ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్.. వేతనాల్లో కోత విధించిన కేంద్రం..

ISRO | ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ సభ్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధించింది.

Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 10, 2019, 11:22 AM IST
ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్.. వేతనాల్లో కోత విధించిన కేంద్రం..
ప్రతీకాత్మక చిత్రం
Shravan Kumar Bommakanti | news18-telugu
Updated: September 10, 2019, 11:22 AM IST
చంద్రయాన్-2 ప్రయోగం దాదాపు విఫలమైన నేపథ్యంలో యావత్తు దేశం ఇస్రో శాస్త్రవేత్తలకు అండగా నిలిచింది. ప్రధాని మోదీ సైతం.. సైన్స్‌లో ప్రయోగాలు మాత్రమే ఉంటాయని, వైఫల్యాలు ఉండవని వ్యాఖ్యానించి వారికి మద్దతు ఇచ్చారు. అయితే, ఇస్రో శాస్త్రవేత్తలకు షాక్ ఇచ్చేలా కేంద్ర ప్రభుత్వం ఓ నిర్ణయం తీసుకుంది. అంతరిక్ష పరిశోధనా సంస్థలో పనిచేస్తున్న సీనియర్ స్టాఫ్ సభ్యులు, శాస్త్రవేత్తలు, ఇంజనీర్ల వేతనాల్లో కోత విధించింది. అడిషనల్ ఇంక్రిమెంట్లను ఇచ్చేందుకు నిరాకరించడంతో జీతంలో కోత పడుతోంది. దీనికి సంబంధించిన ఉత్తర్వు జూన్‌ 12న విడుదల చేయగా, జూలై 1 నుంచి అమల్లోకి వచ్చింది. దీని ప్రభావంతో 90 శాతం మంది ఇస్రో ఉద్యోగుల వేతనాలు సగటున రూ.10వేల మేర తగ్గనున్నాయి.
జీతాల్లో కోత విధిస్తున్నట్లు ఉత్తర్వులు

వాస్తవానికి 1996లో కేంద్ర ప్రభుత్వం ఎస్‌డీ స్థాయి నుంచి ఎస్‌జీ స్థాయి ఉద్యోగులకు రెండు అదనపు ఇంక్రిమెంట్ ఇచ్చేందుకు ఆమోదం తెలిపింది. దాన్ని మోదీ సర్కారు వెనక్కి తీసుకుంది. కాగా, కేంద్ర ప్రభుత్వ చర్యను ఇస్రోలోని స్పేస్‌ ఇంజనీర్స్‌ అసోసియేషన్‌(ఎస్ఈఏ) తీవ్రంగా ఖండించింది. ఈ విషయాన్ని ప్రభుత్వానికి నివేదించి, వేతనాల్లో కోతలు లేకుండా చూడాలని ఎస్ఈఏ సభ్యులు ఇస్రో చైర్మన్‌ కె.శివన్‌ను కోరారు.

First published: September 10, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...