పుచ్చకాయలు తినే ఫీట్... గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్...

Guinness World Records ఇలాంటి రికార్డ్ ఉంటుందని చాలా మంది ఇండియన్స్‌కి తెలియదు. తెలిస్తే... ఎప్పుడో దాన్ని బ్రేక్ చేసేవాళ్లేమో.

Krishna Kumar N | news18-telugu
Updated: August 8, 2019, 8:50 AM IST
పుచ్చకాయలు తినే ఫీట్... గిన్నీస్ బుక్ రికార్డ్ బ్రేక్...
గిన్నీస్ రికార్డ్ (Image : FB - Water Valley Area Chamber of Commerce)
  • Share this:
మిసిసిపీ టౌన్‌లో వాటర్ వ్యాలీ ఏరియాకు ఒక్కసారిగా బోలెడు మంది జనం వచ్చారు. వాళ్లందర్నీ కౌంట్ చేస్తే మొత్తం 754 మంది ఉన్నారు. అక్కడ జరుగుతున్న 50వ పుచ్చకాయల కార్నివాల్‌లో వాళ్లంతా పాల్గొన్నారు. రెడీ అనగానే... అందరూ కలిసి... ఒకేసారి పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఎవరికి ఎన్ని ముక్కలు కావాలంటే అన్ని ఊరించుకుంటూ తిన్నారు. అంతే... పాత గిన్నీస్ బుక్ రికార్డు బద్దలైంది. ఇదివరకు ఒకేసారి 259 మంది పుచ్చకాయ ముక్కలు తిన్నారు. ఆ రికార్డ్ క్రాఫోర్డ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్‌లో నమోదైంది. దాన్ని తుడిచిపెట్టి కొత్త రికార్డు నెలకొల్పారు మిసిసిపీ ప్రజలు. తాజా రికార్డులో పాల్గొన్న వారిలో న్యూయార్క్, లాస్ వెగాస్ నుంచీ వచ్చిన వాళ్లు కూడా ఉన్నారు. గిన్నీస్ బుక్ రికార్డ్ సాధించినందుకు వాళ్లు తెగ ఆనందపడిపోయారు.

ఇలాంటి రికార్డులు కూడా ఉంటాయన్న విషయం చాలా మంది ఇండియన్స్‌కి తెలియదు. మన దేశంలో ఒకేసారి వేల మంది కలిసి భోజనాలు చేస్తారు. అదీ రికార్డే కదా. రికార్డే నెలకొల్పాలనుకుంటే... ఇండియన్స్ తలచుకుంటే... ఇలాంటి ఎన్నో రికార్డులు నమోదు చేయగలరు. ఆ పుచ్చకాయల కార్నివాల్ గనక ఇండియాలో జరిగి ఉంటే... ఒకేసారి లక్షల మంది పాల్గొని... గిన్నీస్ బుక్ నిర్వాహకులే షాక్ అయ్యేలా చేసేవాళ్లేమో.

First published: August 8, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు