Viral video: డ్యాన్స్ చేయడం అంత తేలికేం కాదు. రెండు కాళ్లు ఉన్న వారే.. డ్యాన్స్ చేయడానికి తెగ ఇబ్బందులు పడుతుంటారు. కానీ ఇక్కడోక యువతి ఒక కాలు లేకున్న ఏమాత్రం నిరుత్సాహపడలేదు.
ఇప్పటి వరకు (Dance video) అమ్మాయిల డ్యాన్స్ వీడియోలు సోషల్ మీడియాలో లక్షల్లో వైరల్ అయ్యాయి. అమ్మాయిలు మాస్ స్టెప్పులతో డ్యాన్స్ లు చేస్తుంటే, నెటిజన్ లు షాకింగ్ కు గురయ్యారు. ఇప్పటికే బోలేడు వెరైటీ డ్యాన్స్ వీడియోలు వైరల్ అయ్యాయి. తాజాగా, ఇక్కడోక అమ్మాయి ప్రస్తుతం ఇంటర్నేట్ ను (Social media) షేక్ చేస్తోంది. తాను.. దివ్యాంగురాలైనప్పటికి ఏమాత్రం నిరుత్సాహపడలేదు. నేను కూడా అందరిలాగానే మాస్ స్టెప్పులు వేయగలనని నిరూపించింది. సదరు అమ్మాయి డ్యాన్స్ చేస్తుంటే.. చూసే వారంతా నోరెళ్ల బెడుతున్నారు.
యువతిని చూసి ఎందరో రోల్ మోడల్ గా తీసుకుంటున్నారు. ఇప్పటి వరకు పెళ్లిళ్ల డ్యాన్స్ వీడియోలు, బరాత్ లో డ్యాన్స్ వీడియోలు, వైరల్ అయ్యాయి. ఇప్పుడు కొత్తగా ఒక దివ్యాంగురాలు తన మాస్ స్టెప్పులతో ఒక రేంజ్ లో అదరగొడుతుంది. మోడరన్ దుస్తులు వేసుకుని ఏమాత్రం తగ్గెదేలే అన్నట్టు డ్యాన్స్ చేస్తుంది. డీజే పాటకు తగ్గట్టుగా ఒంటికాలిపై ఎగురుతూ.. మ్యూజిక్ కు సూట్ అయ్యేలా తన ఫెస్ ఎక్స్ ప్రెషన్స్ ఇస్తు అదరగొడుతుంది. యువతి ఒంటికాలుమీద ఎగురుకుంటూ.. డ్యాన్స్ చేస్తోంది. ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట (Viral video) తెగ హల్ చల్ చేస్తోంది.
ఇదిలా ఉంటే.. ఒక గున్న ఏనుగు తన యజమానితో ఫన్నీగా ప్రవర్తించింది. ఈ వీడియో వైరల్ గా మారింది.
ఒక ఎనిమల్ కీపర్ తన ఇంట్లో ఏనుగులోను (Elephant) పెంచుకుంటున్నాడు. దానికి ఒక చిన్న గున్న ఏనుగు ఉంది. అది తన యజమానితో కలసి తెగ అల్లరి చేస్తుంది. అది చేసే పనులు తెగ నవ్వులు తెప్పిస్తున్నాయి. దాని అల్లరిని భరించలేక, యజమాని దాన్ని వేరే చోట కట్టేసి తాను.. మాత్రం సెపరేట్ గా ఒక బెడ్ మీద పడుకున్నాడు. దీన్ని దూరం నుంచి గున్న ఏనుగు గమనించింది.
వెంటనే పరుగున అక్కడికి చేరుకుంది. చిన్న పిల్లలు తల్లిదండ్రులతో సరదగా అల్లరి చేసినట్లు ఏనుగు కూడా, తన కీపర్ తో బెడ్ కోసం చిలిపిగా ప్రవర్తించింది. బెడ్ పై నుంచి కీపర్ ను కిందకి తోసేసింది. అంతటితో ఆగకుండా అక్కడే ఉన్న ఆకు కుప్పల్లో కాసేపు బొర్లింది. ఆ తర్వాత.. దాని కీపర్ దాన్ని ప్రేమతో దగ్గరకు తీసుకొని చిన్న బెడ్ మీద పడుకోబెట్టాడు. ఈ ఫన్నీ వీడియో ను ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ అధికారి సామ్రాట్ గౌడ తన ఇన్ స్టాలో షేర్ చేస్తారు. ప్రస్తుతం ఈ ఫన్నీ వీడియో నెట్టింట తెగ హల్ చల్ చేస్తోంది.
Published by:Paresh Inamdar
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.