క్యాట్‌వాక్ చేస్తూ కాలుజారిపడిన సుందరాంగి...

Miss Universe : ఆ ఫ్లోర్ తడిగా ఉండటంతో... చాలా మంది కంటెస్టెంట్లు వాక్ చేస్తూ జారిపోతున్నారు. తనకు ఎదురైన అనుభవాన్ని మిస్ ఫ్రాన్స్... అభిమానులతో షేర్ చేసుకుంది.

news18-telugu
Updated: December 9, 2019, 6:54 AM IST
క్యాట్‌వాక్ చేస్తూ కాలుజారిపడిన సుందరాంగి...
మిస్ ఫ్రాన్స్ మేవా కౌకే (credit - insta - maevacouckeoff)
  • Share this:
Miss Universe : ఈ ఏడాది మిస్ యూనివర్శ్ కిరీటాన్ని దక్కించుకునేదెవరు? ఇందుకు సంబంధించిన అందాల పోటీలు... హాట్ హాట్‌గా ప్రారంభమయ్యాయి. ప్రిమిలినరీస్‌లో అందాల భామలు ర్యాంప్‌పై హొయలొలికిస్తూ... క్యాట్‌వాక్ చేస్తూ... జర్రున జారి పడుతున్నారు. కారణం... ఆ ఫ్లోర్ తడిగా ఉంది. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అన్ని దేశాలూ... విశ్వ సుందరి పోటీలకు తమ తమ కంటెస్టెంట్లను పంపాయి. పోటీ సంగతేమోగానీ... సన్నజాజి తీగల్లాంటి అమ్మాయిలు... కాలుజారి పడిపోతుండటం కలకలం రేపింది. ఫ్రాన్స్ నుంచీ పోటీలో ఉన్న మిస్ ఫ్రాన్స్ మేవా కౌకే... ఇలాగే బికినీలో క్యాట్ వాక్ చేస్తూ... స్లిప్పై... ఒక్కసారిగా జారిపడింది. ఆ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేస్తూ... తనకు చేదు అనుభవం ఎదురైందంటూ... అభిమానులతో తన బాధను పంచుకుంది. ఇలాంటి పరిస్థితి తనకు ఎప్పుడూ ఎదురవ్వలేదన్న ఆ బ్యూటీ... జరిగే ప్రతి దాని నుంచీ అనుభవం పొందుతూ ముందుకుసాగాలని తెలిపింది. 9 సార్లు పతనమైనా పదోసారి మళ్లీ తలెత్తి ముందుకుసాగాలని చెప్పింది. తమకు జరిగే ఇలాంటి అనుభవాలు తమను మరింత ఎదిగేలా, మెచ్చూర్ అయ్యేలా, బలంగా తయారయ్యేలా చేస్తాయంది.








View this post on Instagram





PRELIMINARY SHOW - Hier soir j’ai vécu la pire hantise d’une Miss : tomber sur scène. Jusqu’ici ça ne m’était jamais arrivé, mais la vie nous réserve parfois des bonnes comme des mauvaises surprises. Il faut tirer une leçon de chaque expérience, et la leçon que j’en tire est que tomber et se relever est le principe même de la vie d’une femme, le principal c’est d’avancer peu importe les obstacles. Si tu tombes 9 fois relèves toi 10 fois et garde la tête haute ! Nos expériences nous font grandir, mûrir et nous rendent plus forte. 💪🏼 Je tiens à vous remercier pour vos messages et à vous rassurer je ne me suis pas blessée. Merci pour votre soutien, je vous aime ❤️❤️❤️ PRELIMINARY SHOW - Last night I experienced the worst obsession of a Miss: falling on stage. So far it has never happened to me, but life sometimes gives us good as bad surprises. A lesson must be learned from each experience, and the lesson I draw from it is that falling and standing up is the very essence of a woman's life, the main thing is to move forward regardless of obstacles. If you fall 9 times raise 10 times and keep your head high! Our experiences make us grow, mature and make us stronger. 💪 I want to thank you for your messages and to reassure you I did not hurt myself. Thank you for your support, you are the best ❤ #missuniverse #missuniverse2019 #missfrance #staystrong #keepyourheadup #thankyou #proud


A post shared by Maëva Coucke (@maevacouckeoff) on








ఐతే... మిస్ ఫ్రాన్స్ పడిపోయినప్పుడు... ఆ షో చూస్తున్నవారంతా... ఆమెకు అండగా నిలిచారు. చప్పట్లు కొడుతూ ఆమెను ఎంకరేజ్ చేశారు. ఆమెలో కాన్ఫిడెన్స్ పెంచుతూ... ఆల్ ది బెస్ట్ చెప్పారు. దాంతో ఆమె తిరిగి అదే ఉత్సాహంతో నవ్వుతూ... అక్కడి నుంచీ వెనక్కు వెళ్లింది. తనకు ఇంత సపోర్ట్ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థాంక్స్ అని చెప్పింది మిస్ మేవా కౌకే. ఈ పోటీల్లో ఇండియా తరపున మిస్ వర్తికా సింగ్ ప్రాతినిధ్యం వహిస్తోంది.


Pics : మిస్ యూనివర్స్ ఇండియా వర్తికా సింగ్ అందాల ప్రపంచం



ఇవి కూడా చదవండి :



ఎన్‌కౌంటర్‌పై NHRC రెండ్రోజుల విచారణ... నెక్ట్స్ ఏంటి?

నేడు తెలంగాణ గవర్నర్ ప్రజాబాట... బీజేపీ వ్యూహం అదేనా?

నేడు లోక్‌సభలో పౌరసత్వ బిల్లు... ఆమోదం కోసం బీజేపీ విప్ వ్యూహం

పాము కనిపిస్తే అది విషపూరితమైనదో కాదో గుర్తించడం ఎలా?

Health Tips : పట్టులాంటి జుట్టు కావాలా... ఉల్లిపాయలతో ఇలా చెయ్యండి
Published by: Krishna Kumar N
First published: December 9, 2019, 6:54 AM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading