Mobile in stomach: రింగ్..రింగ్.. ఆరునెలలుగా సెల్‌ఫోన్ కడుపులోనే..

Mobile in stomach: రింగ్..రింగ్.. ఆరునెలలుగా సెల్‌ఫోన్ కడుపులోనే..

Mobile in stomach : వ్యక్తి కడుపులో ఆరునెలలుగా సెల్‌ఫోన్ ( Mobile ) ఓ వ్యక్తి కడుపులోనే ఉండిపోయింది. అంతపెద్ద సెల్ ఫోన్ మింగినా.. ఆ వ్యక్తికి ఆరు నెలలపాటు ఎలాంటీ ఇబ్బందులు తలెత్తలేదు.. అయితే ఇటివల ఒక్కసారిగా కడుపు నొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు ( Doctors ) సెల్ ఫోన్ ఉండడం చూసి ఆశ్చర్యపోయారు.

  • Share this:
    ఒక్కోసారి కొన్నిసార్లు విచిత్ర పరిస్థితులు నెలకొంటాయి. అనుకోకుండా జరిగే సంఘటనలు అశ్చర్యకరంగా అనిపిస్తాయి.. ఈ క్రమంలోనే ఓ వ్యక్తి సెల్ ఫోన్ మింగి ఆరునెలల పాటు కడుపులోనే దాచుకున్నారు. అయితే చివరికి కడుపు నొప్పి రావడంతో పరీక్షించిన వైద్యులు ఆ ఫోన్‌ను బయటకు తీశారు. ఈ ఘటన ఈజిప్ట్‌లో చోటు చేసుకుంది.

    వివరాళ్లోకి వెళితే..

    దక్షిణ ఈజిప్ట్‌లోని ఆస్వాన్‌ ప్రాంతానికి చెందిన వ్యక్తి ఆరు నెలల క్రితం పొరపాటున మొబైల్‌ను మింగేశాడట. ( mobile in stomach ) అయితే, అది జీర్ణమై మలం ద్వారా బయటకొచ్చేస్తుందని భావించి.. వైద్యులను సంప్రదించలేదు. మొదట్లో ఇబ్బంది లేకున్నా.. తర్వాత అతడికి ఆహారం తీసుకోవడం కష్టమైందట. అయినా ఆహారం తక్కువ మొత్తంలో తీసుకుంటూ కాలం వెల్లదీశాడు. కాగా.. ఇటీవల అతడికి కడుపులో విపరీతంగా నొప్పి రావడంతో ఆస్పత్రిలో ( Hospital ) చేరాడు. వైద్యులు ( Doctors ) పరీక్షలు నిర్వహించగా.. కడుపులో మొబైల్‌ఫోన్‌ను గుర్తించారు. ఆ ఫోన్‌ చాలాకాలం లోపలే ఉండిపోవడంతో కడుపు.. పేగుల్లో గాయాలై, ఇన్‌ఫెక్షన్‌ ( Infection ) సోకిందని వైద్యులు తెలిపారు. వెంటనే శస్త్రచికిత్స (operation )చేసి మొబైల్‌ను బయటకు తీశారు. ప్రస్తుతం అతడి ఆరోగ్యం నిలకడగా ఉందని.. తొందరగానే కోలుకుంటాడని వైద్యులు చెప్పారు.

    ఇది చదవండి : ఆ రైతులకు రైతు భీమా, రైతు బంధులు రద్దు.. గంజాయి సాగుపై సీఎం కీలక నిర్ణయం


    ఇది చదవండి : ఉద్యోగాలు వీడుతున్న లక్షల మంది... కరోనా తర్వాత అమెరికన్లలో కొత్త ధోరణి.


    టూ వీలర్‌పై 90 పెండింగ్ చాలన్లు

    ఇటివల హైదరాబాద్‌లో ట్రాఫిక్ పోలీసులు పెండింగ్ చాలన్ల పై దృష్టి సారించారు. దీంతో వాహానాల తనిఖీలు ముమ్మరం చేశారు. ఈ క్రమంలోనే తాజాగా ఓ టూ వీలర్‌పై 90 పెండింగ్ చాలన్లు ఉన్నట్టు గుర్తించారు. బుధవారం సికింద్రాబాద్ మహంకాళి పోలీసులు తనిఖీలు నిర్వహిస్తుండడంతో హెల్మెట్ లేకుండా లేకుండా వెళ్తున్న ఓ వ్యక్తిని ఆపి చెక్ చేయడంతో మొత్తం 90 చాలన్లు ఉన్నట్టు గుర్తించారు. కాగా అందులో 78 చాలన్లు హెల్మెట్ లేకుండా నడిపినందుకు పడిన ఈ చాలన్లుగా గుర్తించారు. కాగా చాలన్ల మొత్తం 32,960 రూపాయలు ఉండడంతో టూ వీలర్‌ను సీజ్ చేసినట్టు పోలీసులు తెలిపారు.
    Published by:yveerash yveerash
    First published: