనాలా? టక్కరోడు అనాలా?
అలెక్సా వాయిస్ అసిస్టెంట్ సాయంతో హోంవర్క్ చేస్తున్న విద్యార్థి
  • Share this:
మీ ఇంట్లో ఆరేళ్ల పిల్లాడు ఉన్నాడనుకుందాం. మీరేదో పనిలో ఉండి.. వాడి హోం వర్క్ వాడినే చేసుకోమంటే ఏం చేస్తాడు. కాసేపు మారాం చేస్తాడు. ఇంకాసేపు ఏడుస్తాడు. నువ్వే చెప్పు అంటూ అమ్మ దగ్గరో, నాన్న దగ్గరో కాసేపు తిరుగుతాడు. అందరూ సహాయ నిరాకరణ చేస్తే.. చివరకు పుస్తకాలు ముందేసుకుని ఏదో చేస్తుంటాడు. కొందరు హోం వర్క్ చకచకా చేసేసి ఆడుకుంటారు. మరికొందరు పుస్తకాలతో కుస్తీ పడుతూ ఉంటారు. అయితే, ఈ కథలో మనం చెప్పుకోబోయే పిల్లాడు మాత్రం చాలా యాక్టివ్. టెక్నాలజీని ఎలా వాడుకోవాలో ఆరేళ్లకే ఔపోసన పట్టినట్టున్నాడు.

అమెరికాలోని న్యూజెర్సీలో ఉండే ఓ మహిళ తన ఆరేళ్ల కొడుకు హోంవర్క్ ఎలా చేస్తున్నాడో వీడియో తీసి దాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. అమెజాన్ తయారు చేసిన వాయిస్ అసిస్టెంట్ ప్రొడక్ట్ ‘అలెక్సా’ని ఉపయోగించి ఆ కుర్రాడు చకచకా హోం వర్క్ చేసేస్తున్నాడట. విచిత్రం ఏంటంటే ఆ కుర్రాడికి బాగా వచ్చిన సబ్జెక్ట్‌లోనే ఇలా అలెక్సా హెల్ప్ తీసుకుంటున్నాడట. ‘వాడికి బాగా బద్ధకం. బాగా వచ్చిన సబ్జెక్ట్ విషయంలోనే ఇలా చీటింగ్ చేస్తున్నాడు.’ అంటూ కొడుకుని చూసి తెగ మురిసిపోతోంది. అయితే, ఈ వీడియోను పోస్ట్ చేసిన ఆమె ‘వాడిని ఇప్పుడే కొట్టనా? తర్వాత కొట్టనా?’ అని సోషల్ మీడియాలో జనాన్ని ప్రశ్నించింది.




ఆరేళ్ల కుర్రాడి ఐడియాని చూసి నెటిజన్లు ఫిదా అయ్యారు. టెక్నాలజీని ఈ రేంజ్‌లో వాడుకుంటున్న పిల్లాడిని కొట్టడం ఏంటి అని కొందరు లాజిక్ తీశారు. ఐన్ స్టీన్ రెడీ అవుతున్నాడు అంటూ మరికొందరు కాంప్లిమెంట్ ఇచ్చారు. మా రోజుల్లో ఇంత టెక్నాలజీ ఉంటే బాగుండు అంటూ మరికొందరు బాధను వ్యక్తం చేశారు.






ఇందులో లాస్ట్ పంచ్ ఏంటంటే.. హోం వర్క్ మొత్తం పూర్తయ్యాక ‘హోం వర్క్‌లో సాయం చేసినందుకు థాంక్స్ అలెక్సా’ అంటూ ఆ కుర్రాడు కృతజ్ఞతలు చెప్పడం. అయితే, ఆ వాక్యం వీడియోలో లేదు.
Published by: Ashok Kumar Bonepalli
First published: December 30, 2018, 8:42 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading