హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

బాలికలపై అత్యాచారం కేసు.. లింగాయత్ మఠాధిపతికి నాలుగు రోజుల క‌స్ట‌డీ..

బాలికలపై అత్యాచారం కేసు.. లింగాయత్ మఠాధిపతికి నాలుగు రోజుల క‌స్ట‌డీ..

మఠాధిపతి శివమూర్తి మురుగ (ఫైల్)

మఠాధిపతి శివమూర్తి మురుగ (ఫైల్)

Karnataka: మైనర్ బాలికలను అత్యాచారం చేసిన ఘటనలో కన్నడనాట ప్రముఖ లింగాయత్ మఠాధిపతిని శివమూర్తి మురుగ శరణును పోలీసులు అరెస్టు చేసిన విషయం తెలిసిందే.

  • News18 Telugu
  • Last Updated :
  • Karnataka, India

కర్ణాటకలో ప్రముఖ‌ లింగాయత్ మఠాధిపతి శివమూర్తి మురుగ శరణుపై లైంగిక వేధింపుల ఘటన తీవ్ర కలకలంగా మారింది. దీంతో ఇది రాజకీయంగాను తీవ్ర దుమారంగా మారింది. మఠం నడుపుతున్న పాఠశాలలో చదువు కుంటున్న బాలికలు లైంగిక వేధింపులకు గురయ్యామని పోలీసులకు తెలియజేయడంతో ఘటన వెలుగులోనికి వచ్చింది. దీనిపై అధికారులు కేసు నమోదు చేసి, మఠాధిపతిని కోర్టులో హజరుపర్చారు. కోర్టులో ఘటనపై వాదోపవాదనలు జరిగాయి.

ఈ క్రమంలో కోర్టు.. మఠాధిపతికి నాలుగు రోజుల పాటు పోలీసు కస్టడీని ఇస్తు ఆదేశాలు జారీ చేసింది. అయితే.. అనారోగ్య కారణాలతో మఠాధిపతి వీల్ చైర్ లోనే విచారణకు హజరయ్యారు. కాగా, మఠాధిపతిని అరెస్టు చేయడంతో కన్నడ నాట అత్యంత నాటకీయ పరిణామాలు చోటు చేసుకున్నాయి. గురువారం రాత్రి పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. అదే విధంగా.. చిత్రదుర్గ ఆస్పత్రిలో టెస్ట్ లు చేశారు. ఆ తర్వాత.. జైలుకు తరలించారు.

ఇదిలా ఉండగా కర్ణాటక(Karnataka)లో రాజకీయంగా శక్తివంతమైన లింగాయత్ కమ్యూనిటీకి చెందిన ప్రముఖ స్వామీజీ శివమూర్తి శరణారావు(Shivamurthy Sharanaru)ను ఎట్టకేలకు పోలీసులు గురువారం అరెస్టు(Arrest) చేశారు. స్వామీజీ శివమూర్తి తమపై అత్యాచారానికి పాల్పడ్డారని 6 రోజుల క్రితం ఇద్దరు మైనర్ బాలికలు(Two Minor Girls) కేసు పెట్టిన విషయం తెలిసిందే. మౌనర్ బాలికల ఆరోపణల నేపథ్యంలో స్వామీజీ శివమూర్తిపై ఇప్పటికే పోక్సో చట్టం కింద కేసు నమోదైన సంగతి తెలిసిందే. అయితే అతడిని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడంపై పౌరసమాజం నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవడంతో గురువారం శివమూర్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. చిత్రదుర్గాలోని మురుగా మఠాధిపతి (Murugha Math) డాక్టర్ శివమూర్తి మురుగా శరణారావు(64)కు కర్ణాటకలో మంచి పేరుంది.

ఎందరో ప్రముఖులు మురుగ రాజేంద్ర మఠానికి వస్తుంటారు. కొద్దిరోజుల క్రితమే రాహుల్‌గాంధీ ఈ మఠంలో శివదీక్ష తీసుకున్నారు. గతంలో అమిత్‌షా, నడ్డా లాంటి ప్రముఖులు కూడా మఠాన్ని సందర్శించారు. లింగాయత్‌ సామాజిక వర్గంలో ఈ మఠానికి ఎంతో ప్రాముఖ్యత ఉంది. అయితే ఆగస్టు 26న మురుగా మఠం ఆధీనంలోని అక్కమదేవి విద్యాసంస్థల్లో చదువుకుంటూ హాస్టల్‌లో ఉంటున్న ఇద్దరు మైనర్ అమ్మాయిలు.. అయితే ఆగస్టు 26న మైసూరులోని ఓ స్వచ్ఛంద సంస్థ(NGO)ని ఆశ్రయించారు.

చాలా ఏళ్లుగా డాక్టర్ శివమూర్తి తమపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారని ఆ బాలికలు ఆరోపించారు.. ఆశీర్వాదం పేరుతో తమను ప్రతివారం పిలిపించిన స్వామీజీ..తమపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధిత బాలికలు ఆరోపించారు. ఎన్జీవో సాయంతో బాలికలు పోలీస్ స్టేషన్ కు వెళ్లి డాక్టర్ శివమూర్తిపై కేసు పెట్టారు. ఇద్దరు బాలికల్లో ఒకరు దళిత కమ్యూనిటీకి చెందినవారు కావడంతో స్వామీజీ శివమూర్తిపై పోస్కో(POSCO)తో పాటు ఎస్సీ-ఎస్టీ చట్టం కింద పోలీసులు కేసు నమోదుచేశారు.

Published by:Paresh Inamdar
First published:

Tags: Crime news, Karnataka, VIRAL NEWS

ఉత్తమ కథలు