రికార్డు సృష్టించిన వయ్యారి భామలు.. అందాలతో మెరిసిన నల్ల కలువలు..

అమెరికా బ్యూటీ కాంటెస్ట్‌లలో ప్రముఖమైన మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ, మిస్ అమెరికా 2019 కిరీటాలను నల్ల కలువలే దక్కించుకున్నాయి. ఆ దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో మూడు కిరీటాలను ఒకే సందర్భంలో నల్ల జాతీయులు దక్కించుకున్న దాఖలాలు లేవు.

news18-telugu
Updated: May 7, 2019, 1:53 PM IST
రికార్డు సృష్టించిన వయ్యారి భామలు.. అందాలతో మెరిసిన నల్ల కలువలు..
అందాల భామలు
  • Share this:
ప్రపంచంలోని అందం అంతా ఒకే చోట చేరినట్లు కనిపించేవి.. మిస్ అందాల పోటీలు. అపురూప లావణ్యంతో యువత హృదయాలకు చిల్లులు పడేలా ఎంతోమంది వయ్యారి భామలు కళ్లముందు మెరుస్తారు. ర్యాంప్ వాక్‌తో తమ సొగసును ప్రదర్శిస్తూ జడ్జిలను సైతం తమవైపు తిప్పేసుకుంటారు. అయితే, ఈ సారి అమెరికాలో జరిగిన ‘మిస్ అందాల’ పోటీలన్నీ ప్రత్యేకమే. ఆ దేశ చరిత్రలోనే నిలిచిపోయే పోటీలవి. ఎందుకంటే, అమెరికా బ్యూటీ కాంటెస్ట్‌లలో ప్రముఖమైన మిస్ యూఎస్ఏ, మిస్ టీన్ యూఎస్ఏ, మిస్ అమెరికా 2019 కిరీటాలను నల్ల కలువలే దక్కించుకున్నాయి. ఆ దేశంలో నిర్వహించిన అందాల పోటీల్లో మూడు కిరీటాలను ఒకే సందర్భంలో నల్ల జాతీయులు దక్కించుకున్న దాఖలాలు లేవు.

ఈ సారి మిస్ యూఎస్ఏ టైటిల్‌ను చెస్లీ క్రిస్ట్(28), మిస్ టీన్ యూఎస్ఏ కిరీటాన్ని కలీగ్ గారిస్(18), నియా ఫ్రాంక్లిన్(25) మిస్ అమెరికా టైటిల్‌ను దక్కించుకున్నారు. వీరు ముగ్గురు కూడా నల్ల జాతీయులే కావడం విశేషం. అందాన్ని అమెరికా ఎలా చూస్తుందో తెలపడానికి ఇదే ఉదాహారణ అని అమెరికా కాంగ్రెస్‌లో సభ్యులు వ్యాఖ్యానించారు.
First published: May 7, 2019
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు
?>