Miss Universe 2019 Zozibini Tunzi : అందాల పోటీలు అనగానే... పైపై కనిపించే తెల్ల తోలు... ఆకర్షణీయమైన ముఖం వీటికే ప్రాధాన్యం ఇస్తున్న రోజులివి. అలాంటి చోట... ఓ నల్ల కలువ అద్భుతం సృష్టించింది. ఆమే దక్షిణాఫ్రికాకు చెందిన మిస్ యూనివర్స్ 2019 జొజిబినీ టున్జీ.
స్విమ్ సూట్, ఈవెనింగ్ గౌన్ రౌండ్లలో ప్రత్యేకంగా కనిపించిన ఈ 26 ఏళ్ల బ్యూటీ... జడ్జిలు అడిగిన ప్రశ్నకు ఎంతో కాన్ఫిడెన్స్‌తో చెప్పిన సమాధానం అందర్నీ ఆకట్టుకుంది. ఫలితంగా ఆమె విజేతగా నిలిచింది. (credit - insta - zozitunzi)
అమెరికా... అట్లాంటాలో జరిగిన ఈ పోటీల్లో... మిమ్మల్నే విజేతగా ఎందుకు ఎంచుకోవాలని జడ్జిలు ప్రశ్నించారు. తనలాంటి కలర్ ఉన్న అమ్మాయిలను అసలు అందమైన అమ్మాయిలుగానే గుర్తించని ప్రపంచంలో పెరిగానన్న ఆమె... ఆ ఆలోచనకు తనతోనే ముగింపు పలకాలని చెప్పింది. తద్వారా రాబోయే తరాలకు తన విజయం కాన్ఫిడెన్స్ నింపుతుందని తెలిపింది. అంతే జడ్జిలు ఆమెను విజేతగా ప్రకటించారు. (credit - insta - zozitunzi)
దక్షిణాఫ్రికాలోని జోలోలో పుట్టిన జొజిబినీ టున్జీ చిన్నప్పటి నుంచి వివక్షను ఎదుర్కొంది. ఎన్నో సూటిపోటి మాటలు ఆమెలో పట్టుదలను పెంచాయి. అందాల పోటీల్లో పాల్గొని... తనను కించపరిచేవాళ్లకు గట్టి సమాధానం చెప్పాలనుకుంది. ఫలితంగా ఆమె మిస్ యూనివర్స్ టైటిల్ గెలిచిన మూడో దక్షిణాఫ్రికా యువతిగా రికార్డ్ సృష్టించింది. (credit - insta - zozitunzi)
పబ్లిక్ రిలేషన్స్ అండ్ ఇమేజ్ మేనేజ్‌మెంట్ (2018)లో కేప్ పెనిన్సులా యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీ నుంచి డిగ్రీ పట్టా పొందిన ఈ బ్యూటీ... రెండేళ్ల కిందట జరిగిన మిస్ సౌతాఫ్రికాలో పాల్గొన్నప్పుడు టాప్ 10లో కూడా ఆమెకు స్థానం దక్కలేదు. నిరాశకు ఛాన్స్ ఇవ్వని ఆమె... మళ్లీ ప్రయత్నించి, కిరీటం సాధించింది. (credit - insta - zozitunzi)
ఓ నల్లజాతి మహిళ విశ్వసుందరిగా నిలవడం ఎనిమిదేళ్ల తర్వాత ఇదే తొలిసారి. 1977లో ట్రినిడాడ్‌కు చెందిన జానెల్లే కమిషంగ్ మొదటిసారి ఈ టైటిల్ దక్కించుకుంది. మోడలింగ్‌ను కెరీర్‌గా ఎంచుకున్న టున్జీ... సామాజిక సేవ కూడా చేస్తోంది. సోషల్ మీడియా ద్వారా లింగ వివక్షపై పోరాడుతోంది. (credit - insta - zozitunzi)
ఈ పోటీల్లో మిస్ మెక్సికో సోఫియా ఆరగాన్, మిస్ ప్యూర్టోరికా మాడిసన్ అండర్సన్ రన్నరప్‌గా నిలిచారు. ఇండియా నుంచీ ఈ పోటీలకు వెళ్లిన వర్తికా సింగ్... టాప్-20లో కూడా నిలబడలేకపోయింది. (credit - insta - zozitunzi)
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.