టాలెంట్ వయసు, భాషతో పని లేదని ఓ చిన్న పిల్లవాడు నిరూపించాడు. సరిగ్గా స్కూల్‌లో ఎల్‌కేజీ, ఫస్ట్ క్లాస్ చదివే వయసులో తనకంటూ ఓ గుర్తింపు సంపాధించుకున్నాడు. దేశ వ్యాప్తంగా అభిమానుల్ని సంపాధించుకున్నాడు. సెలబ్రిటీలు సైతం అతడ్ని పిలిపించుకొని అతనిలోని టాలెంట్‌ను చూసి సంతోషంతో మెచ్చుకునే స్థాయికి ఎదిగాడు. బీహార్ (Bihar)రాష్ట్రం ముజాఫర్‌పూర్(Muzaffarpur)లోని కాంతి ప్రాంతంలో నివసించే అన్ష్ (Ansh)అనే 8ఏళ్ల బాలుడు మిమిక్రీmimicryలో గొప్ప పేరు తెచ్చుకున్నాడు. ఒకరిద్దరు కాదు ఏకంగా 65 రకాలుగా తన గొంతు మార్చి హీరోలు, రాజకీయ నాయకుల్లా మాట్లాడటం, పక్షులు, జంతువుల శబ్ధాలను అనుకరిస్తూ సోషల్ మీడియా (Social media)సెలబ్రిటీ(Celebrity)గా మారాడు.
పిట్ట కొంచెం కూత ఘనం..
పిట్ట కొంచెం కూత ఘనం అంటే ఇదేనేమో. బీహార్‌కి చెందిన అన్ష్ అనే 8ఏళ్ల బాలుడు మిమిక్రీలో బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. 8ఏళ్ల వయసులో పూర్తిగా మాట్లాడటమే సరిగా రాని వయసులో సినిమా హీరోలు షారూఖ్‌ఖాన్, నానాపటేకర్, బాబీడియోల్‌తో పాటు రాజకీయ నేతలు లాలూ ప్రసాద్‌యాదవ్, రబ్రీదేవి, తేజ్ ప్రతాప్‌యాదవ్ ఇలా అందరి వాయిస్‌ని అనుకరిస్తూ ఓ సెలబ్రిటీగా మారిపోయాడు. తోటి పిల్లలతో ఆడుకోవాల్సిన వయసులో స్టేజీలపై షోలు చేస్తూ బాగా గుర్తింపు తెచ్చుకున్నాడు. భోజ్‌పురి గాయని నిషా ఉపాధ్యాయ్‌తో కలిసి అనేక ఫోరమ్‌లలో అన్ష్ తన మిమిక్రీ టాలెంట్‌ని ప్రదర్శించాడు.
బుడ్డోడు కాదు బ్రిలియంట్..
అన్ష్ తండ్రి మనోజ్ మిశ్రా ఆటో డ్రైవర్. కరోనా లాక్‌డౌన్ టైమ్‌లో ఒక్కొక్క వాయిస్‌ని ప్రాక్టీస్ చేయడం మొదలుపెట్టిన బుడ్డోడు...అతి తక్కువ కాలంలోనే అందరి వాయిస్‌లు అనుకరిస్తూ గొప్ప టాలెంట్ కిడ్‌గా మారాడు. ఈ పిల్లవాడి క్రేజ్ గురించి చెప్పాలంటే అన్ష్ చెప్పిన ఓ మిమిక్రీ వీడియో సోషల్ మీడియాలో 20మిలియన్ల వ్యూస్ దాటాయంటే ఏ రేంజ్‌లో గుర్తింపు వచ్చిందో అర్దం చేసుకోవచ్చు.
సోషల్ మీడియా స్టార్..
సోషల్ మీడియా ఫ్లాట్‌ఫామ్ మీదే కాదు...స్వయంగా లాలూప్రసాద్‌యాదవ్, రబ్రీదేవితో పాటు వాళ్ల కుటుంబ సభ్యుల వాయిస్ అనుకరిస్తున్నాడని తెలిసి స్వయంగా రబ్రీదేవి ఒకసారి అన్ష్ అనే 8ఏళ్ల బాలుడ్ని ఇంటికి పిలిపించుకొని మిమిక్రీ విన్నారు. పిల్లవాడిలోని టాలెంట్ చూసి ఉద్వేగానికి లోనైట్లుగా బాలుడి తండ్రి తెలిపాడు.
ఇంతింతై వటుడింతే..
లాలూ యాదవ్‌ను అనుకరించిన తర్వాత రబ్రీ దేవి మరియు తేజ్ ప్రతాప్ యాదవ్ స్వయంగా అన్ష్‌ని ఇంటికి పిలిచి అన్ష్ మిమిక్రీ మరియు పాటలు విన్నారు, రబ్రీ దేవి తన మిమిక్రీని విని స్వయంగా ఉద్వేగానికి లోనయ్యారని అన్ష్ చెప్పాడు. కార్యక్రమం మరియు ఆ కార్యక్రమంలో అన్ష్ నుండి లాలూ యాదవ్ మిమిక్రీని ధోనీ వినిపించాడు. నిన్నటి వరకు ఆటో డ్రైవర్‌గా పని చేస్తూ కుటుంబ భారాన్ని మోసిన అన్ష్ తండ్రి మనోజ్ మిశ్రా..కొడుకు టాలెంట్ అందరికి తెలిసిపోవడం, బిజీగా మారడంతో అతడ్ని స్టేజ్ షోలు, వీడియోలు రికార్డ్ చేసి సోషల్ మీడియాలో అప్‌లోడ్ చేసే పనులు చూస్తున్నాడు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Bihar News, Trending news, Viral Video