Home /News /trending /

MINISTRY OF AYUSH ANNOUNCED MY LIFE MY YOGA VIDEO BLOGGING CONTEST KNOW HOW TO WIN PRIZE UP TO RS 100000 SS

International Yoga Day 2020: మీ యోగా వీడియో పంపిస్తే రూ.1,00,000 గెలుచుకునే ఛాన్స్

International Yoga Day 2020: మీ యోగా వీడియో పంపిస్తే రూ.1,00,000 గెలుచుకునే ఛాన్స్
(ప్రతీకాత్మక చిత్రం)

International Yoga Day 2020: మీ యోగా వీడియో పంపిస్తే రూ.1,00,000 గెలుచుకునే ఛాన్స్ (ప్రతీకాత్మక చిత్రం)

International Yoga Day 2020 | మీకు రోజూ యోగా చేసే అలవాటు ఉందా? అయితే మీరు రూ.1,00,000 వరకు గెలుచుకోవచ్చు. ఎలాగో తెలుసుకోండి.

    అంతర్జాతీయ యోగా దినోత్సవం రాబోతోంది. జూన్ 21న ప్రపంచమంతా 6వ ఇంటర్నేషనల్ యోగా డే సెలబ్రేట్ చేసుకోవడానికి సిద్ధమవుతోంది. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి కారణంగా ఈసారి బహిరంగ ప్రదేశాలు, స్టేడియంలలో యోగా దినోత్సవం జరుపుకోవడం సాధ్యం కాదు. భౌతిక దూరం పాటించాల్సిన అవసరం ఉండటంతో ఎక్కడివారక్కడే యోగా డే సెలబ్రేట్ చేసుకోవచ్చు. ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ, ఇండియన్ కౌన్సిల్ ఫర్ కల్చరల్ రిలేషన్స్ సంయుక్తంగా 'మై లైఫ్-మై యోగా' (జీవన్ యోగా) పేరుతో వీడియో బ్లాగింగ్ కాంటెస్ట్ నిర్వహిస్తోంది. ఈ కాంటెస్ట్ ద్వారా యోగా పట్ల అవగాహన పెంచేందుకు కృషి చేస్తోంది. ఆసక్తిగలవారు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ లాంటి సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ ద్వారా ఈ వీడియో కాంటెస్ట్‌లో పాల్గొనొచ్చు. ప్రపంచంలోని అన్ని దేశాల వారు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనేందుకు అవకాశం ఇస్తోంది కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ.


    మరి మీరు కూడా 'మై లైఫ్-మై యోగా' వీడియో బ్లాగింగ్ కాంటెస్ట్‌లో పాల్గొనాలనుకుంటే https://mylifemyyoga2020.com/ లేదా www.mygov.in/task/my-life-my-yoga వెబ్‌సైట్‌లో రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. మీరు యోగాసనాలు చేసే వీడియోను మూడు నిమిషాలు షూట్ చేయాలి. వీడియో ఏ భాషలో అయినా ఉండొచ్చు. #MyLifeMyYoga పేరుతో ఆ వీడియోను ఈ వెబ్‌సైట్‌లతో పాటు ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్‌లో అప్‌లోడ్ చేయాలి. కేంద్ర ఆయుష్ మంత్రిత్వ శాఖ పేజీని లైక్ చేసి ఫాలో చేయాలి. మీ వీడియోను ఈ పేజీకి ట్యాగ్ చేయాలి. జూన్ 21 వరకు ఈ కాంటెస్ట్‌లో పాల్గొనే అవకాశం ఉంటుంది. ఈ కాంటెస్ట్‌లో గెలిచిన వారికి రూ.1,00,000 వరకు బహుమతుల్ని ప్రకటించింది ఆయుష్ మంత్రిత్వ శాఖ. మొదటి బహుమతి రూ.1,00,000, రెండో బహుమతి రూ.50,000, మూడో బహుమతి రూ.25,000 గెలుచుకోవచ్చు. ఎంపిక చేసిన వీడియోలను ప్రభుత్వానికి చెందిన అన్ని సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌లోడ్ చేస్తారు.

    ఇవి కూడా చదవండి:

    Aadhaar card: పిల్లలకు ఆధార్ కార్డు... ఈ విషయాలు గుర్తుంచుకోండి

    Business Idea: మహిళలకు గొప్ప అవకాశం... రూ.10 లక్షల వరకు బిజినెస్ లోన్

    SBI Account: ఇంటి నుంచే ఎస్‌బీఐ అకౌంట్ ఓపెన్ చేయొచ్చు ఇలా
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Yoga, Yoga day, Yoga day 2020

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు