Viral Video: ఫుట్ బాల్ ఆడి దుమ్మురేపిన దుప్పి.. వీడియో వైరల్

Viral Video: ఇటీవల ఓ దుప్పి ఫుట్ బాల్ ఆడి అందరినీ ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

news18-telugu
Updated: October 20, 2020, 7:41 PM IST
Viral Video: ఫుట్ బాల్ ఆడి దుమ్మురేపిన దుప్పి.. వీడియో వైరల్
Photo: Instagram
  • Share this:
ఫుట్ బాల్ ను ఇప్పటి వరకు మనుషులు మాత్రమే ఆడతారని మనకు తెలుసు. కానీ ఫుట్ బాల్ ను జంతువులు కూడా ఆడుతాయన్న విషయం తెలుసా? ఇదేంటి.. జంతువులు ఫుట్ బాల్ ఎలా ఆడుతాయి అని అనుకుంటున్నారా? ఇటీవల ఓ దుప్పి ఫుట్ బాల్ ఆడి మీలాంటి ఎందరినో ఆశ్చర్యపరుస్తోంది. ఆ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. ఇందుకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. అలస్కాలోని హోమర్ లోని మైదానంలో ఈ ఆశ్చర్యకర ఘటన చోటు చేసుకుంది. అక్కడ కొందరు యువకులు ప్రాక్టీస్ చేస్తుండగా మైదానంలోకి అకస్మాత్తుగా ఓ దుప్పి వచ్చింది.





అంతటితో ఆగకుండా ఆట ప్రారంభించి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. ఏదో మామూలుగా కాదండి.. అచ్చం క్రీడాకారుడిలాగానే కాళ్ల మధ్య బాల్ ను ఆడిస్తూ తన నైపుణ్యాన్ని ప్రదర్శించింది. ఈ వీడియోను ఇన్ స్టా గ్రాంలో పోస్టు చేయడంతో వైరల్ గా మారింది. అనేక కామెంట్లు, లైక్ లతో ఆ వీడియో వైరల్ గా మారింది. దుప్పులంటే మాకు చాలా ఇష్టం.. కానీ అవి ఫుట్ బాల్ ఆడుతాయని తెలియదంటూ కొందరు కామెంట్లు పెట్టారు. ఇలాంటి ఫుట్ బాల్ ఆటను నేను చూడలేందంటూ మరి కొందరు తన ఆశ్చర్యాన్ని వ్యక్తం చేశారు. గేమ్ లోకి ఎక్స్ట్రా ప్లేయర్ వచ్చిందని మరి కొందరు కామెంట్ చేశారు.
Published by: Nikhil Kumar S
First published: October 20, 2020, 7:11 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading