సెమీస్‌లో షమీకి దక్కని చోటు...కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై కోచ్ గరంగరం

న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ఫేసర్ షమీని పక్కనబెట్టడంపై అతని చిన్ననాటి కోచ్ బద్రుద్దిన్ సిద్ధిఖీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. వరల్డ్ కప్‌లో 14 వికెట్లు సాధించిన షమీకి...సెమీఫైనల్ జట్టులో చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటూ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు.

news18-telugu
Updated: July 10, 2019, 1:30 PM IST
సెమీస్‌లో షమీకి దక్కని చోటు...కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై కోచ్ గరంగరం
భారత ఫేసర్ షమీ
  • Share this:
న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి ఫేసర్ షమీని పక్కనబెట్టడంపై అతని చిన్ననాటి కోచ్ బద్రుద్దిన్ సిద్ధిఖీ అసంతృప్తి వ్యక్తంచేశాడు. సెమీఫైనల్ జట్టులో షమీకి చోటు కల్పించకపోవడం సరైన నిర్ణయం కాదంటూ జట్టు కెప్టెన్ విరాట్ కోహ్లీ, జట్టు మేనేజ్‌మెంట్‌పై మండిపడ్డారు. న్యూజిలాండ్‌తో సెమీ ఫైనల్ మ్యాచ్‌కి షమీని పక్కనబెట్టిన జట్టు మేనేజ్‌మెంట్, అతని స్థానంలో భువనేశ్వర్ కుమార్‌కు చోటు కల్పించడం తెలిసిందే. ఈ నిర్ణయం తనను నిర్ఘాంతపరిచిందని బద్రుద్దీన్ సిద్ధిఖీ వ్యాఖ్యానించారు.

వరల్డ్ కప్‌లో షమీ 14 వికెట్లు సాధించాడని గుర్తుచేసిన ఆయన...ఫాస్ట్ బౌలర్ నుంచి ఇంతకుమించి ఏమి ఆశించగలమని ప్రశ్నించాడు. వరల్డ్ కప్‌లో ఆడిన 4 మ్యాచ్‌లలో షమీ 14 వికెట్లు సాధించాడు. ఇందులో ఆఫ్గన్‌తో మ్యాచ్‌లో సాధించిన హ్యాట్రిక్ వికెట్లు కూడా ఉన్నాయి. 1987లో చేతన్ శర్మ తర్వాత వరల్డ్ కప్‌లో హ్యాట్రిక్ సాధించిన భారత రెండో బౌలర్‌గా షమీ గుర్తింపు సాధించాడు.

శ్రీలంకతో జరిగిన మ్యాచ్‌కు షమీకి చోటు కల్పించకపోవడంతో అతనికి విశ్రాంతి ఇచ్చినట్లు భావించానని చెప్పారు. అయితే సెమీస్‌కు కూడా షమీకి చోటు దక్కకపోవడంతో తన ఆంచనా తప్పని ఆ తర్వాత తేలిందన్నారు.

First published: July 10, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>