MONKEY HOISTS THE TRICOLOUR FLAG ON A SCHOOL BUILDING IN VIRAL VIDEO WATCH VIDEO HERE NK
Video: జెండా ఎగరేసిన కోతి.. మీరు ఎప్పుడూ చూడని అద్భుత దృశ్యం
జెండా ఎగరేసిన కోతి (image credit - instagram)
Viral Video: ఆగస్ట్ 15 నాడు దేశవ్యాప్తంగా నేతలు, ప్రముఖులు జెండా వందనం చేయడం చూశాం. ఇక్కడ ఓ కోతి... జెండాను ఆవిష్కరించి... అందరి చేతా శభాష్ అనిపించుకుంది.
Video: కోతులు చాలా తెలివైనవి. అవి మనుషుల్ని చూసి చాలా విషయాలు నేర్చుకుంటాయి. బట్టకు ఉతకడం, అంట్లు తోమడం, అరటి పండ్లు తినడం... ఇలా ప్రతీదీ గమనించి అలాగే చేస్తాయి. ఐతే... కోతి జెండా ఎగరేయడం మనం ఎక్కడా చూసి ఉండం... అలాంటి ఘటనకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ఈ వీడియోలో కోతి... ఓ స్కూలుపై జెండా ఉన్న కర్ర దగ్గరకు వచ్చింది. కర్రను బాగా ఊపింది. అయినప్పటికీ జెండా ఎగరలేదు. దాంతో... జెండాకు ఉన్న తాడును లాగేసింది. అంతే... పూల వాన కురిపిస్తూ... మువ్వన్నెల జెండా రెపరెపలాడింది. అది చూసి... అక్కడున్న వారంతా చప్పట్లు కొట్టారు. ఇదంతా మరో కోతి చూస్తూ ఉంది.
ఈ వీడియో బాగుందంటూ చాలా మంది లైక్ చేసి కామెంట్లు రాశారు. ఎక్కువ మంది చప్పట్లు కొట్టే ఇమోజీలు పెట్టారు. చాలా మంచి చప్పట్లు కొట్టండి అని కోరారు.
Published by:Krishna Kumar N
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.