Viral Video: ఇదెక్కడి విచిత్రంరా బాబోయ్.. నదిలో పొంగిపొర్లుతున్న పాలు.. ఆశ్చర్యంతోపాటు భయపడిపోతున్న ప్రజలు..!

నదిలో పొంగి పొర్లుతున్న పాలు

ఆ నదిలో రోజూ నీళ్లే పారుతుంటాయి. కానీ ఆశ్చర్యంగా ఓ రోజు మాత్రం నీళ్లకు బదులుగా పాలు పొంగిపొర్లాయి. ఆ సన్నివేశాన్ని చూసిన ప్రజల్లో ఆశ్చర్యంతోపాటు భయం కూడా కలిగింది. ఇంతకీ ఎక్కడ జరిగిందంటే..

  • Share this:
    నగరానికి అత్యంత సమీపంలో ఉండే నది అది. దాన్ని చూసేందుకు పర్యాటకులు ఎగబడుతుంటారు. అక్కడ కాసేపయినా గడిపేందుకు చాలా మంది అలవాటు పడ్డారు. ఆ నదిలో జలజలా నీరు పారుతోంటే దాని ముందు నిలుచుని ఫొటోలను క్లిక్ మనిపిస్తుంటారు. కానీ ఉన్నట్టుండి ఆ నదిలో ఓ షాకింగ్ సీన్ కనిపించింది. అంతా సంభ్రమాశ్చర్యాలతో చూస్తూ ఉండిపోయారు. నీళ్లు పారాల్సిన ఆ నదిలో పాలు పొంగిపొర్లుతున్నాయి. గంటల కొద్దీ అలా పాలు ఆ నదిలో పారుతూనే ఉన్నాయి. అసలు పాలు ఎలా వస్తున్నాయి? ఎందుకు వస్తున్నాయో తెలియక అంతా అయోమయం చెందారు. పాలు పారుతున్న నదిని చూసేందుకు జనాలు క్యూ కట్టారు. ఆ తర్వాత అసలు సంగతేంటో తెలిసి అవాక్కయ్యారు. యునైటెడ్ కింగ్ డమ్ లో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

    యూకేలోని వేల్స్ నగరంలో దులైస్ అనే నది ఒకటి ఉంది. సిటీకి కాస్త దగ్గరగా ఉండటంతో నగర వాసులు అక్కడ రోజూ కాసేపయినా గడిపేందుకు అలవాటు పడ్డారు. రోజూ ఆ నదిలో నీరే పారుతుంటుంది. కానీ ఏప్రిల్ 14వ తారీఖున మాత్రం ఆ నదిలో పాలు పొంగిపొర్లాయి. కొన్ని గంటల పాటు అలా పాలు నదిలో పారుతూనే ఉన్నాయి. నదిలో పాలు పొంగిపొర్లుతున్నాయన్న సంగతి తెలిసి జనాలంతా దాన్ని చూసేందుకు క్యూకట్టారు. వీడియోలు తీస్తూ నెట్టింట పెట్టారు.


    ఇది కూడా చదవండి: Viral Video: వావ్.. ఏం నటన గురూ.. అదరగొట్టేశావ్.. నెట్టింట వైరల్ అవుతున్న వీడియో.. ఫన్నీ కామెంట్స్ తో సెటైర్లు..!

    ఇదేం విచిత్రంరా బాబోయ్ అంటూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. మీడియా రంగంలోకి దిగి అసలేం జరిగిందో ఆరా తీశారు. నదికి కాస్త దూరంలో ఓ భారీ పాల ట్యాంకర్ బోల్తా పడింది. దీంతో దాంట్లో ఉన్న పాలన్నీ నదిలోకి ప్రవహించాయి. వందల లీటర్ల పాలనుకుంటే పొరపాటే. దాదాపు 28000 లీటర్ల పాలతో వెళ్తున్న ట్యాంక్ బోల్తా పడటంతో ఆ పాలన్నీ నీళ్లపాలయ్యాయి. నదిలో పాల ప్రవాహాన్ని చూసిన స్థానికులు నోరెళ్లబెట్టారు. మరో ఉపద్రవం ఏదైనా ముంచుకొస్తోందేమోనని భయపడిన వాళ్లు కూడా ఉన్నారు. ఆ తర్వాత అసలు విషయం తెలియడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.
    Published by:Hasaan Kandula
    First published: