Monkey Revenge: పగ తీర్చుకోవడానికి 22 కిలోమీటర్లు ప్రయాణించిన కోతి.. అసలేం జరిగిందంటే..?

ప్రతీకాత్మక చిత్రం

ఇప్పటివరకు పాములు పగపడతాయనే (Snakes Revenge) కథనాలను విన్నాం.. ప్రతీకారం తీర్చుకునేందుకు అవి ఎంత దూరమైనా ప్రయాణిస్తాయనే వార్తలను చూశాం. కానీ పగతో రగిలిపోయే కోతుల గురించి ఎన్నడూ వినలేదు.

  • Share this:
ఇప్పటివరకు పాములు పగపడతాయనే (Snakes Revenge) కథనాలను విన్నాం.. ప్రతీకారం తీర్చుకునేందుకు అవి ఎంత దూరమైనా ప్రయాణిస్తాయనే వార్తలను చూశాం. కానీ పగతో రగిలిపోయే కోతుల గురించి ఎన్నడూ వినలేదు. అయితే కర్ణాటక రాష్ట్రంలో కనీవినీ ఎరుగని రీతిలో ఓ మగ కోతి (Monkey) ప్రతీకారంతో రగిలిపోతోంది. ఈ కోతిని తలుచుకుంటేనే.. కర్ణాటకలోని చిక్కమగళూరు జిల్లా(Chikkamagalur district) కొట్టిగెహర గ్రామ ప్రజలు హడలిపోతున్నారు. ముఖ్యంగా జగదీష్ అనే వ్యక్తి ఆ కోతి గురించి మాట ఎత్తితేనే భయంతో ఇంట్లోకి పరుగులు తీస్తున్నాడు. సెప్టెంబర్ 16, 2021 నుంచి అతని జీవితంలో ఈ రౌడీ కోతి భయంకరమైన విలన్‌గా మారింది. ఈ పోకిరి కోతి కథాకమామిషు ఏంటో తెలుసుకుంటే..

బోనెట్ మకాక్ జాతికి చెందిన ఒక మగ కోతికి దాదాపు 5ఏళ్ల వయసుంటుంది. ఇది కొట్టిగెహారా గ్రామ పరిసరాల్లో తిరుగుతూ అప్పుడప్పుడు పండ్లు, తినుబండారాలను దొంగలించేది. సాధారణంగా ఏ కోతి అయినా ఇలానే చేస్తుందని గ్రామస్తులు దాని గురించి అంతగా పట్టించుకోలేదు. అయితే పాఠశాలలు తిరిగి ఓపెన్ చేసిన తర్వాత ఈ కోతి ఆ ప్రాంతంలోని మొరార్జీ దేశాయ్ స్కూల్ (Morarji Desai School _ చుట్టూ తిరుగుతూ పిల్లల్లో భయం పుట్టించింది. దాంతో ఒక వ్యక్తి ఈ కోతిని పట్టుకొని అడవిలో వదిలేయాల్సిందిగా అటవీ శాఖకు (Forest department) ఫిర్యాదు చేశారు.

విషయం తెలుసుకున్న ఫారెస్ట్ అధికారులు ఒక టీమ్ గా ఏర్పడి ఈ కొంటె కోతిని పట్టుకోవడానికి ప్రయత్నించారు. కానీ అది అంత తేలిగ్గా దొరుకుతుందా... అధికారులకు చుక్కలు చూపించింది. విసిగి వేసారిపోయిన సదరు అటవీ అధికారులు సమీపంలోనే ఉన్న ఆటో డ్రైవర్లను, స్థానికులను హెల్ప్ చేయాల్సిందిగా అడిగారు. తాము చెప్పిన వైపు కోతిని తరిమితే.. దాన్ని మేం పట్టుకోగలం అని వారు డ్రైవర్లకు చెప్పారు.

India in UN Session: ఐక్యరాజ్యసమితి సమావేశాల్లో పాక్‌కు కౌంటర్ ఇచ్చిన భారత్.. తన స్పీచ్‌తో ‌పాక్‌ను నిలదీసిన స్నేహ..

ఆ సమయంలో అక్కడే ఉన్న ఆటోడ్రైవర్ జగదీష్ అధికారులకు సాయం చేయడానికి వెళ్లాడు. వారు చెప్పిన వైపు ఆ కోతిని దారి మళ్ళించడానికి అతడు దాన్ని విసిగించాడు. దాంతో బాగా ఆగ్రహానికి గురైన సదరు కోతి అతడి పైకి దూసుకొచ్చి దాడి చేసింది. అతడి చేతిని గట్టిగా కొరికి భయంకరంగా గీరింది. ఊహించని రీతిలో కోతి దాడిచేయడంతో బెదిరిపోయిన జగదీష్ అక్కడినుంచి పారిపోయాడు. కానీ కోతి అతడిని వదిలి పెట్టలేదు. అతడిని వెంబడిస్తూ చెమటలు పట్టించింది. చివరికి అతడు ఒక ఆటో రిక్షాలో దాక్కున్నాడు.

Second Marriage: అతడి వయసు 49.. రెండో పెళ్లి చేసుకోవాలని అనుకున్నాడు.. పెళ్లి కూడా ఫిక్స్ అయింది.. కట్ చేస్తే..

ఈ విషయం గ్రహించిన రౌడీ కోతి ఆటో టాప్ కవర్ ను పూర్తిగా చించేసింది. ఈ విధంగా ఆ కోతి ఆగడాలకు రోజుల తరబడి కొనసాగాయి. చివరికి ఓ రోజు 30 మంది ప్రజలు మూడు గంటలు కష్టపడి కోతిని పట్టుకున్నారు. అనంతరం దాన్ని అటవీ శాఖ అధికారులు గ్రామానికి 22 కి.మీ. దూరంలో ఉన్న బాలూర్ అడవికి (Balur forest) తీసుకెళ్లి అక్కడ విడుదల చేశారు.

శ్రీకాకుళం అమ్మాయి.. నల్గొండ అబ్బాయి.. ఇద్దరు ప్రేమించుకున్నారు.. కానీ అలా జరగడంతో..

దాంతో జగదీష్ ఊపిరి పీల్చుకున్నాడు. కోతి దాడిలో అయిన గాయాలు మానడానికి నెల రోజుల సమయం పడుతుందని డాక్టర్ చెప్పినట్లు అతను చెప్పాడు. కోతి ఎక్కడ దాడి చేస్తుందోననే భయంతో ఆటో పనికి కూడా వెళ్లకుండా ఇంట్లోనే ఉండిపోయానని జగదీష్ చెప్పుకొచ్చాడు. తన పిల్లలపై దాడి చేస్తే పరిస్థితి ఏంటని తాను ఇంటి బయట అడుగు పెట్టలేదని చెప్పాడు.

అయితే అతని ఆనందం ఎంతోకాలం నిలవలేదు. వారం రోజుల్లోనే ఆ కోతి కొట్టిగెహారా గ్రామానికి (Kottigehara village) తిరిగి వచ్చింది. ఇది అడవి గుండా వెళ్తున్న ఒక ట్రక్కు పైకెక్కి గ్రామంలోకి మళ్ళీ గ్రాండ్ ఎంట్రీ ఇచ్చిందని.. జగదీష్ తెలుసుకొని మరింత భయపడిపోయాడు. వెంటనే అటవీ అధికారులకు ఫోన్ చేసి విషయం తెలియజేశాడు. తనపై దాడి చేసిన కోతి చెవిపై ఓ మచ్చ ఉంటుందని.. ఆ గుర్తును బట్టి అదే కోతి మళ్లీ తిరిగి వచ్చిందని అతడు నిర్ధారించుకున్నాడు. ఈలోగా అటవీ శాఖ బృందం కోతిని రెండోసారి సెప్టెంబర్ 22న పట్టుకుంది. ఈసారి, వారు కోతిని మరింత దూరంలో ఉన్న అటవీ ప్రాంతంలో విడిచిపెట్టారు. కోతి తిరిగి రాకూడదని జగదీష్ ఆశిస్తున్నాడు. సేఫ్టీ కోసం కొన్ని రోజులు ఇంట్లోనే ఉంటానని చెబుతున్నాడు.

ముదిగెరె రేంజ్ ఫారెస్ట్ ఆఫీసర్ మోహన్ కుమార్(Mohan Kumar) మాట్లాడుతూ.. కోతి ఒక వ్యక్తిని ఎందుకు లక్ష్యంగా చేసుకుందో తమకు అర్థం కావడం లేదన్నారు. అతడు గతంలో ఏదైనా ఆ కోతికి హాని తలపెట్టాడా లేదా అనేది మాకు తెలియదని.. కానీ ఈ వింత ప్రవర్తన కోతిలో చూడటం ఇదే మొదటిసారి అని మోహన్ వెల్లడించారు.
Published by:Sumanth Kanukula
First published: