Home /News /trending /

MLA RAJA SINGH ESCAPED FROM FLOODS IN AMARNATH PAH

MLA Raja Singh: అమర్ నాథ్ వరదలు.. తృటిలో తప్పించుకున్న ఎమ్మెల్యే రాజాసింగ్‌.. అసలేం జరిగిందంటే..

ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫైల్)

ఎమ్మెల్యే రాజాసింగ్ (ఫైల్)

Srinagar: గోషామహాల్ బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ కు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు. ఆయన అమర్ నాథ్ దర్శనం కోసం వెళ్లారు. ఈ క్రమంలో కొంత సేపటికే భారీ వరదలు వచ్చాయి.

అమర్ నాథ్ లో (amarnath)  కుండపోత వర్షం బీభత్సాన్ని సృష్టించింది. ఈ క్రమంలో అనుకోని ప్రమాదం వలన ఇప్పటికే పదుల సంఖ్యలో భక్తుల కొండ చరియల కింద శవాలుగా మారారు. మరికొందరి ఆనవాళ్ల కోసం అధికారులు గాలింపు చర్యలు చేపట్టారు. ఇప్పటి వరకు 10 మంది చనిపోయినట్లు అధికారులు అంచన వేస్తున్నారు. మరో నలభై మంది వరకు గల్లంతయ్యారు. ఇదిలా ఉండగా బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్ (Mla Raja singh) కు తృటిలో ప్రమాదం నుంచి బయటపడ్డారు.

వరదలు (Floods) పెద్ద ఎత్తున ముంచెత్త డానికి కొద్ది సేపటి ముందే రాజాసింగ్ అక్కడి నుంచి వెళ్లిపోయారు. అయితే, మంచు శివలింగం దర్శనం కోసం ఆయన అక్కడికి చేరుకున్నారు. కానీవాతావరణం బాగాలేదని, చాపర్ అధికారులు అనుమతించలేదు. సమయంలో రాజాసింగ్ సమీపంలోనే ఉన్నట్లు తెలిసింది.



వరద సంభవించిన ప్రదేశం నుంచి బయటకు వచ్చిన కొన్నినిముషాల్లోనే.. భారీ గావరదలు వచ్చాయని రాజాసింగ్ తెలిపారు. వాతావరణం అనుకూలించక పోవడంతో తాను వెనుతిరిగానని, అన్నారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పడంతో అందరు ఊపిరిపీల్చుకున్నారు. భారీ భద్రతల నడుమ రాజాసింగ్ ను అధికారులు శ్రీనగర్ కు (Srinagar)  తరలించారు.

ఇదిలా ఉండగా

కొద్దిరోజుల క్రితం ప్రారంభమైన అమర్‌నాథ్ యాత్రలో అపశృతి చోటు చేసుకుంది. అమర్‌నాథ్ గుహ సమీపంలో ఆకస్మికంగా వరదలు రావడంతో 9 మంది గల్లంతయ్యారు. వీరిలో ఐదురుగు చనిపోయినట్టు జమ్మూ కశ్మీర్ (Jammu and Kashmir) పోలీసులు తెలిపారు. దీంతో యాత్రను అధికారులు తాత్కాలికంగా నిలిపేసినట్టు తెలుస్తోంది. ఇక్కడ ఆకస్మికంగా భారీ వర్షం పడటం.. బలమైన నీటి ప్రవాహం రావడంతో మూడు యాంకర్లతో సహా అనేక టెంట్లు కొట్టుకుపోయాయి. సంఘటన తర్వాత అమర్‌నాథ్ యాత్ర (Amarnath Yatra) వాయిదా వేశారు. వెంటనే NDRF, SDRF బృందాలను సహాయక చర్యల కోసం మోహరించారు.

ఘటనా స్థలంలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయని.. ప్రస్తుతం పరిస్థితి అదుపులో ఉందని జమ్మూ కాశ్మీర్ పోలీసు ఐజిపి తెలిపారు. అమర్‌నాథ్ గుహ సమీపంలో భారీ వర్షాలు, కొండచరియలు విరిగిపడటంతో నీరు వచ్చిందని చెబుతున్నారు. ప్రస్తుతం రెస్క్యూ ఆపరేషన్ ద్వారా యాత్రికులను సురక్షితంగా తరలించే ప్రయత్నాలు కొనసాగుతున్నాయి.


కరోనా విజృంభణ తరువాత రెండేళ్ల పాటు అమర్‌నాథ్‌ యాత్రను ప్రభుత్వం నిలిపేసింది. ఈ ఏడాది మళ్లీ యాత్రకు భక్తులను అనుమతించింది. ఎత్తైన ప్రదేశం కారణంగా ఆరోగ్య సంబంధిత సమస్యలు ఉన్న ప్రయాణీకులకు తగిన ఏర్పాట్లు చేసింది. ఏదైనా అత్యవసర వైద్య పరిస్థితిని ఎదుర్కోవడానికి తగిన సంఖ్యలో ఆక్సిజన్ సిలిండర్లు, 6,000 అడుగుల కంటే ఎక్కువ ఎత్తులో మెడికల్ బెడ్‌లు, అంబులెన్స్‌లు మరియు హెలికాప్టర్‌లను మోహరించాలని అధికారులను ఆదేశించింది.

Published by:Paresh Inamdar
First published:

Tags: Amarnath Yatra 2022, Heavy Rains, Raja Singh, Uttarakhand

తదుపరి వార్తలు