MIGRANT WORKER FROM WEST BENGAL WON LOTTERY AND MANAGED TO BAG RS 80 LAKH SSR
West Bengal Migrant Worker: నలభై రూపాయలు ఖర్చు పెడితే.. అతనికి రూ.80 లక్షలొచ్చాయ్.. ఎలాగంటే..
ప్రతీకాత్మక చిత్రం
అతనో రోజువారీ కూలీ. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం బెంగాల్ నుంచి కేరళకు వలస వెళ్లాడు. కన్స్ట్రక్షన్లో వర్కర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. నక్క తోక తొక్కాడో లేక పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాడో గానీ...
తిరువనంతపురం: అతనో రోజువారీ కూలీ. బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం బెంగాల్ నుంచి కేరళకు వలస వెళ్లాడు. కన్స్ట్రక్షన్లో వర్కర్‌గా పనిచేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. అతనికి కనీసం బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. రెక్కాడితే కానీ డొక్కాడని ఈ వ్యక్తికి అదృష్టం కలిసొచ్చింది. నక్క తోక తొక్కాడో లేక పొద్దున్నే లేచి ఎవరి ముఖం చూశాడో గానీ ధనలక్ష్మి అతనిని వెతుక్కుంటూ వచ్చింది. వందల్లో కూలీ తీసుకునే అతనికి లక్షలు తెచ్చి పెట్టింది. కేవలం 40 రూపాయలు అతనికి 80 లక్షలు తెచ్చిపెట్టాయి. నమ్మబుద్ది కాకపోయినప్పటికీ ఇది నిజం.
పూర్తి వివరాల్లోకి వెళితే.. పశ్చిమ బెంగాల్‌కు చెందిన ప్రతిభ మండల్ అనే వ్యక్తి బతుకుదెరువు కోసం నాలుగేళ్ల క్రితం కేరళకు వచ్చి కన్స్ట్రక్షన్ వర్కర్‌గా పనిచేస్తూ పొట్ట నింపుకుంటున్నాడు. కేరళ ప్రభుత్వం ఇటీవల నిర్వహించిన కారుణ్య ప్లస్ లాటరీలో 40 రూపాయలు పెట్టి టికెట్ కొన్నాడు. ఈ కారుణ్య ప్లస్ లాటరీకి సంబంధించి ప్రతీ గురువారం డ్రా తీసి విజేతలను ప్రకటిస్తారు. అలాగే.. సరిగ్గా రెండు రోజుల క్రితం.. గత గురువారం కూడా విజేతలను ప్రకటించారు. డ్రా తీయగా.. ప్రతిభా మండల్ జాక్‌పాట్ కొట్టాడు. ఈ డ్రాలో ఫస్ట్ ప్రైజ్ ప్రతిభా మండల్‌ను వరించింది.
ఫస్ట్ ప్రైజ్ 80 లక్షల రూపాయలను పొందే అవకాశం అతనికి దక్కింది. తాను కొన్న 40 రూపాయల లాటరీ టికెట్ అతనిని లక్షాధికారిని చేస్తుందని మండల్ కలలో కూడా ఊహించి ఉండడు. అయితే.. మండల్‌కు బ్యాంక్ అకౌంట్ కూడా లేదు. దీంతో.. తనకు అదృష్టాన్ని తెచ్చి పెట్టిన లాటరీ టికెట్‌ను దాచలేమోనన్న భయంతో కేరళ పోలీసులను ఆశ్రయించాడు. పుజప్పురలోని కెనరా బ్యాంక్ బ్రాంచ్‌లో అతనితో కొత్త బ్యాంక్ అకౌంట్‌ను పోలీసులు ఓపెన్ చేయించారు.
పోలీస్ స్టేషన్‌కు వెళ్లిన బ్యాంకు అధికారులు మండల్ దగ్గర నుంచి లాటరీ టికెట్‌ను తీసుకుని బ్యాంకు లాకర్లో భద్రపరిచారు. లాటరీ ప్రైజ్ మనీ రూ.5వేల కంటే తక్కువగా ఉంటే కేరళలోని ఏ లాటరీ షాప్‌కు వెళ్లయినా డబ్బు పొందవచ్చు. అదే ప్రైజ్ మనీ రూ.5వేల కంటే ఎక్కువగా ఉంటే ఆ టికెట్‌తో పాటు ఐడీ ఫ్రూఫ్‌ను బ్యాంకులో గానీ, కేరళ ప్రభుత్వ లాటరీ ఆఫీస్‌లో గానీ సమర్పించాలి. ఫలితాలు వెలువడిన 30 రోజుల లోపే ఈ వివరాలను అందించాల్సి ఉంటుంది.