హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral: కాసుల వర్షం కురిపించిన కోతి... కానీ ఆ పెద్దాయనకు పదిహేనువేల నష్టం

Viral: కాసుల వర్షం కురిపించిన కోతి... కానీ ఆ పెద్దాయనకు పదిహేనువేల నష్టం

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

బ్యాగ్‌ ఎత్తుకెళ్లని కోతి అది చాలదన్నట్లు... దానిని ఓపెన్‌ చేసి డబ్బులు బయటకు తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. అక్కడికి వచ్చిన జనం ఆ డబ్బులను ఏరుకునేందుకు ఎగబడ్డారు.

 • News18
 • Last Updated :

  అసలే కోతి.. కళ్లు తాగి ఉంది.. ఏమీ తాగకుండా ఉంటేనే దాని చేష్టలు భరించలేం. ఇక కళ్లు తాగితే ఏమైనా ఉందా..? దాని విచిత్ర చేష్టలకు అడ్డూ అదుపూ ఉండదు. ఇల్లు పీకి పందిరి వేస్తుంది. ఇక్కడ ఓ కోతి కూడా దాదాపు అదే పని చేసింది. కానీ ఈ కోతి కళ్లు కూడా తాగలేదండోయ్.. కానీ దాని వెకిలి చేష్టలు ఎక్కడికిపోతాయ్...! రోడ్డు మీద వెళ్తున్న పెద్దాయన చేతిలోంచి బ్యాగ్ తీసుకుని ఉడాయించింది. ఆ తర్వాత ఒక చెట్టు ఎక్కి.. ఆ బ్యాగ్ ను తనిఖీ చూసింది. ఏదో కాగితపు ముక్కలున్నాయనుకుని.. చెట్టు కొమ్మ మీద ఠీవిగా కూర్చుని వాటిని కిందికి విసిరేయడం చేసింది. కానీ దానికి తెలియదు.. తాను విసురుతున్నది చిత్తు కాగితాలు కాదు.. డబ్బులని.. అదంతా చూస్తున్న పెద్దాయనకు దాదాపు ప్రాణాలు పోయినంత పని అయింది. ఇంతకీ ఆ బ్యాగ్ లో ఎంతున్నాయంటే..?

  వివరాల్లోకెళ్తే.. ఉత్తరప్రదేశ్ లోని సీతాపూర్ లో చోటు చేసుకుందీ ఘటన. ఓ నడి వయసు వ్యక్తి స్థానికంగా ఉన్న వికాస్‌ భవన్‌ రిజిస్ట్రేషన్ ఆఫీస్‌ వద్దకు వచ్చాడు. అతడి చేతిలో ఒక బ్యాగ్‌ ఉంది. అందులో రూ. 4 లక్షల నగదు ఉంది. డబ్బు ఉండటంతో ఎంతో జాగ్రత్తగా వెళ్తున్న సదరు వ్యక్తిని.. కోతి గమనించింది. ఒక్క ఉదుటున అతడి దగ్గరకు వెళ్లి.. చేతిలో బ్యాగ్‌ తీసుకుని అక్కడ్నుంచి ఉడాయించింది. పక్కనే ఉన్న చెట్టు ఎక్కి కూర్చుంది.

  బ్యాగ్‌ ఎత్తుకెళ్లని కోతి అది చాలదన్నట్లు... దానిని ఓపెన్‌ చేసి డబ్బులు బయటకు తీసి గాల్లోకి విసరడం ప్రారంభించింది. అక్కడికి వచ్చిన జనం ఆ డబ్బులను ఏరుకునేందుకు ఎగబడ్డారు. మరికొందరు మాత్రం బాధితుడికి సాయం చేయాలని భావించి కోతిని పట్టుకునేందుకు ప్రయత్నించారు. పలు ప్రయత్నాల తర్వాత చివరకు కోతి బ్యాగ్‌ను వదిలేసింది. మాయదారి కోతి.. సుమారు రూ. 12 వేల నుంచి రూ. 14 వేల దాకా వెదజల్లినట్లు తెలిసింది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరలైంది.

  Published by:Srinivas Munigala
  First published:

  Tags: Monkeys, Trending, Up news, Uttarpradesh, Viral, VIRAL NEWS

  ఉత్తమ కథలు