వైద్య సిబ్బంది నిర్లక్ష్యం ఆ పిల్లలకు శాపంగా మారింది. కడుపు నొప్పికని మాత్రిలివ్వమనే వైద్యుల దగ్గరికి వెళ్లి అడిగితే.. వాళ్లేమో మరేవో మెడిసన్ ఇచ్చి ఆ పిల్లలకు, తల్లిదండ్రులకు తీరని క్షోభకు గురి చేస్తున్నారు. సుమారు రెండు సంవత్సరాలుగా ఆ పిల్లు చెప్పలేని నరకాన్ని అనుభవిస్తున్నారు. ఇళ్లు విడిచి బయటకు వెళ్దామంటే కూడా వెళ్లలేని పరిస్థితి. స్నేహితులతో ఆడుకుందామని బయటకు వెళ్తే వారి నుంచి హేళన. ఒళ్లంతా పెరిగిన జుత్తు. చూడటానికి అంద వికారంగా కనిపిస్తున్నది. దీంతో ఆ చిన్నారులు.. చెప్పరాని మానసిక వ్యధను అనుభవిస్తున్నారు. అసలేం జరిగిందంటే...!
వివరాల్లోకెళ్తే.. స్పెయిన్ లోని ఉత్తర ప్రాంతంలో ఉన్న కంటబ్రియా కు సమీపంలో ఉన్న టొర్రెలవెగా అనే ఊరుకు సంబంధించిన 20 మంది పిల్లల కథ ఇది. 2018లో వారికి ఫుడ్ ఎలర్జీ అయి.. అందరికీ వాంతులు విరేచనాలు అయ్యాయి. దాంతో వారి తల్లిదండ్రులు సమీపంలో ఉన్న ఒక ఆస్పత్రికి తీసుకెళ్లారు. అయితే అక్కడ ఉన్న వైద్య సిబ్బంది కడుపు నొప్పి తగ్గడానికి omeprazole మాత్రలకు బదులు.. minoxidil మాత్రలను పిల్లలకు ఇచ్చారు. పిల్లలకు వేసిన మాత్రలు కడుపు నొప్పిని తగ్గించేవి కాదు. అవి తల మీద జుత్తు పెరగడానికి వేసుకునేవి.
కొద్ది రోజుల తర్వాత పిల్లల్లో ఒళ్లంతా జుట్టు రావడం ప్రారంభించింది. ఐ సినిమాలో హీరో విక్రమ్ కు వచ్చిన మాదిరిగా.. తోడేలు కు ఉన్నట్టు వారి ఒంటినంతా వెంట్రుకలు కప్పేశాయి. ఇది చూసిన పిల్లల తల్లిదండ్రులు ఆందోళనతో వారిని తిరిగి ఆ ఆస్ప్రతికి తీసుకెళ్లారు. అక్కడ విచారణ ప్రారంభించగా.. అసలు విషయం తెలిసింది.
ఇదే విషయమై పిల్లల తల్లిదండ్రులు స్థానికంగా ఉన్న కోర్టులో కేసులు వేశారు. ఇందుకు సంబంధించి వాళ్లు నష్టపరిహారంతో పాటు సదరు ఆస్పత్రి, ల్యాబ్ ను మూసివేయాలని డిమాండ్ చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: International, Spain, VIRAL NEWS