Home /News /trending /

MONKEY TAKES A JOY RIDE IN DELHI METRO RAIL TWO VIRAL VIDEOS SPREAD ON SOCIAL MEDIA PEOPLE STUNS WATCHING THEM NK

Metrorail video: మెట్రో రైల్లో కోతుల ప్రయాణం... మాస్క్ ఏది?... నెటిజన్ల సెటైర్లు

Metrorail video: మెట్రో రైల్లో కోతుల ప్రయాణం... మాస్క్ ఏది?... నెటిజన్ల సెటైర్లు (image credit - twitter)

Metrorail video: మెట్రో రైల్లో కోతుల ప్రయాణం... మాస్క్ ఏది?... నెటిజన్ల సెటైర్లు (image credit - twitter)

Metrorail video: మెట్రోరైల్లో కోతుల ప్రయాణం అనే అంశం ఇప్పుడు వైరల్ అవుతోంది. అలా ఎందుకు జరిగిందని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. ఇందుకు కారణం ఎవరు... వారికి ఎలాంటి శిక్ష వేద్దాం అని సెటైర్లు వేస్తున్నారు.

    Metrorail video: మన దేశంలో అప్పుడప్పుడూ విచిత్రాలు జరుగుతూ ఉంటాయి. మెట్రో రైళ్లలో సెక్యూరిటీ విషయంలో చాలా స్ట్రిక్ట్‌గా ఉంటారు. అలాంటి మెట్రో రైల్లో ఓ కోతి ప్రయాణించడం ఇప్పుడు వైరల్ అయ్యింది. అసలే కోతి... కదిలే రైలు ఎక్కింది... అది ప్రశాంతంగా ఎలాగూ ఉండదు... ఏమైనా దాడి చేస్తుందేమో అని ప్రయాణికులు నానా టెన్షన్ పడ్డారు. ఐతే... ఆ కోతి జర్నీని ఎంజాయ్ చేసింది. ఎవర్నీ ఏమీ అనలేదు. దిక్కులు చూసింది, కూర్చుంది, నడిచింది, వేలాడింది... అన్ని కోతి చేష్టలూ చేసింది. ఇందుకు సంబంధించి 2 వీడియోలు ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.

    మొదటి వీడియోలో ఆ కోతి... ఓ ప్రయాణికుడి పక్కనే సీటులో కూర్చుంది. ఆ ప్రయాణికుడు ఈ కోతేంటి నా పక్కన ఉంది... అసలు ఇది ఎలా వచ్చింది అని చూస్తూ ఉన్నారు. ఆ కోతి... కిటికీ లోంచీ దిక్కులు చూస్తూ... ప్రయాణాన్ని ఎంజాయ్ చేసింది. ఆ వీడియో ఇక్కడ చూడండి.


    ఇక మరో వీడియోలో... ఆ కోతి చేసిన ఇతర చేష్టలన్నీ ఉన్నాయి. అది ఎక్కడెక్కడ తిరిగిందీ, ఎలా వేలాడింది... ప్రయాణికులు ఎలా టెన్షన్ పడిందీ... అన్నీ రెండో వీడియోలో ఉన్నాయి. అది ఇక్కడ మీరే చూడండి.


    ఢిల్లీ మెట్రోలోని బ్లూ లైన్‌లో... యమునా బ్యాంక్ స్టేషన్ మార్గంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఐతే... ఈ వీడియోలు ఎంతవరకూ నిజం అన్నది ఇంకా అధికారికంగా స్పష్టం చెయ్యలేదు. ఈ వీడియోలపై ఢిల్లీ మెట్రో రైలు కార్పొరేషన్ (DMRC) అధికారులు స్పందించారు. కోచ్ వివరాలు, స్టేషన్ వివరాలు ఇవ్వమని... ఓ ట్విట్టర్ యూజర్ పెట్టిన వీడియోకి రిప్లై‌గా కోరారు. ఈ ఘటనపై దర్యాప్తు చేస్తామని తెలిపారు.


    ఇది కూడా చదవండి: Business Ideas: లీటర్ పాలు రూ.2,700... ప్రత్యేకత చాటుకుంటున్న రైతు

    మొత్తానికి కోతి అంటేనే సరదాగా ఉంటుంది. దాని అమాయకపు అల్లరి అందరికీ నచ్చుతుంది. అలాంటి కోతి మెట్రో రైలులో ప్రయాణించడం అనేది ఫన్నీ ఘటనే. మరి ఇది నిజమా, కాదా అన్నది అధికారికంగా ప్రకటన వస్తేనే మనం కన్ఫామ్ చేసుకోగలం.
    Published by:Krishna Kumar N
    First published:

    Tags: Delhi, Metro Train, Viral Videos

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు