హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

భలే భలే!.. నది ఒడ్డుకు వస్తున్న వెండి నాణేలు.. ఏరుకునే పనిలో ప్రజలు

భలే భలే!.. నది ఒడ్డుకు వస్తున్న వెండి నాణేలు.. ఏరుకునే పనిలో ప్రజలు

వెండి నాణేలు ఏరుకుంటున్న ప్రజలు

వెండి నాణేలు ఏరుకుంటున్న ప్రజలు

భలే... అదృష్టం అంటే వారిదే... అత్యంత విలువైన వెండి నాణేలు... వాళ్లనే వెతుక్కుంటూ వస్తున్నాయి. కాళ్ల దగ్గరకు వస్తున్న ఆ నాణేలను వాళ్లు కళ్లకద్దుకొని తీసుకుంటున్నారు.

పురాతన నాణేలకు ఉండే విలువ అంతా ఇంతా కాదు. ఒక్క నాణెమైనా లక్షల్లో ధర పలుకుతుంది. అలాంటిది... ఆ ఊరోళ్లకు చాలా నాణేలు ఈజీగా దొరుకుతున్నాయి. అసలేమైందంటే... మధ్యప్రదేశ్‌లోని చాలా జిల్లాల్లో ఈమధ్య భారీగా వర్షాలు పడి వరదలు వచ్చాయి. ఆ నీరంతా సింధ్ నదిలోకి వెళ్లింది. దాంతో నదీ గర్భంలో పెద్ద కదలిక వచ్చింది. దాంతో... అప్పటివరకూ నదిలో ఉన్న వెండి నాణేలు... నీటిలో కదులుతూ... శివపురి జిల్లా... అశోక్‌నగర్‌లోని పంచవళి గ్రామంలో ఒడ్డుకు రావడం మొదలైంది. కొన్ని రోజులుగా పెరిగిన నీరు... ఆదివారం తగ్గింది. అప్పుడు నది ఒడ్డున ఉన్న ఇసుకలో మెరుస్తూ వెండి నాణేలు కనిపించడంతో... ఊరోళ్లంతా పరుగెత్తుకుంటూ అక్కడికి వచ్చారు. పొలాల్లో వాళ్లు పంట పనులు మానేసి... అక్కడికి వెళ్లారు. అంతా వెళ్లి... నాది నాది అంటూ... ఆ నాణేలను పోటీపడి మరీ ఏరుకుంటున్నారు.

నిజానికి ఈ వరదల వల్ల 600 ఇళ్లు దెబ్బతిన్నాయి. 400 గ్రామాలు పూర్తిగా నీటిలో మునిగాయి. 1200 మంది ఇళ్లు కోల్పోయారు. ఇలాంటి విషాద పరిస్థితుల మధ్య వారికి ఈ నాణేలు లభించాయి. ఇది వారికి ఎంతో ఆనందాన్ని కలిగిస్తోంది. ప్రస్తుతం నదిలో నీరు చాలా ఎక్కువే ఉంది. కానీ... కొన్ని కాయిన్లు ఇసుకలో దొరికే సరికి... నది నీటిలో మరిన్ని కాయిన్లు దొరుకుతాయి అనే ఉద్దేశంతో చాలా మంది నదిలో దిగుతున్నారు. లక్కీగా అక్కడ ఏ సుడిగుండాలూ లేవు. కానీ నీటిలో వారికి కాయిన్లు దొరకట్లేదు.

ఇప్పటివరకూ దొరికిన నాణేలు... 280 ఏళ్ల కిందటివి అని తెలిసింది. అంటే 18వ శతాబ్దం నాటివి అన్నమాట. వాటిపై బ్రిటీష్ రాణి విక్టోరియా బొమ్మలున్నాయి. అంటే... 1840లో ఈస్ట్ ఇండియా కంపెనీ... వీటిని ముద్రించింది. ఐతే... ఈ నాణేలు ఎక్కడి నుంచి ఇలా వచ్చాయి... నదిలోనే ఇన్నేళ్లూ ఉన్నాయా అనే డౌట్లు ఉన్నాయి.

ఈ విషయం అధికారులకు సోషల్ మీడియా ద్వారా తెలిసింది. వెంటనే స్థానిక పోలీసులకు కాల్ చేసి... నది దగ్గరకు వెళ్లి... ఎవరూ కాయిన్లు పట్టుకుపోకుండా చూడమని ఆదేశించారు. అక్కడ దొరికే కాయిన్లను ప్రభుత్వానికి చెందేలా చర్యలు తీసుకోవాలని చెప్పారు.

ఇది కూడా చదవండి: Gold Rate Today: భారీగా తగ్గిన బంగారం, భారీగా పెరిగిన వెండి. నేటి రేట్లు ఇవీ

ఇక్కడో షాకింగ్ విషయం ఉంది. వారం కిందట... ఓ జాలరికి చిన్న కుండలో వెండి నాణేలు దొరికాయి. ఇప్పుడు మళ్లీ దొరుకుతున్నాయి. అందుకే ఇంకా ఇంకా దొరుకుతాయని భావిస్తున్నారు. ఇలా ఆ ఊరిలో నాణేల అంశం కలకలం రేపుతోంది.

First published:

Tags: Madhya pradesh, Viral, VIRAL NEWS

ఉత్తమ కథలు