Shocking Video: షర్ట్ జేబులో కాలిపోయిన మొబైల్.. మంటలు, పొగలు.!

షర్ట్ జేబులో కాలిపోయిన మొబైల్..!

Shocking Video: ఈ వీడియో చూస్తే... ఇక మనం మొబైల్ జేబులో పెట్టుకోవాలంటే భయపడతాం. అసలు ఆ మొబైల్ షర్ట్ జేబులో ఎందుకు కాలిపోయింది... ఆ తర్వాత ఏమైందో వీడియో చూద్దాం.

  • Share this:
    Shocking Video: మొబైల్‌తో జరుగుతున్న రకరకాల నష్టాలను చూస్తూనే ఉన్నాం. చాలా సెల్‌ఫోన్లు... బ్యాటరీ సమస్యతో పేలిపోతూ ఉంటాయి. కొన్నైతే... ఛార్జింగ్ 100 శాతం అయ్యాక... ఆ తర్వాత కూడా ఛార్జింగ్ కంటిన్యూ చేస్తే... బ్యాటరీ ఉబ్బిపోయి పేలిపోయే సందర్భాలున్నాయి. అందువల్ల మొబైల్ ఎంత మేలు చేస్తుందో... అంత ప్రమాదకరంగానూ ఉండే ఛాన్సుంది. మొబైల్ పేలి ప్రాణాలు పోయిన ఘటనలూ గతంలో జరిగాయి. ప్రధానంగా బ్రాండెడ్ మొబైల్స్ ఎక్కువగా సమస్యలు తేవట్లేదు. చీప్ మొబైల్స్ మాత్రమే పేలిపోతున్నాయి. వాటిలో వాడే పరికరాలు, బ్యాటరీ అన్నీ అంతంతమాత్రంగానే ఉంటున్నాయి. అందువల్లే అవి బరస్ట్ అవుతున్నాయి.

    తాజాగా ఓ వీడియో తెరపైకి వచ్చింది. అది సీసీటీవీ ఫుటేజ్ వీడియో. ఈ ఘటన జరిగింది గుజరాత్‌లోని పటాన్ జిల్లాలో. అక్కడి రాధాన్పూర్‌లో... ఓ వ్యక్తి జేబులో మొబైల్ ఉంచుకొని... ఓ షాపులో ఏదో మాట్లాడుతున్నాడు. అలా అందరూ మాటల్లో ఉండగా... ఒక్కసారిగా మొబైల్ నుంచి పొగ రావడం మొదలైంది (Mobile Fire). తుళ్లిపడిన ఆయన.. వెంటనే మొబైల్ తీసి... నేలపై పడేశాడు. ఆ తర్వాత కొన్ని క్షణాల్లోనే మొబైల్ మంటల్లో కాలిపోయింది. బాధితుడు క్షణాల్లో మొబైల్ బయటకు తీసి పారేయడం వల్ల లక్కీగా అతనికి ప్రమాదం కాలేదు. షర్ట్ మాత్రం కొద్దిగా కాలింది.

    వీడియోను ఇక్కడ చూడండి.

    ఇలాంటిదే మరో ఘటన స్కాట్లాండ్‌లోని గ్లాస్గోలో జరిగింది. అందులో బాధితుడి పేరు ఆండ్రూ గ్రాంగెర్. ఓ ప్రముఖ కంపెనీ మొబైల్ కొన్నాడు. సిటీలోని ఓ ఇంటర్నేషనల్ ఫోన్ సెంటర్‌లో దాన్ని కొన్నాడు. అతను తన పాత ఫోన్‌ను ఎక్స్‌ఛేంజ్ చేసి కొత్తది కొనుక్కున్నాడు. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆ ఫోన్ వెడెక్కడం గమనించాడు. అది ఎందుకు త్వరగా వేడెక్కుతోందో అతనికి అర్థం కాలేదు. బహుశా రేడియేషన్ వల్ల అలా అవుతుందేమో అనుకున్నాడు. వీలైనంతవరకూ మొబైల్ వాడకుండా ఉందామని అనుకున్నాడు.

    ఇది కూడా చదవండి: Gold Price Today: 16 రోజులుగా బంగారం ధరల జోరు.. నేటి మార్కెట్ రేట్లు ఇవీ

    ఓ రోజు ఏదో పనిలో ఉంటూ... మొబైల్ చేతిలో పట్టుకున్నాడు. సడెన్‌గా చెయ్యి కాలినట్లు అనిపించింది. ఏంటా అని చూస్తే... మొబైల్ కాలిపోతోంది. వెంటనే దాన్ని నేలపై పడేశాడు. లక్కీగా అది అలా నేలపై పడగానే పేలిపోయింది. అతను ఒక్క సెకండ్ ఆలస్యం చేసి ఉంటే... చెయ్యికి తీవ్ర గాయాలు అయ్యేవే. ఫోన్‌లో ఉన్న బ్యాటరీ బ్రాండెడ్‌ది కాదు. అందువల్లే అది పేలిపోయిందని తెలిసింది. అందువల్లే మొబైల్ వాడేటప్పుడు... దానికి వాడే అన్ని పరికరాలూ బ్రాండెడ్‌వే ఉండేలా చూసుకోవాలి. మొబైల్ సర్వీస్ చేసేవాళ్లు... అంతంతమాత్రం బ్యాటరీలు వేసేస్తూ ఉంటారు. అలా జరగకుండా చూసుకోవాలి. ఎందుకంటే మొబైల్ కాలిపోతే... ప్రాణాలకే ప్రమాదం.
    Published by:Krishna Kumar N
    First published: