Video: బస్ పైకి ఎక్కిన ప్రయాణికులు.. కొంత దూరం వెళ్లాక షాక్

బస్ పైకి ఎక్కిన ప్రయాణికులు.. కొంత దూరం వెళ్లాక షాక్ (image credit - twitter)

Video: కొన్ని పనులు చేసేటప్పుడు ఎంతో థ్రిల్ కలిగిస్తాయి. కానీ... అవి ప్రాణాంతకం కావచ్చు. అసలు ఆ ప్రయాణికులు బస్సు పైకి ఎందుకు ఎక్కారు... ఆ తర్వాత ఏమైంది?

  • Share this:
    ఓ థ్రిల్లింగ్, షాకింగ్ వీడియో... ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. బస్సులో ప్లేస్ లేకపోవడంతో... ప్రయాణికులు బస్సు పైన ఎక్కారు. అది కూడా కొద్ది మంది కాదు దాదాపు 15 మంది దాకా ఎక్కారు. బస్ వెళ్తుంటే... అది వారికి ఎంతో థ్రిల్ కలిగించింది. అందరూ తమనే చూస్తున్నారనీ... ఎవరూ చెయ్యని అరుదైన పని తాము చేస్తున్నామని ప్రయాణికులు సంబరపడ్డారు. కేరింతలు కొట్టారు. చుట్టూ రోడ్డుపై వెళ్తున్న వారిని... హాయ్ హాయ్ అంటూ నానా హంగామా చేశారు. ఐతే... ఓ చోట తేడా కొట్టింది.

    బస్సును బైక్ పై వచ్చిన ఇద్దరు ఓవర్ టేక్ చేశారు. బస్ పై అంత మంది ఉండటం చూసి ఆశ్చర్యపోయారు. రోడ్డుపై బైక్ ఆపారు. దాంతో బస్ డ్రైవర్ సడెన్ బ్రేక్ వెయ్యాల్సి వచ్చింది. అంతే... ఆ బ్రేక్ వల్ల బస్ పై ఉన్న వారంతా ఒక్కసారిగా కింద పడ్డారు. లక్కీగా ఎవరూ చనిపోలేదు. స్వల్ప గాయాలతో బయటపడ్డారు. అసలు డ్రైవర్ ఇలా సడెన్ బ్రేక్ వేస్తాడని వారు ఊహించలేదు.

    ఆ వీడియోని ఇక్కడ చూడండి.



    ఇది కూడా చదవండి: Zodiac signs: ఈ 5 రాశుల వారికి డబ్బు కొరత ఉండదు...

    ఈ వీడియోని IPS ఆఫీసర్ రుపిన్ శర్మ... ట్విట్టర్‌లో షేర్ చేశారు. ఇలా బస్సుపైకి ఎక్కి ప్రయాణాలు చేయవద్దని ఆయన సూచించారు. నిజమే... చాలా సందర్భాల్లో ఇలా ప్రయాణాలు చేసిన వారికి... కరెంట్ తీగలో, చెట్ల కొమ్మలో అడ్డువచ్చి ప్రమాదాలు జరిగిన సందర్భాలున్నాయి. అందరూ తమనే చూడాలని చేసే ఇలాంటి అతి పనుల వల్ల ప్రాణాలు పోతే... అది కుటుంబ సభ్యులకు తీరని విషాదం మిగుల్చుతుంది.
    Published by:Krishna Kumar N
    First published: