Home /News /trending /

Delhi : కోతి చేసిన పనికి మనిషి ప్రాణమే పోయింది.. ఇంతకి కోతి అలా.. ఎందుకు చేసింది...?

Delhi : కోతి చేసిన పనికి మనిషి ప్రాణమే పోయింది.. ఇంతకి కోతి అలా.. ఎందుకు చేసింది...?

Delhi : కోతి చేసిన పనికి మనిషి ప్రాణమే పోయింది..

Delhi : కోతి చేసిన పనికి మనిషి ప్రాణమే పోయింది..

Delhi : ఢిల్లీలో ఓ విచిత్రమైన సంఘటన చోటు చేసుకుంది. కోతి చేసిన పనికి ఓ మనిషి ప్రాణమే పోయింది. ప్రాణాలు తీసింది కోతి అయినా.... అందుకు కారణమైన మరో ఇంటి యజమానిపై కేసు నమోదు అయింది. దీనికి సంబంధించి కారణాలు ఈ విధంగా ఉన్నాయి.

    ఇంటిపై నుండి ఓ కోతి (monkey ) ఇటుకను కిందకి విసిరి వేయడంతో.. కింద ఉన్న ఎదురింటి యజమాని తలపై (head) పడింది. ఇంకేముంది తలపగిలి తీవ్ర రక్తస్రావం కావడంతో చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయాడు..ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

    కోతుల బెడతతో అనేక మంది ఇబ్బందులు ఎదుర్కొవడం అందరికి తెలిసిందే... అయితే వాటినుండి తప్పించుకునేందుకు ఇంటి యజమానులు (house owner ) అనేక ప్రయత్నాలు చేస్తారు. ఇంట్లోకి రాకుండా పలు చర్యలు చేపడతారు. అయితే ఇంటిపై ఉండే వాటర్ ట్యాంక్‌లో ( water tank ) కూడా కోతులు దూకుతుండడంతో దానిపై మూతపెట్టిన ఆ ఇంటి యజమానికి పెద్ద షాక్ ఇచ్చాయి..

    ఇది చదవండి : ఆడబిడ్డ కళ్లకు గంతలు కట్టి.. ఆడుకుందామంటూ దారుణానికి దిగిన వదినా... !

    వివరాల్లోకి వెళితే.. సెంట్రల్ ఢిల్లీలోని ( Delhi ) నబికరీం ప్రాతంలో నివాసం ఉండే మహ్మద్ కుర్భాన్ అనే వ్యక్తి తల మీద ఓ ఇంటిపై నుండి ఇటుక పడింది. ఇటుక తలపై పడడంతో తీవ్ర రక్తస్రావం అయిన కుర్భాన్‌ను స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందారని వైద్యులు ధృవీకరించారు. దీంతో పోలీసులు గుర్తు తెలియని వ్యక్తి నిర్లక్ష్యం ద్వారా ప్రమాదం జరిగినట్టు కేసు నమోదు చేశారు.

    ఇది చదవండి : ప్రేమన్నాడు.. లొంగకపోతే రికార్డులు బయటపెడతానన్నాడు.. చివరకు ఆ యువతి... ?

    ఆ తర్వాత సంఘటనపై పోలీసులు ( delhi police ) విచారణ చేపట్టారు. తమ విచారణలో అసలు విషయం తెలిసింది. తలపై ఇటుకను ఎవరు వేశారనే కోణంలో పోలీసులు దృష్టి సారించారు. దీంతో ఆ ఇటుక పడిన ఓం ప్రకాశ్ మిశ్రా అనే ఇంటి యజమానిని ప్రశ్నించారు. ఈ క్రమంలోనే ఆ ఇటుకను తానే తన ఇంటిపై వాటర్ ట్యాంక్‌పై పెట్టానని , నిత్యం కోతులు వాటర్ మూత తీస్తుండడంతో మూత రాకుండా దానిపై రెండు ఇటుకలు పెట్టానని చెప్పాడు. ఈ క్రమంలోనే ఇంటిపైకి వచ్చిన కోతి ఆ ఇటుకను తీసి విసిరివేసినట్టుందని చెప్పాడు. ఈ నేపథ్యంలోనే ఇంటి ఆవరణలో ఉన్న మహ్మద్ కుర్బాన్ పై పడిందని చెప్పాడు.

    విచారణ అనంతరం పోలీసులు ఆ ఇంటి యజమాని ఓం ప్రకాశ్ మిశ్రాపై కేసు నమోదు చేశారు. అలసత్వంతోనే కోతులు ఇటుకలను కింద పడేశాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. దానికి సంబంధించి ఆయనపై ఎఫ్ఐఆర్ ( FIR ) నమోదు చేశారు. దీంతో ఈ సంఘట సంచలనంగా మారింది. తన ఇంటి రక్షణ కోసం పెట్టుకున్న ఇటుకలే మరో మనిషి ప్రాణం తీయడం చర్చనీయాంశంగా మారింది.
    Published by:yveerash yveerash
    First published:

    Tags: Crime news, Delhi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు