హోమ్ /వార్తలు /ట్రెండింగ్ /

వింత కుక్కపిల్ల.. ఆరు కాళ్లు, రెండు తోకలు.. ఎలా ఆడుతుందో చూడండి..

వింత కుక్కపిల్ల.. ఆరు కాళ్లు, రెండు తోకలు.. ఎలా ఆడుతుందో చూడండి..

(Image-Facebook/Neel Veterinary Hospital)

(Image-Facebook/Neel Veterinary Hospital)

మాములుగా కుక్కలకు నాలుగు కాళ్లు, ఒక తోక ఉంటాయి. కానీ ఓ కుక్క పిల్ల మాత్రం ఆరు కాళ్లు, రెండు తోకలతో జన్మించింది.

మామూలుగా కుక్కలకు నాలుగు కాళ్లు, ఒక తోక ఉంటాయి. కానీ ఓ కుక్క పిల్ల మాత్రం ఆరు కాళ్లు, రెండు తోకలతో జన్మించింది. ఈ వింత ఘటన అమెరికాలోని ఓక్లహోమాలో చోటుచేసుకుంది. ప్రస్తుతం కుక్కపిల్ల ఆరోగ్యంగానే ఉన్నట్టుగా వైద్యులు తెలిపారు. వివరాలు.. ఈ ఆడ కుక్క పిల్ల ఓక్లహోమాలోని నీల్ వెటర్నరీ ఆస్పత్రిలో గత వారం జన్మించింది. ఆరు కాళ్లు, రెండు తోకలతో జన్మించిన ఈ కుక్క పిల్ల ఫొటోలను ఆస్పత్రి వర్గాలు సోషల్ మీడియాలో పోస్ట్ చేశాయి. సాధారణంగా వింత‌గా జ‌న్మించిన కుక్కపిల్లలు అనారోగ్యానికి గురయ్యేవని వారు అన్నారు. తాను ఇలాంటి వింత కుక్క‌ను గ‌తంలో ఎప్పుడూ చూడ‌లేద‌ని వ్యాఖ్యానించారు. ఇక, ప్రస్తుతం ఆ కుక్క పిల్ల చాలా ఆరోగ్యంగా ఉందని.. ఇతర కుక్కపిల్లల మాదిరిగానే బరువు కూడా పెరుగుతందని ఆస్పత్రి వైద్యులు తెలిపారు.

అయితే గర్భాశయంలో ఉన్నప్పుడు పిండాలు వేరు కాకపోవడంతో ఇలా జరిగిందని వైద్యులు భావిస్తున్నారు. పిండాలు వేరు అయి ఉంటే ఇంకో కుక్క పిల్ల జన్మించి ఉండేందని వారు అంటున్నారు. అలా జరగకపోవడం వల్ల ఈ కుక్క పిల్లకు అదనపు అవయవాలతో జన్మించిందని అన్నారు. అయితే కుక్క పిల్లకు ఫిజిక‌ల్ థెర‌పీ, శ‌స్త్ర‌చికిత్స‌లు అవ‌సర‌మ‌ని, కొంత వ‌య‌సు పెరిగిన త‌ర్వాత స‌ర్జరీ చేయాల్సి ఉంటుంద‌ని తెలిపారు.

ఇక, కుక్క పిల్ల మోనోసెఫాలస్ డిపైగస్ మరియు మోనోసెఫాలస్ రాచిపాగస్ డైబ్రాచియస్ టెట్రాపస్ అని పిలువబడే పుట్టుకతో వచ్చే రుగ్మతలు కలిగి ఉందని చెప్పారు. అంటే కుక్క‌పిల్ల‌కు ఒక త‌ల‌, ఒక ఛాతీ కుహ‌రం ఉండి.. రెండు పాయురంధ్రాలు, రెండు ప్ర‌త్యుత్ప‌త్తి వ్య‌వ‌స్థ‌లు, రెండు మూత్ర మార్గాలు ఉన్నాయ‌ని అర్థ‌మ‌ని వారు వివ‌రించారు. ఇక, ప్రస్తుతం కుక్క పిల్ల ఫొటోతో పాటు వీడియో కూడా సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

Published by:Sumanth Kanukula
First published:

Tags: Dog, USA, VIRAL NEWS

ఉత్తమ కథలు