మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2020 కిరీటాన్ని ప్యాషన్ డిజైనర్ షైనీ సోని సొంతం చేసుకున్నారు. దేశంలోని ట్రాన్స్‌జెండర్ మహిళల కోసం నిర్వహించే ఈ పోటీ టైటిల్‌ను ఆమె తన ఖాతాలో వేసుకున్నారు. ప్రంపచంలో ట్రాన్స్‌జెండర్ మహిళల కోసం నిర్వహించే అతిపెద్ద పోటీ మిస్ ఇంటర్నేషన్ క్వీన్ ఆమె పాల్గొనున్నారు. వచ్చే ఏడాది ఆ పోటీలో పాల్గొననున్న ఆమె భారత్ తరఫున ప్రాతినిథ్యం వహించనున్నారు. మిస్ ట్రాన్స్‌క్వీన్ ఇండియా పోటీలను తొలిసారిగా 2017లో నిర్వహించారు. సాధారణంగా అందాల పోటీల మాదిరిగానే ఇక్కడ కూడా ఫొటో షూట్స్, ట్యాలెంట్ రౌండ్స్, రకరకాలుదుస్తులు, పోటీలకు జడ్జ్‌లు.. ఉంటారు. వందలాది మంది ప్రేక్షకులు ఈ పోటీలను చూసేందుకు హాజరవుతారు.
అయితే ఈ సారి కరోనా నేపథ్యంలో నిర్వాహకులు పోటీని నిర్వహించలేకపోయారు. అయితే మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా వ్యవస్థాపకురాలు రీనా రాయ్ మాత్రం ఈ ఏడాది పోటీలను ఒదులుకోవడానికి ఇష్టపడలేదు. 2021లో జరిగే అంతర్జాతీయ ట్రాన్స్ క్వీన్ పోటీల కోసం భారత్ నుంచి ఒకరిని ఎలాగైనా పంపాలని డిసైడ్ అయ్యారు. ఈ క్రమంలోనే షైనీ సోనిని మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2020 గా ఎంపిక చేశారు. పోటీలు నిర్వహించుకుండానే ఒకరిని ఎంపిక చేస్తున్నానంటే.. వాళ్లు బెస్ట్ ఆఫ్ ది బెస్ట్ అయి ఉండాలని తనకు తెలుసునని రీనా అన్నారు. "ఈ పోటీ కేవలం అందం గురించి కాదు. అది సాధికారత గురించి" అని సీఎన్ఎన్ ఇంటర్వ్యూలో రీనా రాయ్ తెలిపారు. ఇక, ప్యాషన్ డిజైనర్‌గా, స్టైలిస్ట్‌గా సోనికి మంచి గుర్తింపు ఉంది గతలో ఆమె పోటీదారులకు చాలా సహాయపడ్డారు. వారి దుస్తుల ఎంపికలో కూడా తోడ్పాటునందించారు.
సోని మగ పిల్లవాడిగా జన్మించారు. అయితే చిన్న వయస్సులోనే అమ్మాయిగా గుర్తించబడ్డారు. ఈ క్రమంలోనే తోటివారి నుంచి లింగత్వం విషయంలో వేధింపులు ఎదుర్కొన్నారు. బంధువులు కూడా ఆమెను తీవ్రంగా నిరుత్సాహపరిచారు. జుట్టు భారీగా పెరగడం వంటివి తీవ్ర ఒత్తిడికి గురిచేశాయి. అయితే లింగ గుర్తింపు, లింగ నిర్ధారణ శస్త్రచికిత్స కోసం పరిశోధించినప్పుడు సోనికి కొంత ఊరట కలిగింది. 17వ ఏట ఇంట్లోనుంచి బయటకు వచ్చేసి ఫ్యాషన్ విద్యను అభ్యసించారు. ఆ తర్వాత కొన్నేళ్లకు హార్మోనల్ థెరపీ చేయించుకున్నారు. నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ నుంచి ఆమె గ్రాడ్యుయేషన్ పూర్తి చేశారు.
Miss Transqueen India: మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా 2020గా సోని.. వచ్చే ఏడాది అంతర్జాతీయ వేదికపై..
తన స్నేహితలు దూరం అయ్యారని, వారు అర్థం చేసుకోలేదని సోని తెలిపారు. దీంతో ప్రతిది స్వంతంగా చేయాలనే నిర్ణయానికి వచ్చానని.. అలాగే ముందుకు సాగాలని అనుకున్నానని చెప్పారు. "2017లో మిస్ ట్రాన్స్ క్వీన్ ఇండియా పోటీల గురించి రీనా రాయ్ సంప్రదించినప్పుడు కుటుంబ ఒత్తిడి వల్ల నేను అందులో పాల్గొనలేకపోయాను. కానీ నా మద్దతు ఉంటుందని చెప్పాను"అని సోని చెప్పారు. ఇక, సోని మరికొందరితో కలిసి దేశంలో ఎల్జీబీటీక్యూ ప్రాతినిథ్యం, సమాచారం కోసం ప్రచారం చేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: India, Transgender