Viral Video: ఇండిగో ఫ్లైట్‌లో ‘దోమలు కొట్టుకుంటున్న’ ఎయిర్ హోస్టెస్..

విమానంలో దోమల బెడద గురించి ఓ వ్యక్తి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు.

news18-telugu
Updated: April 10, 2019, 11:27 AM IST
Viral Video: ఇండిగో ఫ్లైట్‌లో ‘దోమలు కొట్టుకుంటున్న’ ఎయిర్ హోస్టెస్..
ఇండిగో విమానం(ఫైల్ ఫొటో)
news18-telugu
Updated: April 10, 2019, 11:27 AM IST
సహజంగా విమానం అనగానే రిచ్ లుక్, అందమైన ఎయిర్‌హోస్టెస్.. మధ్య మధ్యలో స్నాక్స్, కాఫీ.. అంటూ సినిమాలో చూపించినట్టు సాధారణ ప్రజలు ఊహించుకుంటూ ఉంటారు. అయితే, విమాన ప్రయాణాల్లో ఎలాంటి ఇబ్బందులు వస్తుంటాయో, అందులో ప్రయాణించిన వారికి తెలుస్తుంటుంది. కాళ్లు చాపుకోవడానికి కూడా సరైన ప్లేస్ లేకుండా ఇరుకు సీట్ల మధ్య ఫ్లైట్ జర్నీలు చేసిన వాళ్లు చెబుతారు దాని గురించి. ఇదంతా ఎందుకు చెబుతున్నామంటే.. అసలు విమానంలో దోమలు ఉంటాయని మనం ఊహిస్తామా? కానీ, ఉంటాయి. ఈ వైరల్ వీడియోనే అందుకు సాక్ష్యం. బంగ్లాదేశ్‌లోని ఢాకా నుంచి కోల్‌కతా వెళ్తున్న ఇండిగో విమానంలో ఇలా దోమల దండు దాడి చేసింది. విమానంలో కూర్చున్న ప్రయాణికులు తీవ్ర ఇబ్బంది పడ్డారు. దీన్ని ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో షేర్ చేశారు.

‘మేం ఢాకాలో ఇండిగో ఫ్లైట్‌లో ఉన్నాం. దోమలు ఉగ్రవాదుల్లా దాడి చేస్తున్నాయి. జనం ఇబ్బంది పడుతున్నారు. ఇదిగో వీళ్లు (ఎయిర్‌హోస్టెస్) వాటిని చంపుతున్నారు.’ అని వీడియో తీస్తున్న వ్యక్తి చెబుతున్న దృశ్యాలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అయ్యాయి. ఆ వీడియోలో ఇద్దరు ఎయిర్‌హోస్టెస్ దోమల బ్యాట్ తీసుకుని వాటిని చంపుతున్నారు.





విమానంలో దోమల బెడద గురించి ఓ వ్యక్తి ఇండిగో ఎయిర్‌లైన్స్‌ను ప్రశ్నిస్తూ ట్వీట్ చేశాడు. దీనికి విమానయాన సంస్థ కూడా స్పందించింది. ప్రయాణికులకు మెరుగైన సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తామని తెలిపింది. 2018 ఏప్రిల్‌లో కూడా ఇలాంటి ఘటన జరిగింది. బెంగళూరు నుంచి వెళ్తున్న ప్రయాణికుడు కూడా ఇలా దోమల బెడద గురించి ఫిర్యాదు చేశాడు.
First published: April 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...