Viral Video:కింగ్ కోబ్రాను ఆడేసుకున్న కోతి.. ఇది చూడాల్సిందే..

వానరం.. కోబ్రా తోకను లాగుతూ.. దాని మీదుగా ఎగిరి దుంకుతూ.. చుక్కలు చూపించింది. చూస్తున్నంత సేపు మనకే వామ్మో అన్పించేలా ఉన్నా.. వానరం మాత్రం ఏ జంకు లేకుండా కోబ్రాను ఆడేసుకుంది.

news18-telugu
Updated: June 4, 2020, 1:55 PM IST
Viral Video:కింగ్ కోబ్రాను ఆడేసుకున్న కోతి.. ఇది చూడాల్సిందే..
ప్రతీకాత్మక చిత్రం
  • Share this:
అది ఆరడుగుల కింగ్ కోబ్రా. చూస్తేనే ఒళ్లు జలదరిస్తుంది. కానీ అలాంటి కింగ్ కోబ్రాను సైతం ఓ వానరం గడ్డిపోచలా తీసేసింది. అటవీ ప్రాంతంలో కోబ్రా, కోతికి మధ్య జరిగిన పోరు ఉత్కంఠను రేపింది. వానరం.. బుసలు కొడుతున్న కోబ్రాను ముప్పుతిప్పలు పెట్టింది. వానరం.. కోబ్రా తోకను లాగుతూ.. దాని మీదుగా ఎగిరి దుంకుతూ.. చుక్కలు చూపించింది. చూస్తున్నంత సేపు మనకే వామ్మో అన్పించేలా ఉన్నా.. వానరం మాత్రం ఏ జంకు లేకుండా కోబ్రాను ఆడేసుకుంది. కళ్లముందే అంతేత్తునా లేచి బుసలు కొడుతున్న కోబ్రాను నోట కరుచుకునే ప్రయత్నమూ చేసింది. చివరకు ఆ కోతి సురక్షితంగా అక్కడి నుంచి బయటపడింది. సుసంత నంద అనే ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్ అధికారి తన ట్విట్టర్ ఖాతాలో ఈ వీడియోను పోస్టు చేశారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అయ్యింది.

Published by: Narsimha Badhini
First published: June 4, 2020, 1:41 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading