Monkey Tail Beard: 2020లో మనం ఎన్నో షాకింగ్ విషయాలు చూశాం, తెలుసుకున్నాం. ఈ సంవత్సరం అలాంటివి ఏవీ లేవులే అనుకుంటుంటే... ఒకటి మొదలైంది. అదే కోతి తోక గెడ్డం ఛాలెంజ్. ఇదో భయంకరమైన ఫ్యాషన్ ట్రెండ్. ఈ ఛాలెంజ్ తీసుకున్నవారు తమ గెడ్డం కోతి తోకను పోలినట్లుగా స్టైల్ చేయంచుకోవాలి. ఆ తోక కుడివైపు లేదా ఎడమవైపు ఎటైనా ఉండొచ్చు. తోక చివరి భాగం గడ్డం ఉండే ప్రదేశంలో ఉండాలి. లేదా మీసానికి కలవాలి. లాక్డౌన్లు పోయి... నార్మల్ లైఫ్ స్టార్టవుతున్న సమయంలో ఇది పుట్టుకొచ్చింది. చూడ్డానికి ఇది అదో రకంగా ఉన్నా... ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఇది ట్రెండ్ సెట్టర్ అయిపోయింది. ఏదైనా కొత్తగా చేయాలనుకునేవారంతా దీన్ని ఫాలో అవుతున్నారు. ఇంటర్నెట్లో ఇలాంటి కోతి తోక గెడ్డాలు బోలెడు తయారయ్యాయి.
ఈ ఛాలెంజ్ స్వీకరిస్తున్నవారు... చాలా స్టైలిష్‌గా కోతి తోకను సెట్ చేయించుకుంటున్నారు. అదిరే రేంజ్లో ఫొటోలు తీసుకొని ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్ చేసి... మిగతా వారికి ఛాలెంజ్ విసురుతున్నారు. ఇన్నాళ్లు గుబురు గెడ్డాలు, సన్న గెడ్డాలు ఇలా రకరకాలు మెయింటేన్ చేసిన వారంతా... ఇప్పుడు ఈ ట్రెండ్ ఓసారి ట్రై చేస్తున్నారు.
ఇది చూస్తున్నప్పుడు... ఇలాంటిది ఇంతకుముందెప్పుడూ చూడలేదు అని మన జనరేషన్‌కి అనిపించవచ్చు. కానీ ఇది కొత్త ట్రెండేమీ కాదు. పూర్వం పిల్లి తోక గెడ్డం ట్రెండ్ (cat tail beard) ఉండేది. దాన్ని కాస్త మార్చి... పిల్లి ప్లేసులో కోతిని పెట్టారు. పిల్లి తోక గెడ్డంలో... మీసాల నుంచి తోక మొదలై... గెడ్డంలో ఎండ్ అవుతుంది. కొన్ని మార్పులతో ఈ ట్రెండ్ సరికొత్తగా వచ్చిందన్నమాట.
ఇప్పుడు ఇది ట్రెండ్ అయ్యింది కానీ... అసలు ఇది మొదలైనది 2019 సెప్టెంబర్‌లో అ్పటలో బేస్ బాల్ ప్లేయర్ మైక్ ఫీర్స్... ఈ తరహా షేప్ చేయించుకున్నాడు. అప్పట్లో తన టీమ్‌ని నవ్వించడానికి అతను అలా చేశాడు. అది అప్పుడు ట్రెండ్ అవ్వలేదు. ఇప్పుడు మాత్రం దుమ్మురేపుతోంది. ఇప్పుడు నెట్లో Monkey Tail Beard అని సెర్చ్ చేస్తే మీకు ఫొటోలే కాదు బోలెడు వీడియోలూ వచ్చి పడుతున్నాయి.
ఇది కూడా చదివేయండి:Zodiac signs: ఈ 5 రాశుల వారికి డబ్బు కొరత ఉండదు... వస్తూనే ఉంటుంది
"ఇది మంచిదా కాదా... ఇలా చేయించుకోవడం వల్ల ఎవరికి ఉపయోగం అని లెక్కలేసుకోవడం అనవసరం... జస్ట్ ఫాలో అయిపోవడమే" అంటున్నారు ఫాలోయర్లు. ఎప్పుడూ ఒకేలా ఉంటే ఏముంటుంది... అప్పుడప్పుడూ అయినా ఇలాంటి ట్రెండ్సూ, ఛాలెంజెస్సులూ స్వీకరించి... మార్పును కోరుకోవడమే మంచిది అంటున్నారు.
Published by:Krishna Kumar N
First published:January 20, 2021, 09:31 IST