కోతుల నుంచి మనిషి మార్పు చెందుకుంటూ వచ్చాడు. అయితే, కోతి చేష్టలు, అవి పనిచేసే పనులు అచ్చం మనలాగానే ఉంటాయి. కోతులు (Monkeys) గుంపులుగా తిరుగుతు ఉంటాయి. అవి మెయిన్ గా అడవుల్లో, చెట్లు ఎక్కువగా ఉన్న ప్రదేశాలలో ఉంటుంటాయి. కానీ ఈ మధ్య అడవులలో చెట్టు నరకటం, వాటికి సరైన ఆహరం దొరక్క , ఊర్లమీద, పట్టణాల మీద పడుతున్నాయి. ఈ క్రమంలో అవి ఇంట్లోకి ప్రవేశించి, తినే పదార్థాలను పట్టుకుని పారిపోతున్నాయి. ఇక దేవాలయాలు, గుట్టలు, కొండలు, మొదలైన వాటి చోట్ల అక్కడే వచ్చి పోయే వారు పెట్టే ఆహర పదార్థాలు తింటుంటాయి. కోతులు ఒక్కొసారి మూకుమ్మడిగా దాడులు చేస్తుంటాయి. కొన్ని సార్లు వాటిల్లో అవే పొట్లాడుకుంటాయి. ఈ క్రమంలో తీవ్ర గాయాలపాలవుతాయి. కొన్ని సార్లు అవి ఏదైన అనుకొని ప్రమాదాల బారిన కూడా పడుతుంటాయి. అయితే, ఇక్కకో కోతి తీవ్రంగా గాయపడింది. ఆ తర్వాత.. అది తన పిల్లతో సహా ట్రీట్ మెంట్ కోసం ఆస్పత్రికి వెళ్లింది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Social media) వైరల్ గా మారింది.
बिहार के सासाराम में आज एक बंदर अपने घायल बच्चे को लेकर एक डॉक्टर के क्लिनिक में पहुँच गया और इलाज कराने के बाद वहाँ से निकला @ndtvindia @Anurag_Dwary pic.twitter.com/kI7LIpvQw5
— manish (@manishndtv) June 8, 2022
పూర్తి వివరాలు.. బీహార్ లో (Bihar) ఒక వింత ఘటన జరిగింది. ససారంలో అనే గ్రామ పరిధిలో ఒక కోతి తీవ్రంగా గాయపడింది. మరీ అది వేరే కోతులు దానిపైన దాడిచేశాయో.. లేక ఎక్కడి నుంచి ప్రమాద వశాత్తు పడిందో కానీ ఆడ కోతికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో ఆ కోతి తన బిడ్డనేస్కోని షాజామా ప్రాంతంలోని ఆస్పత్రి ముందు వెళ్లి (Wounds Treated) కూర్చుంది. అక్కడి వారివైను బాధతో, దీనంగా చూసింది. అక్కడ కోతిని చూసిన వారు మొదట్లో చాలా భయపడ్డారు. కానీ అక్కడి డాక్టర్ అహ్మద్ కోతి (Monkey Visits Clinic) గాయమైనట్లు గమనించాడు. మెల్లగా దాని దగ్గరకు వెళ్లారు. ఆ తర్వాత దాన్ని క్లినిక్ లోపలికి తీసుకెళ్లి సపర్యలు చేశారు. కోతి కూడా ఎవరికి ఎలాంటి ఇబ్బంది కల్గించలేదు.
డాక్టర్ దాని గాయాలకు మందులు పూశారు. కాసేపు అక్కడే ఉండి, మెల్లగా వెళ్లిపోయింది. ఈ ఘటన చుట్టుపక్కల జనాలకు తెలియడంతో ఆస్పత్రికి గుంపులుగా గుంపులుగా చేరుకున్నారు. డాక్టర్ దగ్గర కోతి ట్రీట్ మెంట్ తీసుకుంటున్న సన్నివేశాన్ని తన సెల్ ఫోన్ లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video) హల్ చల్ చేస్తుంది. దీన్ని చూసిన నెటిజన్లు.. కోతి తెలివికి అబ్బుర పడుతున్నారు. అదే విధంగా, మూగ జీవి బాధను అర్థం చేసుకుని, సరైన వైద్యం అందించిన డాక్టర్ ను పొగుడుతూ కామెంట్ లు పెడుతున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar, Monkeys, Treatment, Viral Video