గాయపడిన తన పిల్లను ఆస్పత్రికి తీసుకెళ్లిన పిల్లి...

Istanbul : మనం మనుషులం కాబట్టి... గాయపడిన వాళ్లను ఆస్పత్రికి తీసుకెళ్లాలని తెలుస్తుంది. మరి ఆ పిల్లికి ఎలా తెలుసు?

news18-telugu
Updated: May 3, 2020, 12:22 PM IST
గాయపడిన తన పిల్లను ఆస్పత్రికి తీసుకెళ్లిన పిల్లి...
గాయపడిన తన పిల్లను ఆస్పత్రికి తీసుకెళ్లిన పిల్లి... (credit - twitter - Merve Özcan)
  • Share this:
Istanbul : తల్లి ప్రేమకు ఈ ప్రపంచంలో ఏదీ సాటి రాదు. తన పిల్లలు ప్రాణాపాయంలో ఉంటే... వాళ్ల కోసం తల్లి ఎన్ని కష్టాలైనా పడుతుంది. తన పిల్లి కూన అనారోగ్యంతో ఉన్నప్పుడు ఆ తల్లి పిల్లి అదే చేసింది. తన పిల్లను నోటితో కరచి పట్టుకున్న తల్లి... దాన్ని ఆస్పత్రికి తీసుకొచ్చింది. ఇస్తాంబుల్‌లో ఈ ఘటన జరిగింది. ఆ పిల్లి చుట్టూ డాక్టర్లు ఉన్న దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. మార్వే ఒజ్‌కాన్ అనే ట్విట్టర్ యూజర్... ఈ ఫొటోలను షేర్ చేశారు. "ఈ రోజు మేం ఎమర్జెన్సీలో ఉన్నాం. ఎందుకంటే... ఓ పిల్లి తన పిల్లను నోట కరచుకొని... ఎమర్జెన్సీ రూంకి వచ్చింది" అని తెలిపారు.


ముందుగా ఆ పిల్లిని చూసిన డాక్టర్లు ఆశ్చర్యపోయారు. ఇదేంటి... ఆస్పత్రిలోకి పిల్లి వచ్చేస్తోంది అనుకుంటూ దాన్ని అడ్డుకోబోయారు. కానీ ఆ ఊర పిల్లి భయపడలేదు. "నా పిల్లను మీకు ఇవ్వొచ్చా లేదా" అన్నట్లుగా వారివైపు చూసింది. కానీ డాక్టర్లకు మేటర్ అర్థమైంది. వెంటనే ఆ పిల్లి కూనను తల్లి నుంచి తీసుకున్నారు. ఆ తర్వాత దానికి ట్రీట్‌మెంట్ చేశారు. అంతే కాదు... తల్లికి కూడా ఫుడ్డూ, పాలూ పెట్టారు. ప్రస్తుతం తల్లీ, పిల్లా క్షేమంగా ఉన్నాయి.

ఈ పిల్లి ట్వీట్ వైరల్ అయ్యింది. ఇప్పటికే దీన్ని 87వేల మంది లైక్ చెయ్యగా... 6వేల మంది రీట్వీట్ చేశారు. "తన పిల్లను కాపాడుకునేందుకు ఎవరు సాయం చేస్తారో ఆ పిల్లికి తెలియడం... హార్ట్ టచింగ్" అని ఓ యూజర్ కామెంట్ చేశారు.మార్చిలో ఇలాగే... ఓ కోబ్రా పాము... తన పిల్లల్ని తినేందుకు వస్తుంటే... ఓ ఉడుత ప్రాణాలకు తెగించింది. అప్పట్లో ఆ వీడియో వైరల్ అయ్యింది. అది మీరు చూసే ఉంటారు.


తల్లి ప్రేమ అనంతం. తన చివరి శ్వాస వరకూ... ప్రేమను పంచుతూనే ఉంటుంది. ఈ ఉడుత కూడా కోబ్రాతో వీరోచితంగా పోరాడి... తల్లి ప్రేమను చాటుకుంది.
First published: May 3, 2020, 12:22 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading