హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

SpaceX: ఇక అంగారక గ్రహంపైకి మనుషులు.. స్పేస్ ఎక్స్ ప్రయోగం సూపర్ సక్సెస్..

SpaceX: ఇక అంగారక గ్రహంపైకి మనుషులు.. స్పేస్ ఎక్స్ ప్రయోగం సూపర్ సక్సెస్..

నెల రోజుల క్రితం నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు సేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని నాసా ఎంచుకుంది. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రయోగం నిలిచిపోయింది. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడాన్ని స్టార్‌బేస్ ఫ్లైట్ కంట్రోల్ ధ్రువీకరించింది.

ఇంకా చదవండి ...

  అంతరిక్షంలోకి ఒకేసారి 100 మందిని, పదుల సంఖ్యలో ఉపగ్రహాలను పంపాలనే లక్ష్యంతో పనిచేస్తోంది అమెరికాకు చెందిన స్పేస్ ఎక్స్ కంపెనీ. ఈ సంస్థ ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన స్టార్‌షిప్ ఎస్ఎన్ 15 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. భవిష్యత్తులో చంద్రుడు, అంగారకుడిపైకి మానవుల్ని పంపడమే లక్ష్యంగా అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా, స్పేస్‌ ఎక్స్‌ సంయుక్తంగా ప్రాజెక్టును చేపట్టిన విషయం తెలిసిందే. ఇటీవల నాలుగు ప్రయోగాలు విఫలం కాగా, ఎట్టకేలకు ఐదో ప్రయోగం విజయవంతమైంది. పూర్తి స్థాయి స్టెయిన్‌లెస్ స్టీల్‌తో తయారై, బుల్లెట్ ఆకారంలో ఉన్న ఈ రాకెట్‌ గల్ఫ్ ఆఫ్ మెక్సికో మీదుగా 6 మైళ్ళ (10 కిలోమీటర్లు) కంటే ఎక్కువ ఎత్తుకు వెళ్లి సురక్షితంగా కిందకి దిగింది.

  నెల రోజుల క్రితం నలుగురు వ్యోమగాములను చంద్రుడిపైకి తీసుకెళ్లేందుకు సేస్ ఎక్స్‌కు చెందిన స్టార్‌షిప్ ప్రయోగాన్ని నాసా ఎంచుకుంది. కానీ కొన్ని కారణాలతో ఈ ప్రయోగం నిలిచిపోయింది. ప్రస్తుత ప్రయోగం విజయవంతం కావడాన్ని స్టార్‌బేస్ ఫ్లైట్ కంట్రోల్ ధ్రువీకరించింది. స్పేస్ ఎక్స్ విడుదల చేసిన వీడియోలో ఈ ప్రయోగాన్ని గమనించవచ్చు. ‘మేం కిందికి దిగాం! స్టార్‌షిప్ ల్యాండ్ అయింది’ అని స్పేస్ఎక్స్ ప్రిన్సిపల్ ఇంటిగ్రేషన్ ఇంజనీర్ జాన్ ఇన్‌స్ప్రక్కర్ లైవ్ కామెంట్రీలో చెప్పారు. రాకెట్ కిందికి దిగిన తర్వాత రాకెట్ బేస్ వద్ద 160 అడుగుల (50 మీటర్లు) వరకు మంటలు త్వరగా ఆరిపోయాయి. ఆరు నిమిషాల విమాన ప్రయాణం తర్వాత విజయవంతంగా ల్యాండ్ అయిన ఎస్ఎన్ 15 రాకెట్లో ఎటువంటి మంటలు రాకుండా నిటారుగా నిలబడి ఉంది. దీనిపై స్పేస్ఎక్స్ అధినేత ఎలాన్ మస్క్ ‘స్టార్‌షిప్ ల్యాండింగ్ నామినల్’ అని ట్వీట్ చేశారు.

  అమెరికాకు చెందిన అలన్ షెపర్ట్ మొదటిసారిగా అంతరిక్షంలో ప్రయాణించిన వ్యక్తిగా రికార్డు సృష్టించాడు. అతడి అంతరిక్ష ప్రయాణం ముగిసి సరిగ్గా 60 ఏళ్లు అయిన సందర్భంగా.. ఆయన జ్క్షపకార్థం స్పేస్ ఎక్స్ ఈ రాకెట్ ప్రయోగాన్ని చేపట్టింది. భవిష్యత్తులో అంతరిక్ష కేంద్రానికి మరో నలుగురు వ్యోమగాములను ప్రయోగించడం, మినీ ఇంటర్నెట్ ఉపగ్రహాలను ప్రయోగించడం కోసం ఈ ప్రయోగాన్ని చేపట్టినట్లు స్పేస్ఎక్స్ వెల్లడించింది. రాబోయే కొన్నేళ్లలో వ్యోమగాములను చంద్రుని ఉపరితలంపైకి పంపడానికి నాసా స్పేస్‌ఎక్స్ స్టార్‌షిప్‌ను ఎంచుకుంది.

  స్పేస్ ఎక్స్ ఎస్ఎన్ 10 రాకెట్ను మార్చి నెలలో ప్రయోగించగా.. ఈ రాకెట్ కొద్ది నిమిషాల్లోనే గాల్లో ఆరు మైళ్ళ ఎత్తుకు వెళ్లి తిరిగి లాంచ్ పాడ్‌పై పడిపోయింది. తమ రాకెట్‌ను విజయవంతంగా ల్యాండింగ్ చేసినట్లు ఎలాన్ మస్క్ ట్వీట్ చేసిన తర్వాత ఈ ఘటన చోటు చేసుకోవడం విశేషం. బేస్‌లో ఎటాచ్ అయిన లాండింగ్ లెడ్స్ తెరుచుకోకపోవడంతో రాకెట్ మిథేన్ వాయువును తొక్కిపెట్టి పైప్స్‌ను క్రష్ చేసిందని.. ఇదే ప్రమాదానికి కారణమని శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. అయితే, గతంలో ప్రయోగించిన ఎస్ఎన్ 8, 9 ప్రోటోటైప్ రాకెట్లు కూడా ఇదే విధంగా పేలిపోయాయి. వాటి నుంచి పాఠాలు నేర్చుకొని ఎట్టకేలకు దిగ్విజయంగా ఎస్ఎన్ 15 రాకెట్ను ప్రయోగించింది.

  First published:

  Tags: America, NASA, Space

  ఉత్తమ కథలు