Viral Video: చంటి బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ.. మ్యాన్‌ హోల్‌లో పడిపోయింది.. అలా ఎలా జరిగిందంటే..?

చంటిబిడ్డతో సహా మ్యాన్‌హోల్‌లో పడిపోయిన మహిళ

రోడ్డు‌ మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి బయటకు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ప్రమాదాలు తప్పకపోవచ్చు.

  • Share this:
    రోడ్డు‌ మీద వెళ్లేటప్పుడు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. పిల్లలతో కలిసి బయటకు వెళ్తే మరింత జాగ్రత్తగా ఉండాలి. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా కొన్ని సార్లు ప్రమాదాలు తప్పకపోవచ్చు. అదే నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే మనమే ప్రమాదాలను ఆహ్వానించినట్టు అవుతుంది. తాజాగా బిడ్డను ఎత్తుకుని రోడ్డుపై వెళ్తున్న మహిళ మ్యాన్‌హోల్‌లో (manhole) పడిపోయింది. ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లిన మహిళ ఈ ప్రమాదం బారిన పడింది. ఇందుకు సంబంధించిన దృశ్యాలు అక్కడ ఏర్పాటు చేసిన సీసీటీవీ కెమెరాల్లో రికార్డు అయింది. ఈ ఘటన హర్యానాలో (Haryana) చోటుచేసుకుంది.

    వివరాలు.. హర్యానా ఫరీదాబాద్‌లోని జవహర్ కాలనీలో ఓ మహిళ బిడ్డను ఎత్తుకుని ఫోన్ మాట్లాడుకుంటూ రోడ్డుపై వెళ్తుంది. అయితే ఆమె వెళ్తున్న మార్గంలో ఓ స్టాండ్ పెట్టి ఉంది. అక్కడ మ్యాన్ ‌హోల్‌పై మూత లేకపోవడంతో అక్కడ ఆ స్టాండ్‌ను ఉంచారు. అయితే ఫోన్ మాట్లాడుతు నడుచుకుంటూ వెళ్తున్న మహిళ రోడ్డుపై ఉన్న స్టాండ్ వెనకాల మ్యాన్‌హోల్ ఉందనే విషయాన్ని గుర్తించలేదు. స్టాండ్ పక్కనే నడిచిన మహిళ.. మూత లేని మ్యాన్ హోల్ పై భాగంలో కాలు వేసింది. కొద్దిగానే కాలు మోపినట్టుగా ఆమె బిడ్డతో సహా మ్యాన్‌ హోల్‌లోకి (Mother and Child Fell in manhole) జారిపోయింది.

    Manmohan Singh Family: కేంద్ర మంత్రి తీరుపై మన్మోహన్ సింగ్ కుటుంబం అభ్యంతరం.. ఇలాగేనా చేసేది అంటూ..

    ఇది గమనించిన అక్కడి వారు వెంటనే అక్కడికి చేరుకున్నారు. మహిళను బయటకు తీసెందుకు ప్రయత్నాలు చేశారు. ఓ వ్యక్తి ఇతరుల సాయంతో మ్యాన్‌ హోల్ లోపలికి దిగాడు. అనంతరం అక్కడికి పెద్ద ఎత్తున జనాలు చేరుకున్నారు. చివరకు మ్యాన్ హోల్‌లో నుంచి మహిళను, ఆమె బిడ్డను సురక్షితంగా బయటకు తీశారు. దీంతో అక్కడి వారంతా ఊపిరి పీల్చుకున్నారు.

    Singhu border killing: రైతులు ఆందోళన చేస్తున్న సింఘు సరిహద్దుల్లో ఘోరం.. అత్యంత కిరాతకంగా హత్య.. ఈ హత్య చేసింది ఎవరు..?





    Viral Video: చెంబులో మూగజీవి తల.. సాయం చేయడానికి వెళ్లిన షర్మిల పార్టీ నేత.. అసలు విషయం తెలిసి పరుగో పరుగు..

    ఇందుకు సంబంధించిన దృశ్యాలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్‌గా (Viral on Social Media) మారాయి. మ్యాన్ హోల్‌లో పడిపోవడానికి మహిళ ఫోన్ మాట్లాడుకుంటూ రావడం వీడియోలో కనిపిస్తుంది. మ్యాన్ హోల్‌ను గమనించకపోవడం వల్లే ఇలా జరిగినట్టుగా వీడియో ద్వారా తెలుస్తోంది. ఇక, ఆ ప్రాంతంలో మ్యాన్ హోల్ కొంతకాలంగా అలాగే ఉంటుందని, ఆ సమస్యను పరిష్కరించమని అధికారులను కోరిన సరైన స్పందన లేదని స్థానికులు చెబుతున్నారు.
    Published by:Sumanth Kanukula
    First published: