హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

10 లక్షలలోపు ధరలో.. అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

10 లక్షలలోపు ధరలో.. అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లు ఇవే.. ఓ లుక్కేయండి..!

దేశంలో పెట్రలోల్, డీజిల్ ధరలు పెరుగుతన్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో చాాలా మంది మంచి మైలేజినిచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. భారత్‌లో రూ.10 లక్షల లోపు ధరలో అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో పెట్రలోల్, డీజిల్ ధరలు పెరుగుతన్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో చాాలా మంది మంచి మైలేజినిచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. భారత్‌లో రూ.10 లక్షల లోపు ధరలో అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లేంటో ఇప్పుడు చూద్దాం.

దేశంలో పెట్రలోల్, డీజిల్ ధరలు పెరుగుతన్న సంగతి తెలిసిందే.. ఈ నేపథ్యంలో చాాలా మంది మంచి మైలేజినిచ్చే వాహనాల కోసం చూస్తున్నారు. భారత్‌లో రూ.10 లక్షల లోపు ధరలో అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లేంటో ఇప్పుడు చూద్దాం.

    భారత్ లో పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరిగిపోతున్నాయి. ఫలితంగా వాహనాలపై తిరిగేందుకు ప్రజలు ఆందోళన చెందుతున్నారు. వీటికి ప్రత్యామ్నాయంగా ఎలక్ట్రిక్ వాహనాలు ఉన్నప్పటికీ వాటి లోపాలు వాటికి ఉన్నాయి. ముఖ్యంగా కార్లు వాడే బదులుగా మోటార్ సైకిళ్ల వైపు మొగ్గు చూపుతున్నారు జనాలు. పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతున్నప్పటికీ మోటార్ సైకిళ్లకు మాత్రం డిమాండ్ పెరుగుతూనే ఉంది. అయితే ఎక్కువ మంది కూర్చొని ప్రయాణించడం వీటిలో కుదరదు. కాబట్టి కార్లలోనే మంచి మైలేజి వచ్చే వాహనాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇదే సమయంలో తక్కువ ధర కోసం చూస్తున్నారు. ప్రస్తుతం భారత మార్కెట్లో అత్యంత ఇంధన సమర్థవంతమైన అంటే మంచి మైలేజినిచ్చే పెట్రోల్ ఆటోమేటిక్ కార్లు ఉన్నాయి. ఈ నేపథ్యంలో రూ.10 లక్షల లోపు ధరలో అత్యుత్తమ మైలేజి ఇచ్చే కార్లేంటో ఇప్పుడు చూద్దాం.

    మారుతీ సుజుకీ డిజైర్..గతేడాది ఈ సరికొత్త వాహనం లాంఛ్ అయిన దగ్గర నుంచి ఈ జాబితాలో రారాజుగా వెలిగిపోతుందీ మోడల్. ఇది 1.2-లీటర్ డ్యూయల్ జెట్ యూనిట్ ఇంజిన్ ను కలిగి ఉంది. గతంలో కంటే మెరుగైన పవర్ ఔట్ పుట్ తో పాటు అత్యుత్తమ మైలేజినిచ్చేలా డిజైన్ చేశారు. ఇది లీటరుకు గరిష్ఠంగా 24.12 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా 88 హార్స్ పవర్ హెచ్ పీ, 113 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. ఈ 1.2-లీటర్ మోటార్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో దీని ధర వచ్చేసి రూ.7.41 లక్షల నుంచి రూ.8.90 లక్షల వరకు ఉంది.

    మారుతీ సుజుకీ స్విఫ్ట్.. ఈ జాబితాలో తర్వాత వస్తున్న కారు స్విఫ్ట్ మోడల్. సెడాన్ తో పోలిస్తే స్విఫ్ట్ హ్యాచ్ బ్యాక్ కొంచెం లైట్ గా ఉన్నప్పటికీ మైలేజి విషయంలో మాత్రం వెనుకంజలో ఉంది. డిజైర్ మాదిరే అదే ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. మారుతీ సుజుకీ స్విఫ్ట్ మైలేజీ వచ్చేసి లీటరుకు గరిష్ఠంగా 23.76 కిలోమీటర్ల వరకు ఇస్తుంది. ఎక్స్ షోరూంలో దీని ధర వచ్చేసి రూ.6.86 లక్షల నుంచి ప్రారంభమవుతుంది.

    డాట్సన్ రెడీ-గో.. మైలేజి అధికంగా ఇచ్చే కార్లలో ప్రధానమైన వాహనం డాట్సన్ రెడీ-గో. ఇది లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజీనిస్తుంది. అంతేకాకుండా 1.0-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉండి ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఈ కారు ఎక్స్ షోరూం ప్రారంభ ధర వచ్చేసి రూ.4.92 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.

    రెనాల్ట్ క్విడ్.. బీఎస్4 ఇంజిన్ ను కలిగి ఉన్నప్పుడు రెనాల్ట్ క్విడ్ అత్యధికంగా మైలేజినిచ్చే కారుగా గుర్తింపు తెచ్చుకుంది. అయితే బీఎస్6 మారిన తర్వాత మైలేజి కొద్దిగా తగ్గింది. 800సీసీ 1.0-లీటర్ గ్యూస్ ఇంజిన్ ను కలిగి ఉన్న ఈ వాహనం లీటరుకు గరిష్ఠంగా 22 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో రెనాల్ట్ క్విడ్ ప్రారంభ ధర రూ. 4.72 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.

    మారుతీ సుజుకీ వాగన్-ఆర్.. మారుతీ సుజుకీ వాగన్-ఆర్ రెండు ఇంజిన్ ఆప్షన్లను కలిగి ఉంది. ఇది చిన్న ఇంజిన్ అయినా మెరుగైన మైలేజినిస్తుంది. ఇది 1.0-లీటర్ 67 హార్స్ పవర్ హెచ్ పీ, 90 ఎన్ఎం టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. అంతేకాకుండా 21.79 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా ఇది 5-స్పీడ్ ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో మారుతీ సుజుకీ వాగన్ ఆర్ ప్రారంభ ధర రూ.5.48 లక్షలు

    మారుతీ ఎస్-ప్రెసో.. ఈ సరికొత్త ఎస్-ప్రెసో మోడల్ 1.0-లీటర్ ఇంజిన్ ను కలిగి ఉంది. సేమ్ టు సేమ్ వాగన్ ఆర్ మోడల్లో ఉన్న ఇంజిన్ నే ఇందులోనూ వినియోగించారు. ఇది లీటరుకు గరిష్ఠంగా 21.7 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.4.82 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.

    మారుతీ సుజుకీ సెలేరియో.. ప్రస్తుతం మార్కెట్లో దొరుకుతున్న అత్యుత్తమ మైలేజినిచ్చే పెట్రోల్ కార్లలో సెలేరియో మోడల్ ముందు వరుసలో ఉంది. ఎస్-ప్రెస్, వాగన్-ఆర్ మోడళ్లలో ఉన్న ఇంజిన్ నే ఇందులోనూ ఉపయోగించారు. పవర్ ఔట్ పుట్ కూడా ఆ కార్లలో మాదిరే ఉంది. అంతేకాకుండా ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ వ్యవస్థతో పనిచేస్తుంది. లీటరుకు గరిష్ఠంగా 21.63 కిలోమీటర్ల వరకు మైలేజినిస్తుంది. ఎక్స్ షోరూంలో ఈ కారు ప్రారంభ ధర రూ.5.42 లక్షలుగా సంస్థ నిర్దేశించింది.

    First published:

    Tags: Auto News, Automobiles, Cars

    ఉత్తమ కథలు