హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

Viral News: కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులపాటు ఏం చేసిందంటే..!

Viral News: కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి.. మూడు రోజులపాటు ఏం చేసిందంటే..!

కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి

కుక్క పిల్లను కిడ్నాప్ చేసిన కోతి

ఇప్పటివరకూ మనుషులు మాత్రమే కిడ్నాప్‌లు, అపహరణలు వంటివి చేస్తారని అనుకున్నాం. పగతోనో, ప్రతీకారంతోనో లేదా డబ్బు ఆశతోనో మనుషులు సాటి మనుషులను, పెంపుడు జంతువులను సైతం కిడ్నాప్ చేస్తుంటారు.

ఇప్పటివరకూ మనుషులు మాత్రమే కిడ్నాప్‌లు, అపహరణలు వంటివి చేస్తారని అనుకున్నాం. పగతోనో, ప్రతీకారంతోనో లేదా డబ్బు ఆశతోనో మనుషులు సాటి మనుషులను, పెంపుడు జంతువులను సైతం కిడ్నాప్ చేస్తుంటారు. మరి జంతువులు ఇతర జంతువులను కిడ్నాప్ (Kidnap) చేస్తాయా? అంటే చాలామంది ‘నో’ అనే సమాధానం చెప్తారు. కానీ తాజాగా అడవిలో ఉండే ఒక కోతి (Monkey) మాత్రం ఒక కుక్కపిల్లను కిడ్నాప్ చేసి అందరికీ షాకిచ్చింది. ఇది కుక్కపిల్లను కిడ్నాప్ చేసి మూడు రోజుల పాటు తన వద్దే బందీగా ఉంచింది. అత్యంత నాటకీయ పరిణామాల మధ్య ఈ కోతి నుంచి ఎట్టకేలకు కుక్కపిల్లను రక్షించారు స్థానికులు. ఈ షాకింగ్ ఘటన(Shocking Incident) మలేషియాలోని తమన్ లెస్టారి పుత్ర (Taman Lestari Putra) లో చోటుచేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. మలేషియాలోని సారు అనే రెండు వారాల వయసున్న ఒక కుక్కపిల్లను (Puppy)సెప్టెంబర్ 16న ఒక అడవి కోతి కిడ్నాప్ చేసి తీసుకెళ్లింది. తర్వాత ఆ కుక్కపిల్లను తనవద్దే అంటిపెట్టుకుని కరెంటు స్తంభాలు, చెట్లపైకి ఎక్కుతూ స్థానికుల కంటపడింది. రోజులు గడుస్తున్నా.. ఆ కోతి మాత్రం కుక్కపిల్లను విడిచి పెట్టపోవడంతో స్థానికులు ఆందోళన చెందారు. కేవలం రెండు నెలల వయసున్న ఆ కుక్కపిల్ల ఆహారం లేక చాలా నీరసించి పోవడం చూసి చలించిపోయారు. ఈ కిడ్నాపర్ కోతి నుంచి కుక్క పిల్లను కాపాడేందుకు స్థానికులందరూ ప్రయత్నించారు.

కానీ ఆ కోతి కుక్కపిల్లను తన బిడ్డ అనుకుందో లేక క్లోజ్ ఫ్రెండ్ అనుకుందో గానీ దాన్ని మాత్రం అంత ఈజీగా వదిలిపెట్టలేదు. స్థానికులకు దొరక్కుండా మూడు రోజుల పాటు చెట్లపైనే తిరుగుతూ.. ముప్పు తిప్పలు పెట్టి మూడు చెరువుల నీళ్లు తాగించింది. తిను బండారాలను ఆశగా కూడా చూపించి కుక్కపిల్లను కాపాడాలని స్థానికులు ప్రయత్నించారు. కానీ ఆ కోతి మాత్రం ఊహించని రీతిలో ప్రవర్తించి అందరినీ విస్తుపోయేలా చేసింది.

చీరకట్టుతో వెళ్తే అవమానిస్తారా..? ట్విట్టర్‌లో వీడియో పోస్ట్ చేసిన మహిళ.. రెస్టారెంట్‌పై ఫైర్ అవుతున్న నెటిజన్లు


ఇక చివరికి మూడు రోజుల తరువాత స్థానికులు కోతిపై రాళ్లు, చెక్కలు విసిరి బెదిరించారు. దాంతో హడలిపోయిన ఆ కోతి కుక్కపిల్లను పొదల్లో విడిచి అడవిలోకి పారిపోయింది. ఆ వెంటనే కుక్కపిల్లను సంరక్షించారు స్థానికులు. అయితే కోతి.. కుక్క పిల్లను కిడ్నాప్ చేసిందే కానీ ఎలాంటి హాని చేయలేదని స్థానికులు చెబుతున్నారు. ఒక స్థానికుడు కుక్కపిల్లను దత్తత తీసుకొని దానికి ఆహారం, నీరు అందించారు. అలాగే ఏమైనా గాయాలు తగిలాయా? అని చెక్ చేశారు. ఈ కుక్కపిల్ల వీధికుక్కకి పుట్టి ఉండొచ్చని స్థానికులు భావిస్తున్నారు. తల్లి లేని సమయంలో కుక్కపిల్లను కోతి అపహరించి ఉండొచ్చని చెబుతున్నారు.

Dancing on Flyover: ఫ్లైఓవర్‌పై డ్యాన్స్ చేస్తూ వీడియో షూట్‌ చేసిన కమెడియన్.. తర్వాత ఏం జరిగిందంటే..


' isDesktop="true" id="1039390" youtubeid="WQC8PPowRds" category="trending">

అయితే స్థానికంగా ఆహార పదార్థాలు దొంగిలించే మంకీ గ్యాంగ్‌లో ఈ కిడ్నాపర్ కోతి కూడా ఒకటై ఉండవచ్చని స్థానికులు అనుమానిస్తున్నారు. ఈ ఘటన గురించి తెలుసుకున్న నెటిజన్లు రకరకాలుగా కామెంట్లు చేస్తున్నారు. ఇదెక్కడి దిక్కుమాలిన కోతి అని కొందరు తిట్టిపోస్తుండగా.. మరి కొందరు ఆశ్చర్యపోతున్నారు. జంతు ప్రేమికులు మాత్రం కుక్కని సంరక్షించిన స్థానికులపై ప్రశంసలు కురిపిస్తున్నారు.

First published:

Tags: Dog, Monkeys, Viral Video

ఉత్తమ కథలు