Video : అమెరికాలో టీవీల కలకలం... ఇళ్ల ముందు వదిలి వెళ్తున్నది ఎవరు?

Virginia : సహజంగా సినిమాల్లో ఇలాంటివి చూస్తుంటాం. అలాంటిది అమెరికాలో నిజంగానే అలా జరుగుతుంటే, ఆశ్చర్యపోవడం ప్రజల వంతవుతోంది.

Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 7:11 AM IST
Video : అమెరికాలో టీవీల కలకలం... ఇళ్ల ముందు వదిలి వెళ్తున్నది ఎవరు?
ఇళ్ల ముందు వదిలి వెళ్తున్న టీవీలు ఎవరివి (Image : Twitter - Richie_Duchon)
Krishna Kumar N | news18-telugu
Updated: August 15, 2019, 7:11 AM IST
తెల్లారే మీ ఇంటి డోర్ తెరవగానే అక్కడో టీవీ కనిపిస్తే, ఎలా ఫీలవుతారు? ఆ టీవీ ఎవరిది? దాన్ని అక్కడ వదిలిపెట్టిందెవరు? అసలు ఎందుకు వదిలారు? అందులో ఏదైనా బాంబు ఉందా? ఇలా ఎన్నో అనుమానాలు కలుగుతాయి. ఇప్పుడు... అమెరికా... వర్జీనియాలో అదే పరిస్థితి. దాదాపు 50 ఇళ్ల ముందు ఎవరో గానీ టీవీలు వదిలి పెట్టి వెళ్తున్నారు. ఎందుకో, ఏమిటో, ఎవరికీ తెలియట్లేదు. అక్కడ ప్రతీ ఇంటికీ సీసీ కెమెరాలు కామన్. వాటిలో దృశ్యాలు చూస్తే... మనం హెల్మెట్ పెట్టుకున్నట్లుగా... తలకు టీవీనే హెల్మెట్‌లా పెట్టుకున్న వ్యక్తులు... రెండు చేతులతో టీవీని తెచ్చి... ఇంటి ముందు పెట్టి... టాటా చెప్పి వెళ్లిపోతున్నారు. ముఖాలకు టీవీ సెట్ తగిలించుకోవడం వల్ల వాళ్లెవరో తెలియట్లేదు. అది ఒక్క మనిషి పని కాదనీ... కొంతమంది కావాలని ఇలా చేస్తున్నారనే అనుమానాలున్నాయి.




క్రిస్మస్ సమయంలో ఇలాగే... శాంటాక్లాజ్... చాక్లెట్లు, గిఫ్టులను ఇళ్ల ముందు పెట్టి వెళ్లిపోతారు. ఇప్పుడు టీవీ శాంటాక్లాజ్ ఇలాగే చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. ఎక్కువగా హెన్రికో కౌంటీలో ఇలా జరుగుతోంది. 1990 నుంచీ 2000 మధ్యలో వాడే... పాతరకపు డూమ్ టీవీలను వదిలివెళ్లారు. ఆదివారం నుంచీ పోలీసులకు ఒకటే కాల్స్ వెళ్తున్నాయి.
Loading...


ఇంటికో టీవీ ఇలా పెడుతుండటం సరదాగా చేస్తున్నారా లేక... ఏదైనా కుట్ర ఉందా అన్నది తెలియట్లేదు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటివరకూ దీని వల్ల ఎలాంటి ప్రమాదమూ లేదని పోలీసులు చెబుతున్నారు. టీవీలను స్వాధీనం చేసుకుంటున్న పోలీసులు... వాటిని రీసైక్లింగ్ చేయిస్తామని చెబుతున్నారు.
First published: August 15, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...