Minister: ఫ్లోర్ క్లీన్ చేస్తున్న ఈయన స్వీపర్ కాదు.. ఆయన రాష్ట్ర మంత్రి.. అసలేం జరిగిందంటే..

మంత్రి మాపింగ్ చేస్తున్న దృశ్యం

గదిని శుభ్రం చేయడానికి స్వీపర్ రాకపోవడంతో మంత్రే ఫ్లోర్ క్లీన్ చేశారు. శుభ్రంగా ఊడ్చేశారు. మంత్రి ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అయి ఉండి.. మీరే స్వయంగా శుభ్రం చేశారేంటని అడగ్గా.. ఆయన ఇచ్చిన సమాధానం ఆయనపై మరింత గౌరవాన్ని పెంచింది.

 • Share this:
  మిజోరాం: మన దేశంలో వీఐపీ కల్చర్ ఏ స్థాయిలో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒక కార్పొరేటర్ కూడా పదుల సంఖ్యలో కార్లు, ప్రైవేట్ సెక్యూరిటీ సిబ్బందితో అనవసర హడావుడి చేస్తున్న ఈరోజుల్లో కరోనా కష్టకాలంలో వైరస్ సోకి ఆసుపత్రిలో చేరిన ఓ మంత్రి ఇతరులకు ఆదర్శంగా నిలిచారు. మిజోరాం విద్యుత్ శాఖ మంత్రి ఆర్.లాల్జిర్లియానాకు, ఆయన భార్యకు, కుమారుడికి మే 8న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. దీంతో.. ఓ ఆసుపత్రిలో ఆయన, ఆయన భార్య చికిత్స తీసుకుంటున్నారు. మంత్రులు, ముఖ్యమంత్రులు ఆసుపత్రులకు వెళితే అక్కడి యాజమాన్యం, సిబ్బంది చేసే హడావుడి అందరికీ తెలిసిందే. కానీ.. ఆయన ఆ హడావుడిని కోరుకోలేదు. సామాన్యుడిలానే ఆసుపత్రిలో చేరారు. ఆయన పనులన్నీ ఆయనే చేసుకున్నారు. ఆయనకు, ఆయన భార్యకు కేటాయించిన గదిని శుభ్రం చేయడానికి స్వీపర్ రాకపోవడంతో ఆయనే ఫ్లోర్ క్లీన్ చేశారు. శుభ్రంగా ఊడ్చేశారు. మంత్రి ఫ్లోర్‌ను శుభ్రం చేస్తున్న ఘటనకు సంబంధించిన ఫొటో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. మంత్రి అయి ఉండి.. మీరే స్వయంగా శుభ్రం చేశారేంటని అడగ్గా.. ఆయన ఇచ్చిన సమాధానం ఆయనపై మరింత గౌరవాన్ని పెంచింది. ఫ్లోర్‌ మాపింగ్ తనకు ఇదేం తొలిసారి కాదని, ఇంట్లో కూడా తాను చాలా సందర్భాల్లో ఫ్లోర్ మాపింగ్ చేశానని మంత్రి చెప్పారు. డాక్టర్లను, ఆసుపత్రి సిబ్బందిని కించపరచాలన్న ఉద్దేశంతో తాను మాపింగ్ చేయలేదని, ఇతరులు కూడా తమ పని తాము చేసుకునేలా ప్రోత్సహించేందుకే ఇలా చేశానని మంత్రి తెలిపారు. స్వీపర్‌ను పిలిచానని.. అయితే కొంతసేపు చూసినప్పటికీ రాకపోవడంతో తానే ఫ్లోర్ శుభ్రం చేశానని మంత్రి లాల్జిర్లియానా చెప్పారు. గతంలో ఢిల్లీలోని మిజోరాం హౌస్‌ను సందర్శించిన సందర్భంలో కూడా మంత్రి అక్కడ ఫ్లోర్‌ను క్లీన్ చేసి వార్తల్లో నిలిచారు.

  ఇదిలా ఉండగా.. మిజోరాంలో చాలా మంది మంత్రులు కూడా వీఐపీ కల్చర్‌కు దూరంగా సామాన్య జీవితం గడుపుతుంటారు. సామాన్య ప్రజలు ప్రయాణించే బస్సుల్లో, ఫంక్షన్లలో వంటలు వండుతూ ఇలా ప్రజల్లోనే మమేకమై సాదాసీదా లైఫ్ స్టైల్‌తో జీవిస్తున్నారు. 71 సంవత్సరాల మిజోరాం మంత్రి లాల్జిర్లియానాకు, ఆయన భార్య లల్తంగ్‌మావికి మే 11న కరోనా పాజిటివ్‌గా నిర్ధారణ అయింది. అంతకు ముందే మే 8న ఆయన కుమారుడు కరోనా బారిన పడ్డాడు. తొలుత ఈ ముగ్గురూ హోం ఐసోలేషన్ పాటించారు.

  ఇది కూడా చదవండి: Sperm Count: శృంగార వీర.. వీర్య కణాల గురించి ఈ పెద్ద డాక్టరమ్మ చెప్పిన షాకింగ్ నిజాలు వింటే దడ.. నీకు దడే..!

  అయితే.. మే 12న లాల్జిర్లియానాకు ఉన్నట్టుండి ఆక్సిజన్ లెవల్స్ పడిపోవడంతో ఆయనను, కుటుంబ సభ్యులను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. మంత్రిని రెండు రోజులు ఐసీయూలో ఉంచి చికిత్సనందించిన వైద్యులు ఆయన ఆరోగ్యం కుదుటపడటంతో కోవిడ్ వార్డుకు తరలించారు. ప్రస్తుతం తమ కుటుంబం ఆరోగ్యంగానే ఉందని.. మెడికల్ స్టాఫ్, సిబ్బంది తమను బాగానే చూసుకుంటున్నారని మంత్రి లాల్జిర్లియానా చెప్పారు.
  Published by:Sambasiva Reddy
  First published: