MK Stalin Takes Bus Ride : తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి ఎంకే స్టాలిన్ ప్రతి అంశంలోనూ తన ప్రత్యేకత చాటుకుంటారు. పరిపాలనతో తనదైన ముద్ర వేస్తున్నారు. ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకుని వాటిని వెంటనే పరిష్కరిస్తున్నారు. అయితే తమిళనాడులో డీఎంకే ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తవుతున్న సందర్భంగా శనివారం ఉదయం ఆ రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి, డీఎంకే వ్యవస్థాపకులు, మాజీ సీఎం సీఎన్ అన్నాదురైలకు నివాళులర్పించారు సీఎం ఎంకే స్టాలిన్. అయితే మెరీనా బీచ్‌కు చేరుకునేందుకు సాధారణ ప్రయాణికుడిలా ప్రభుత్వ బస్సులో ప్రయాణించారు స్టాలిన్. చెన్నైలో సిటీ బస్సులో ఎక్కిన స్టాలిన్ ను చూసి బస్సుల్లోని ప్రయాణికులు ఆశ్చర్యపోయారు. సీఎం ఏంటి..బస్సు ఎక్కడం ఏంటని కొద్దిసేపు అలా చూస్తూ ఉండిపోయారు.
ఇక, బస్సులో నిలబడి కొద్దిదూరం జర్నీ చేసిన స్టాలిన్.. ప్రయాణికులు, కండక్టర్ తో ముచ్చటించారు. ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్న క్రమంలో పాలన, బస్సు సౌకర్యాలు వంటి అంశాలను ప్రయాణికులు, కండక్టర్ ను అడిగి సీఎం తెలుసుకున్నారు. ఏడాది క్రితం ప్రభుత్వం బస్సుల్లో కల్పించిన మౌలిక వసతులు, ఫిట్ నెస్ పై ఆరా తీశారు. ఇప్పుడ ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
మరోవైపు,తమిళనాడు ప్రభుత్వం ఐదేళ్లలోపు చిన్నారులకు బంఫర్ ఆఫర్ ఇచ్చింది. ప్రభుత్వ ఆధ్వర్యంలోని రవాణా సంస్థలు నడిపే అన్ని రకాల బస్సుల్లో ఐదేళ్లలోపు చిన్నారులు ఉచితంగా ప్రయాణించవచ్చని గురువారం స్టాలిన్ సర్కార్ ప్రకటించింది. గురువారం తమిళనాడు అసెంబ్లీలో వాణాశాఖ పద్దు ప్రవేశపెట్టిన సందర్భంగా మంత్రి శివశంకర్ ఈ మేరకు ప్రకటన చేశారు. ఐదేళ్లలోపు పిల్లలు బస్ ఛార్జీ లేకుండానే రాష్ట్రంలో ఎ్కడైనా ప్రయాణించవచ్చని మంత్రి తెలిపారు . గతంలో ఇచ్చిన హామీల ప్రకారం విద్యార్థులకు,మహిళలు రవాణాలో రాయితీలు ఇస్తున్నట్లు మంత్రి గుర్తు చేశారు. విద్యార్ధులకు ఫ్రీ బస్ పాన్ ఇస్తున్నామని, మహిళలకు చెన్నై సహా పలు పట్టణాల్లో బస్సుల్లో ఉచితంగా ప్రయాణించే సౌకర్యం కల్పించినట్లు తెలిపారు.
ALSO READ Trains Cancelled : ప్రయాణికులకు బిగ్ అలర్ట్..రాబోయే 20 రోజుల పాటు 1100 ప్యాసింజర్ రైళ్లు రద్దు
ఇక,తాజాగా అసెంబ్లీలో సీఎం స్టాలిన్ ఐదు కీలక ప్రకటనలు చేశారు. ప్రభుత్వ స్కూళ్లలో ఒకటి నుంచి ఐదో తరగతి పిల్లల కోసం బ్రేక్ ఫాస్ట్ స్కీమ్ ను ప్రకటించారు. . దీని కింద ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ప్రభుత్వమే ఉదయం టిఫిన్ కూడా పెడుతుంది. స్కూల్స్ ఆఫ్ ఎక్స్ లెన్స్, మెడికల్ చెకప్, పట్టణ కేంద్రాల్లో పీహెచ్ సి ల ఏర్పాటుపై ప్రకటన చేశారు. అన్ని నియోజకవర్గాల్లో సీఎం అన్న స్కీమ్ ను కూడా ప్రకటించారు. డీఎంకే సర్కార్ వచ్చి ఏడాది పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ప్రకటనలు చేశారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Chennai, City buses, DMK, MK Stalin, Tamilnadu