పాము కోసం చెట్టెక్కిన ముంగీస... ఆ తర్వాత... వైరల్ వీడియో

ముంగీస చూడ్డానికి చాలా చిన్నగా ఉంటుంది. కానీ... పాము కనిపిస్తే మాత్రం అది రెచ్చిపోతుంది. తాజా వీడియోలో జరిగిన విచిత్రాన్ని తెలుసుకుందాం.

news18-telugu
Updated: September 9, 2020, 8:45 AM IST
పాము కోసం చెట్టెక్కిన ముంగీస... ఆ తర్వాత... వైరల్ వీడియో
పాము కోసం చెట్టెక్కిన ముంగీస... ఆ తర్వాత... వైరల్ వీడియో (credit - twitter)
  • Share this:
విషపూరితమైన పాములు... శత్రువులు తమ జోలికి వస్తే... కాటేసి ప్రాణాలు కాపాడుకుంటాయి. కానీ... ముంగీసల దగ్గర పాముల ఆటలు సాగవు. చిన్న ముంగీస కూడా... పెద్ద పామును చంపడంలో సక్సెస్ అవుతుంది. అందుకు బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ వీడియో. మహారాష్ట్ర... వెస్ట్ నాసిక్ డివిజన్... అడవుల డిప్యూటీ కన్సర్వేటర్ ఆఫీసర్... ఈ వీడియోను ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇందులో ఓ పాము చెట్టు కొమ్మపై నిద్రపోతోంది. ఐతే... ఆ కొమ్మ దాదాపు భూమిని తాకుతున్నట్లుగా ఉంది. అక్కడ పాము ఉన్నట్లుగా ఎవరికీ కనిపించట్లేదు. ఎందుకంటే... ఆ చెట్టు చాలా గుబురుగా ఉంది. అలాంటి చోటికి ముంగీస వచ్చింది. పామును చూసింది. "దీన్ని పట్టుకుంటే... ఓ మూడ్రోజులు నాకు ఫుడ్‌కి ఢోకా ఉండదు" అనుకుంది. పాము కోసం... ఏకంగా చెట్టు ఎక్కింది.


చెట్టు ఊగగానే పాముకి మెలకువ వచ్చింది. అప్టటికే... పాము తలను... ముంగీస... తన నోట్లోకి లాక్కొని పట్టుకుంది. పాముకి తలే కీలకం. అలాంటి తలనే నోట్లో పెట్టుకునే సరిగి... అంత పెద్ద పాము కూడా... "అయిపోయాన్రా దేవుడా" అన్నట్లు చతికిల పడింది. కనీసం ముంగీసతో వేటాడదామన్నా... పాముకి ఏమీ కనిపించని పరిస్థితి. ముంగీసను తోకతో చుట్టేద్దామంటే... ఆ ఛాన్స్ ఇవ్వని చిన్న ప్రాణి... లేట్ చెయ్యకుండా... దాన్ని చెట్టు దగ్గర నుంచి ఇంకా ఇంకా లోపలికి పట్టుకుపోయింది. ఆ తర్వాత ఏం జరుగుతుందో మనకు తెలుసు.ముంగీసలకు పాముల్ని చంపే శక్తి ఉంటుంది. పాము కాటేస్తున్నా ముంగీస వెనక్కి తగ్గదు. ముఖ్యంగా కోబ్రాలను ముంగీసలు అస్సలు వదలవు. ముంగీసల్లో ఎసెటీఖోలైన్ రిసెప్టర్స్ (acetylcholine receptors) ఉంటాయి. అందువల్ల పాములు కాటేసినా... ముంగీసలకు ఏమీ కాదు. అంతేకాదు... ముంగీసలు చాలా వేగంగా స్పందిస్తాయి. పాము చుట్టుకుందామనుకునేలోపే... తప్పించుకుంటాయి. పాము తలను పట్టుకోవడంలో ముంగీసలు చాలా వేగంగా ఉంటాయి. తల గానీ దొరికితే... ఇక స్నేక్ పని అయిపోయినట్లే.


చిన్న ప్రాణి కూడా ఎంతో పట్టుదలతో కృషి చేసిందో... దాని ధైర్యం, పట్టుదలను చూడండి అని ఈ వీడియోకి కాప్షన్ పెట్టారు DCF వెస్ట్ నాసిక్. ఈ 45 సెకండ్ల క్లిప్‌ని IFS ఆఫీసర్ ప్రవీణ్ అంగుస్వామి రీపోస్ట్ చేశారు.
Published by: Krishna Kumar N
First published: September 9, 2020, 8:45 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading