పసిపాపపై ప్రతాపం.. ఈమె తల్లి కాదు.. రాక్షసి..

కొట్టొద్దు..మమ్మీ అంటూ ఆ చిన్నారి చేతులు జోడించి వేడుకున్నా..ఆమె కనుకరించ లేదు.. ఆ కర్కశ తల్లి రాతి గుండె కనీసం కరగలేదు. అప్పటికీ ఆగకుండా.. చెప్పులు తీసుకొచ్చి మరీ చితకబాదింది.

news18-telugu
Updated: November 18, 2019, 11:13 PM IST
పసిపాపపై ప్రతాపం.. ఈమె తల్లి కాదు.. రాక్షసి..
చిన్నారిని కొడుతున్న తల్లి
  • Share this:
పిల్లలంటే అల్లరి..! అల్లరంటే పిల్లలు..! ప్రతి ఇంట్లోనూ ఉండేదే ఇది. చిన్న పిల్లలన్నాక అన్నం తినే విషయంలో.. స్కూల్‌కు వెళ్లే విషయంలో మారాం చేస్తారు. అలాంటప్పుడు తిట్టడం.. ఐనా వినకపోతే రెండు దెబ్బలు వేయడం.. సర్వ సాధారణమే..! కానీ ఇక్కడ కనిపిస్తున్న ఈమె అలాకాదు. ఓ తల్లిలా కాకుండా నరరూప రాక్షసిలా ప్రవర్తించింది. నాలుగేళ్ల తన కన్నకూతురిని ఇష్టానుసారం కొట్టింది. చెంపలు, వీపుపై విచక్షిణా రహితంగా దాడి చేసింది. జుట్టు పట్టి పైకి లాగి వీపు కందిపోయేలా ప్రతాపం చూపించింది. కొట్టొద్దు..మమ్మీ అంటూ ఆ చిన్నారి చేతులు జోడించి వేడుకున్నా..ఆమె కనుకరించ లేదు.. ఆ కర్కశ తల్లి రాతి గుండె కనీసం కరగలేదు. అప్పటికీ ఆగకుండా.. చెప్పులు తీసుకొచ్చి మరీ చితకబాదింది.

ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. జమ్మూ కశ్మీర్‌లోని కథువా జిల్లా నగరి ప్రాంతంలో ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. ఐతే ఈ వీడియోను ఆ పాప తండ్రే రహస్యంగా రికార్డు చేసినట్లు సమాచారం. భార్యాభర్తల గొడవల వల్ల.. తన కోపమంతా ఆ చిన్నారిపై ప్రదర్శించింది తల్లి. భర్త మీద కోపంతోనే కూతురిని ఇష్టమొచ్చినట్లు కొట్టినట్లు తెలుస్తోంది. వీడియో ఆధారంగా శిశు సంక్షేమశాఖ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జమ్మూ పోలీసులు తల్లిదండ్రులను అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.

First published: November 18, 2019, 10:35 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading