హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Monkeys Revenge: కుక్క‌ల‌పై కోతుల ప్ర‌తీకారం.. మ‌హారాష్ట్ర‌లో 250 కుక్క‌ల‌ను చంపిన కోతులు!

Monkeys Revenge: కుక్క‌ల‌పై కోతుల ప్ర‌తీకారం.. మ‌హారాష్ట్ర‌లో 250 కుక్క‌ల‌ను చంపిన కోతులు!

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

ప్ర‌తీకాత్మ‌క చిత్రం

Monkeys Revenge | ప్ర‌పంచ‌లో ఎన్నో వింత సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో చాలా వింత సంఘ‌ట‌న చోటు చేసుకొంది. తాజాగా మ‌హారాష్ట్ర‌లో ని బీడ్ జిల్లాలో మ‌జ‌ల్‌గావ్‌లో కోతులు (Monkeys) కుక్క‌ల‌ను చంపుతున్నాయి. గ‌త నెల రోజులుగా ఈ ఘ‌ట‌న జ‌రుగుతుందని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

ఇంకా చదవండి ...

ప్ర‌పంచ‌లో ఎన్నో వింత సంఘ‌ట‌న‌లు జ‌రుగుతుంటాయి. మ‌హారాష్ట్ర‌ (Maharashtra)లో చాలా వింత సంఘ‌ట‌న చోటు చేసుకొంది. మ‌నుషులే కాదు జంతువులు ప‌గ తీర్చుకుంటాయ‌ని అనిపించేలా కొన్ని ఘ‌ట‌న‌లు మ‌హారాష్ట్ర‌లో చోటు చేసుకుంటున్నాయి. తాజాగా మ‌హారాష్ట్ర‌లో ని బీడ్ జిల్లాలో మ‌జ‌ల్‌గావ్‌లో కోతులు (Monkeys) కుక్క‌ల‌ను చంపుతున్నాయి. గ‌త నెల రోజులుగా ఈ ఘ‌ట‌న జ‌రుగుతుందని గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఇప్ప‌టిదాకా 250 కుక్క‌ల‌ (Dogs)ను కోతులు చంపిన‌ట్టు గ్రామ‌స్తులు చెబుతున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు అటవీ శాఖాధికారులను సంప్రదించి కోతులను పట్టుకోవాలని కోరుతున్నారు. అటవీ శాఖ అధికారులు ఒకరోజు వచ్చినా ఒక్క కోతిని కూడా పట్టుకోలేక‌పోయార‌ని దీంతో వారు తిరిగి వెళ్లిపోయార‌ని గ్రామ‌స్తులు చెబుతున్నారు.

గ్రామానికి చెందిన సీతారాం నైబాల్‌కు చెందిన కుక్కపిల్లను కూడా ప‌దిహేను రోజుల క్రితం కోతి తీసుకెళ్లిందని గ్రామ‌స్తులు తెలిపారు. కుక్కపిల్ల అరవడం ప్రారంభించడంతో, నైబాల్ తన పెంపుడు జంతువును రక్షించగలిగాడు. కుక్కను రక్షించేందుకు నైబాల్ కాలు విరిగి ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడ‌ని స‌మాచారం.

Madhavan's son: ఒలంపిక్స్ ల‌క్ష్యం.. దుబాయ్‌లో ట్రైనింగ్ తీసుకుంటున్న‌ ప్ర‌ముఖ హీరో కొడుకు


ఏం జ‌రిగింది..?

దీనిపై గ్రామ‌స్తులు భిన్నంగా స‌మాధానం ఇస్తున్నారు. కోతులు పగ తీర్చుకుంటున్నాయని గ్రామస్తులు చెబుతున్నారు. కొన్ని కుక్కలు పిల్ల కోతిని చంపడంతో ఇదంతా ప్రారంభమైందని, ఆ తర్వాత కోతులు ఆ ప్రాంతంలోని కుక్కలను భయంకరమైన రీతిలో చంపడం ప్రారంభించాయని గ్రామస్తులు తెలిపారు.

గ్రామంలో కుక్కల బెడద అంతంత మాత్రంగానే ఉన్నా కోతుల బెడద మాత్రం ఆగడం లేదని స్థానికులు చెబుతున్నారు. ప్రైమేట్‌లు పాఠశాల (Private Schools) కు వెళ్లే పిల్లలను లక్ష్యంగా చేసుకోవడం ప్రారంభించాయని నివేదిక పేర్కొంది. ఈ దాడులతో గ్రామస్తుల్లో భయాందోళనలు నెలకొన్నాయి.

Uttar Pradesh Elections: ఇటు 594కి.మీ గంగా ఎక్స్‌ప్రెస్‌వే ప్రారంభం.. అటు ఐటీ దాడులు


క‌ర్ణాట‌క‌లో మ‌రో ఘ‌ట‌న‌..

సెప్టెంబరులో, కర్ణాటక (Karnataka) లో కోతి ఊహించని పనిని చేసిన మరొక సంఘటన చోటు చేసుకొంది. చిక్కమగళూరు జిల్లా కొట్టిగెహరా గ్రామంలోని ఓ కోతి గ్రామస్థులపై పగ తీర్చుకునేందుకు 22 కిలోమీటర్లు ప్రయాణించింది. పాఠశాల ఆవరణలో కోతి సంచరించడం ప్రారంభించడంతో గ్రామస్థులు అటవీశాఖ అధికారులకు సమాచారం అందించారు. మూడు గంటల తర్వాత కోతిని ట్రాప్ చేయడానికి 30 మందికి పైగా బృందం పట్టింది. గ్రామానికి 22 కిలోమీటర్ల దూరంలోని బాలూర్ అడవుల్లో కోతిని వదిలేశారు. కానీ కోతి అడవికి సమీపంలో ఉన్న రహదారి గుండా వెళుతున్న ట్రక్కులోకి దూకింది. ఎలాగో ఒక వారం లోపే గ్రామానికి చేరుకుంది. కోతిని రెండోసారి పట్టుకుని అడవిలోపలికి వదిలారు.

First published:

Tags: Dog, Karnataka, Maharashtra, Monkeys

ఉత్తమ కథలు