హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

OMG: కళ్లముందే లంచం ఇస్తున్న చూస్తూ ఊరుకున్న కలెక్టర్.. వీడియో వైరల్..

OMG: కళ్లముందే లంచం ఇస్తున్న చూస్తూ ఊరుకున్న కలెక్టర్.. వీడియో వైరల్..

కోతులను చూస్తున్న అధికారులు

కోతులను చూస్తున్న అధికారులు

Uttar pradesh: కోతులు మథురలోని బృందావన్‌లో నానా రచ్చ చేశాయి. స్థానికంగా ఉన్న సమస్యలను తనిఖీ చేయడానికి వచ్చిన కలెక్టర్ కు చుక్కలు చూపించాయి.

  • News18 Telugu
  • Last Updated :
  • Uttar Pradesh, India

కోతులు మూకుమ్మడిగా తిరుగుతుంటాయి. ఒకప్పుడు కేవలం అడవులకే పరిమితమైన కోతులు ఇప్పుడు మాత్రం, గ్రామాల్లో, పట్టణాల్లో కూడా కన్పిస్తున్నాయి. అవి ఆహారం మనుషుల ఇళ్లలోనికి చొరపడుతున్నాయి. ఆ తర్వాత.. వాటికి కన్పించిన ఆహార పదార్థాలను లాక్కొని వెళ్లిపోతుంటాయి. రోడ్డు మీద నడుచుకుంటూ వెళ్తున్న వారి నుంచి కూడా, చేతుల్లోని ఆహార పదార్థాలను లాక్కొని వెళ్తుంటాయి. ఇలాంటి ఘటనలు అనేకం గతంలో వార్తలలో నిలిచాయి. తాజాగా, మరో ఘటన వైలర్ గా మారింది.


పూర్తి వివరాలు.. ఉత్తర ప్రదేశ్ లో (Uttar Pradesh)  కోతులు నానా రచ్చ చేశాయి. మథురలోని బృందావన్‌ శ్రీకృష్ణుడి ఆలయం సమీపంలో ప్రతిరోజు కోతులు భక్తులను తెగ ఇబ్బందులకు గురిచేస్తుంటాయి. దర్శనానికి వచ్చిన వారి చేతులనుంచి ప్రసాదాలు, ఆలయానికి తీసుకెళ్లే పదార్థాలను లాక్కెళ్తుంటాయి. అయితే.. ఇప్పటికే స్థానిక ప్రజలు కోతుల బెడదతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కాగా, స్థానికంగా ఉన్న సమస్యలను తనిఖీ చేయడానికి బృందావన్‌ కలెక్టర్ నవనీత్ చాహల్ వచ్చారు. అప్పుడు ఆయన అక్కడున్న అధికారులతో మాట్లాడుతున్నారు.

తన కళ్లద్దాలను వాహనంపైన ఉంచారు. ఇంతలో కోతులు అక్కడికి వచ్చి.. కళ్లద్దాలను పట్టుకుని వెళ్లిపోయాయి. దీంతో కలెక్టర్ షాకింగ్ కు గురయ్యారు. వెంటనే దాన్ని పట్టుకొవడానికి అక్కడున్న అధికారులు కోతులను వెంబడించారు. కొన్ని గంటలపాటు వేచి చూసిన తర్వాత.. కోతులకి కొన్ని పళ్లు తినడానికి ఇస్తే.. అవి కళ్లద్దాలను అక్కడే వదిలేశాయి. దీంతో అధికారులు హమ్మాయ్య... అంటూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా, మథురలో కోతుల బెడద ఎక్కువగా ఉంది. అలాగే కోతుల భయం ఎంతగానో ఉంది. ఈ కోతుల వల్ల ప్రతిరోజూ లక్షల రూపాయలను భక్తులు నష్టపోతున్నారు. అలాగే స్థానిక పౌరుల మొబైల్ వ్యాలెట్లు ఏం దొరికితే అవి కోతులు లాక్కెళ్తున్నాయి.


కళ్లముందే లంచం ఇస్తున్న ఊరుకున్న కలెక్టర్..


కోతులు బృందావన్‌ కలెక్టర్ నవనీత్ చాహల్ కళ్లద్దాలను లాక్కొని పోయాయి. దీంతో అధికారులకు వాటికి ఏదైన ఇస్తే.. అవి తమ చేతిలోని కళ్లద్దాలను వదిలేస్తాయని ఐడియా వేశారు. మనుషుల మాదిరిగానే వాటికి కూడా వీక్ నెస్ ఉంటుంది. వాటికి పళ్లంటే ఎంతో ఇష్టం. అందుకే అధికారులు ప్లాన్ వేశారు. ఈ క్రమంలో.. అధికారులు.. కోతులకు కొన్ని పళ్లను వాటికి ఎరగా వేశారు. దీంతో అవి కళ్లద్దాలను వదిలేసి.. పళ్లను తింటూ అక్కడి నుంచి వెళ్లిపోయాయి. ఈ వీడియోను ఐఎఫ్ఎస్ అధికారి సుశాంత్ నందా తన ట్విటర్ ఖాతాలో పోస్ట్ చేశారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో సోషల్ మీడియాలో (Social media)  వైరల్ గా (Viral video) మారింది.Published by:Paresh Inamdar
First published:

Tags: Uttar pradesh, Viral Video

ఉత్తమ కథలు