Mission Paani: ఇంకుడుగుంతలు నిర్మిద్దాం... వాననీటిని ఒడిసిపడదాం...

Mission Paani: నీటి కొరత ఎంత తీవ్రంగా ఉంటుందో చెన్నైలో పరిస్థితులను చూశాక దేశ ప్రజలకు అర్థమైంది. ఇప్పుడు అన్ని రాష్ట్రాల ప్రభుత్వాలూ ఇంకుడుగుంతల నిర్మాణంపై దృష్టిసారిస్తున్నాయి.

Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 8:27 AM IST
Mission Paani: ఇంకుడుగుంతలు నిర్మిద్దాం... వాననీటిని ఒడిసిపడదాం...
ఇంకుడుగుంతలతో ఎన్నో ప్రయోజనాలు
Krishna Kumar N | news18-telugu
Updated: August 24, 2019, 8:27 AM IST
పూర్వకాలం ప్రతీ ఇంట్లో బావి ఉండేది. ఇప్పుడు వాటి స్థానంలో పంపులు వచ్చేశాయి. ఫలితంగా ఇళ్లలో నీటి స్టోరేజ్ అన్నదే లేకుండా పోతోంది. ఏటా వాన నీరు వృథా అయిపోతోంది. అదే సమయలో భూగర్భ జలాలు అత్యంత లోతుకి వెళ్లిపోతున్నాయి. మంచి నీటి కోసం ఒక్కోసారి వెయ్యి అడుగుల లోతు వరకూ తవ్వాల్సిన పరిస్థితి. నిజానికి అంత లోతున తవ్వితే వచ్చే నీటిని తాగడం ప్రమాదకరం. ఆ నీటిలో రకరకాల లోహాలు, రసాయనాలూ ఉంటాయి. మరి ఈ సమస్యకు చెక్ పెట్టాలంటే... ఇంకుడు గుంతలు తవ్వాలని సూచిస్తున్నారు భూగర్భ జల శాస్త్రవేత్తలు. ఆ గుంతలే ఉంటే... అసలు నీటి కొరతే ఉండదని అంటున్నారు.

ఇంకుడు గుంతలను నిర్మించడం ఎలా :
* బోరు బావులకు దగ్గర్లో ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలవి.

* ప్రతి బోరు బావి దగ్గరా సుమారు 2 మీటర్లు పొడవు, ఒక మీటరు వెడల్పు, ఒక మీటరు లోతు గల గుంతను తవ్వాలి.
* ఆ గుంతలో పావు భాగం పెద్ద బండ రాళ్ళతో నింపాలి. ఆ తర్వాత రెండు పావు భాగాలు పెద్ద కంకర రాళ్లతో నింపాలి.


* గుంత లోపల కొంత భాగం ఖాళీగా వుంచి పైన మూత ఏర్పాటు చేయాలి.
* ఆ చుట్టు ప్రక్కల పడిన వర్షపు నీరు ఆ ఇంకుడు గుంతల్లోకి వెళ్లేలా... కాలువ/పైపులు ఏర్పాటు చేయాలి.
Loading...
* నేల స్వభావాన్ని బట్టీ, పరిసరాలను బట్టీ, నీటి లభ్యతను బట్టీ గుంతల పరిమాణాన్ని నిర్ణయించుకోవాలి.
* బహిరంగ ప్రదేశాల్లో, పొలాల్లో పెద్ద ఇంకుడు గుంతలు నిర్మించవచ్చు. పెద్ద గుంతలకు పైన కప్పు అవసరముండదు.

ప్రయోజనాలు :
* వాన నీరు వేస్టుగా పోకుండా ఇంకుడు గుంతలు కాపాడతాయి.
* భూరగ్భ జలం పెరిగేలా చేస్తాయి.
* ఎండిపోయిన గొట్టపు బావుల్లో తిరిగి నీరు ఊరుతుంది.

 

ఇవి కూడా చదవండి :

2021లోనూ రోజాకు నిరాశేనా... అప్పుడు కూడా మంత్రి పదవి ఇవ్వరా?

నైరుతి రుతుపవనాలు వచ్చేశాయ్... ఇక రెండు వారాలు వర్షాలే...వర్షాలు

టీడీపీని చరిత్రలో కలిపేస్తారా... బీజేపీ ప్లాన్ అదేనా?
First published: August 24, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...