మన దేశం నుంచి బయటకు వెళ్లాలంటే పాస్ పోర్టు ఉండాలి. విదేశాల్లో అడుగు పెట్టాలంటే ఆ దేశ వీసా ఖచ్చితంగా ఉండాల్సిందే. ముందుగా వీసా తీసుకొని అక్కడికి వెళ్లాలి. కానీ పాస్‌పోర్ట్‌తో కొన్ని దేశాలకు నేరుగా వెళ్లిపోవచ్చు. అక్కడ ల్యాండ్ అయ్యాక వీసా తీసుకోవచ్చు. ఏ పాస్పోర్టుతో అయితే నేరుగా ఎక్కువ దేశాలకు వెళ్లగలుగుతామో.. అది శక్తివంతమైన పాస్‌పోర్ట్. మరి ప్రపంచంలో శక్తివంతమైన పాస్‌పోర్ట్ కలిగిన దేశాలు ఏవో తెలుసా..? పవర్ఫుల్ పాస్‌పోర్ట్‌ల జాబితాను హెన్లీ అండ్ పార్ట్నర్స్ విడుదల చేసింది. ఐతే ఎప్పటిలానే ఈ ఏడాది కూడా జపాన్ అగ్రస్థానంలో నిలిచింది. జపాన్ పాస్పోర్టుతో ఏకంగా 191 దేశాలకు ముందస్తు వీసా లేకుండా నేరుగా వెళ్లిపోవచ్చు.
పవర్ఫుల్ పాస్‌పోర్ట్ కలిగిన దేశాల టాప్-10 జాబితా:
1. జపాన్ - 191
2. సింగపూర్ -190
3. జర్మనీ, దక్షిణ కొరియా - 189
4. ఫిన్లాండ్, లగ్జెంబర్గ్, స్పెయిన్ -188
5. ఆస్ట్రియా, డెన్మార్క్ - 187
6. ఫ్రాన్స్, ఐర్లాండ్, నెదర్లాండ్స్, పోర్చుగల్, స్వీడన్ - 186
7. బెల్జియం, న్యూజిలాండ్, నార్వే, స్విట్జర్లాండ్, బ్రిటన్, అమెరికా - 185
8. ఆస్ట్రేలియా, చెక్ రిపబ్లిక్, గ్రీస్, మాల్టా - 184
9. కెనడా - 183
10. హంగేరి - 182
పవర్ఫుల్ పాస్‌పోర్ట్ ఇండెక్స్ 2021 జాబితాలో భారత్ 85వ ర్యాంకుతో సరిపెట్టుకుంది. గతేడాది 84వ స్థానంలో నిలవగా.. ఈసారి ఒక స్థానం దిగజారింది. ఈసారి మనదేశానికి 58 స్కోర్ మాత్రమే సాధించింది. అంటే ఇండియన్ పాస్ పోర్ట్ ఉంటే ముందస్తు వీసా లేకుండానే 58 దేశాలకు వెళ్లవచ్చు. భారత్‌తో పాటు తజికిస్థాన్ కూడా 85వ ర్యాంకును పంచుకుంది. ఈ జాబితాలో ఆఫ్ఘనిస్తాన్ ఆఖరి స్థానంలో నిలిచింది. అత్యల్పంగా 26 స్కోర్ మాత్రమే సాధించింది. ఇక పాకిస్తాన్ 32 స్కోర్‌తో ఆఖరు నుంచి నాల్గో ర్యాంకును సాధించింది.