Home /News /trending /

MISSISSIPPI RIVER FLOWING IN REVERSE DUE TO STORM IN AMERICA PRV

River Reverse: అమెరికాలో తుఫాను ధాటికి రివర్స్​లో ప్రవహిస్తున్న నది.. విధ్వంసం తప్పదా?

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ఇడా హరికేన్(Ida hurricane )​​ ధాటికి గాలులు దాదాపు 240 కిలోమీటర్ల వేగంతో వీస్తున్నాయంటే నమ్మండి. అంతేకాదు ఏకంగా నదీ ప్రవాహ దిశను మార్చి వెళ్లేలా చేసింది. అవును న్యూఓర్లిన్స్(new Orlin)​లో ఉన్న ఓ నది(river) వ్యతిరేక దిశలో ప్రవహిస్తోంది.  ఆ నది పేరు ఏంటంటే మిస్సిస్సిపీ(Mississippi).

ఇంకా చదవండి ...
  హరికేన్(Hurricane)​.. పెను తుపాను.. గాలి వాన ఎలాంటి పేర్లతో పిలిచినా జరిగే విధ్వంసం మాత్రం ఊహించలేం. వందల కిలోమీటర్ల వేగంతో గాలులు(wind) వీస్తాయి. వర్షం(rain) కుండపోతగా కురుస్తుంది. నదుల ఉధృతి పెరిగిపోతుంది. ఇప్పటివరకు వచ్చిన ఇలాంటి హరికేన్​లతో లక్షలాది కుటుంబాలు రోడ్డున పడ్డాయి. ఆయా ప్రభుత్వాలకు ఆర్థిక ఇబ్బందులనూ తెచ్చిపెట్టాయి. అప్పడుప్పడు దేశాలను కూడా అతలాకుతలం చేసిన సందర్భాలూ ఉన్నాయి. ఇపుడు అలాంటి తుపాను అమెరికా(America)పై పడింది. ఈ తుపానుకు ఇడా హరికేన్(Ida hurricane )​ అని నామకరణం చేశారు. ఈ తుపాన్​ ధాటికి గాలులు దాదాపు 240 కిలోమీటర్ల వేగం(240kmph)తో వీస్తున్నాయంటే( winds are blowing) నమ్మండి. అంతేకాదు ఏకంగా నదీ ప్రవాహ దిశను మార్చి వెళ్లేలా చేసింది. అవును న్యూఓర్లిన్స్(new Orlin)​లో ఉన్న ఓ నది(river) వ్యతిరేక దిశ(opposite direction)లో ప్రవహిస్తోంది.  ఆ నది పేరు ఏంటంటే మిస్సిస్సిపీ(Mississippi) . ఇంతకీ ఆ నది స్వరూపం ప్రస్తుతం ఎలా ఉంది.. రాబోయే వాతావరణ పరిస్థితుల గురించి ఓ సారి తెలుసుకుందాం..

  ఇది అసాధారణమైంది..

  అమెరికాను ఇడా హరికేన్​(Ida hurricane) భయపెడుతోంది. ఇడా ధాటికి అక్కడి న్యూ ఓర్లీన్స్ సమీపంలో మిస్సిస్సిప్పి(Mississippi)) నది తిరిగి రివర్స్​ దిశ(reverse direction)లో పయనిస్తుండటమే  పరిస్థితికి అద్దం పడుతోంది. ఇడా హరికేన్​ ప్రభావంతో గాలులు 240 కిలోమీటర్ల వేగంతో వస్తున్నాయని యూఎస్​ జియలాజికల్​ డిపార్టుమెంట్​ ప్రకటించింది. దీంతో  ఏ క్షణంలోనైనా విధ్వసం జరిగే అవకాశాలు ఉన్నట్లు తెలుస్తోంది. అయితే గాలులు వీచడం, తుపానులు(tupan) రావడం తెలిసిందేనని.. కానీ, ఇలా ఓ నదీ తిరిగి రివర్స్​లో ప్రవహించడం అసాధారమైనదిగా అక్కడి వాతావరణ నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. లూసియానా(Luciana)లోని పోర్ట్ ఫోర్‌చాన్ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం అత్యంత ప్రమాదకరమైన కేటగిరీ 4 హరికేన్ నుంచి 150 mph వేగంతో గాలులు వస్తున్నాయని నేడా హరికేన్ సెంటర్ (NHC) తెలిపింది. సరిగ్గా 16 ఏళ్ల క్రితం కత్రినా హరికేన్​ విధ్వంసాన్ని సృష్టించిన సంగతి తెలిసిందే. అనంతరం అంతటి ఉ ధృతిలో ఈ ఇడా(Ida) హరికేన్​ వచ్చినట్లు అక్కడి నిపుణులు వెల్లడించారు.

  గతంలో చూడలేదు..

  మిసిసిపీ గల్ఫ్ వాటర్ సైన్స్ సెంటర్‌ హైడ్రాలజిస్ట్ స్కాట్ పెర్రియన్ నది రివర్స్​లో ప్రహహించడంపై స్పందిస్తూ.. "కత్రినా హరికేన్ సమయంలో మిస్సిస్సిప్పి నదికి కొంత ప్రవాహం ఉందని నాకు గుర్తుంది. కానీ ఇది చాలా అసాధారణం" అని అన్నారు. ఆగ్నేయ లూసియానాలోని న్యూ ఓర్లీన్స్‌కు దక్షిణాన 20 మైళ్ల దూరంలో ఉన్న బెల్లె చాస్‌లో ఉన్న యుఎస్‌జీఎస్ గేజ్ వద్ద తుఫాను కారణంగా నది 7 అడుగులు పెరిగినట్లు పెర్రియన్ వెల్లడించారు. ఆ సమయంలో నది ప్రవాహం సెకనుకు 2 అడుగుల నుంచి ఇతర దిశలో సెకనుకు అర అడుగు వరకు తగ్గిపోయిందట. మొత్తం నది ప్రవాహాన్ని గేజ్ ఆపలేదని పెర్రియన్ అన్నారు. కాబట్టి నది లోపల జరిగే ఉధృతి ప్రవాహ దిశలను తిప్పికొట్టే అవకాశం ఉంది. దీంతో నదులు రివర్స్​లో పయనిస్తున్నాయట. తుఫాను సంకేతాలను ఇది సూచిస్తోంది అని ఫెర్రియన్​ అన్నారు. రాబోయే రోజుల్లో నది నీటి మట్టం కూడా పెరిగే అవకాశం ఉందని ఆయన తెలిపారు.  ఆదివారం నాడే తుపానుగా..

  ఇడా ఆదివారం ఉదయం 4 వ వర్గం తుఫానుగా మారిందని ఆయన అన్నారు. అయితే 2020లో లారా తుపాను, 1856లో లాస్ట్​ ఐలాండ్​ హరికేన్​ తుపానులు లూసియానాలో అతి తీవ్రమైన, శక్తి వంతమైన తుపానులుగా వచ్చాయని, అవన్నీ 150 mph వేగంతోనే గాలులు వీస్తూ విధ్వంసం సృష్టించాయని పెర్రియన్​ భయాందోళనలు వ్యక్తంచేశారు. 2005లో వచ్చిన కత్రినా హరికేన్​ 125 mph వేగంతోనే గాలులు వీచాయని గుర్తు చేశారు.
  Published by:Prabhakar Vaddi
  First published:

  Tags: America, Heavy Rains, Holy river, Water

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు